POCO X6 Neo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 13 Mar 2024 10:09:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO: డైమెన్సిటీ 6080 చిప్సెట్‌తో లాంచైన X6 Neo https://www.91mobiles.com/telugu/poco-x6-neo-launched-india-dimensity-6080-chipset/ Wed, 13 Mar 2024 10:09:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=10665 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO తాజాగా ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. POCO X6 Neo పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 24జిబి ర్యామ్ పవర్, 108ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. POCO X6 Neo ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. POCO X6 Neo […]

The post POCO: డైమెన్సిటీ 6080 చిప్సెట్‌తో లాంచైన X6 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో POCO X6 Neo లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 24జిబి వరకు ర్యామ్ పవర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO తాజాగా ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. POCO X6 Neo పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 24జిబి ర్యామ్ పవర్, 108ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. POCO X6 Neo ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6 Neo ధర, లభ్యత

POCO X6 Neo డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

POCO X6 Neo 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంది.

POCO X6 Neo ఆస్ట్రల్ బ్లాక్, హరైజన్ బ్లూ మరియు మార్షియన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేడు రాత్రి 7 గంటల నుంచి ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై వినియోగదారులకు రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు రూ.1,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తాయి. అంతేకాదు, ఇంకా 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

POCO X6 Neo స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO X6 Neo లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో, 100% డీసీఐ పీ3 కలర్ గేముత్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO X6 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 Neo డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ తో గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకోవచ్చు.
  • కెమెరా: POCO X6 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: POCO X6 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: POCO X6 Neo ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో పాటు, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • ఇతర ఫీచర్లు: POCO X6 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఐపీ54 రేటింగ్, 7 5జీ బ్యాండ్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post POCO: డైమెన్సిటీ 6080 చిప్సెట్‌తో లాంచైన X6 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
POCO X6 Neo ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/poco-x6-neo-india-launch-confirmed/ Wed, 06 Mar 2024 14:56:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10574 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO X6 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారైంది. పోకో ఇండియా అధినేత హిమాన్శు టాండన్ లాంచ్ ‌ని స్వయంగా కన్ఫర్మ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. POCO X6 Neo ఇండియా లాంచ్ ఖరారు […]

The post POCO X6 Neo ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6 Neo
  • డైమెన్సిటీ 6080 చిప్‌తో వస్తోన్న ఫోన్
  • 108ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO X6 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారైంది. పోకో ఇండియా అధినేత హిమాన్శు టాండన్ లాంచ్ ‌ని స్వయంగా కన్ఫర్మ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO X6 Neo ఇండియా లాంచ్ ఖరారు

పోకో ఇండియా హెడ్ హిమాన్శు టాండన్ POCO X6 Neo లాంచ్ కన్ఫర్మ్ చేశారు. అలాగే నేడు లాంచైన Realme 12 5G పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

నేటి రియల్మీ 12 5జీ లాంచ్ చూశాక, అందరూ నియో కోసం వేచి చూడాలని టాండన్ కోరారు.

POCO M6 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వచ్చిందని దీని ధర కేవలం రూ.10,000 అని ఆయన చెప్పారు.

మార్చి 11 మరియు మార్చి 15 మధ్య POCO X6 Neo లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

POCO X6 Neo ఇండియా ధర (లీక్)

లీకైన రిపోర్ట్ ప్రకారం, POCO X6 Neo డివైజ్ భారత్ లో రూ.16,000 లోపు ధరతో లాంచ్ కానుందని సమాచారం. అంటే రూ.15,499 వద్ద ఫోన్ ధర ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇది బేస్ వేరియంట్ ధర అయ్యే అవకాశం ఉంది. అధిక స్టోరేజీ మోడల్స్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

POCO X6 Neo స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: POCO X6 Neo స్మార్ట్‌ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920పీడబ్ల్యూఎమ్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO X6 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 Neo లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: POCO X6 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి.
  • బ్యాటరీ: POCO X6 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: POCO X6 Neo ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

The post POCO X6 Neo ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్! https://www.91mobiles.com/telugu/poco-x6-neo-poco-f6-india-launch-timeline-leaked/ Sun, 11 Feb 2024 06:38:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10198 Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO X6 Neo, POCO F6 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించి అధికార సమాచారం ఇంకా బయటకు రాలేదు. కానీ, టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ సౌజన్యంతో 91mobiles ఈ రెండు ఫోన్లకు సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. మార్చిలో భారత్‌లో లాంచ్ కానున్న POCO X6 Neo (లీక్) రిపోర్ట్ ప్రకారం, POCO X6 […]

The post POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన POCO X6 Neo, POCO F6 లాంచ్ టైమ్‌లైన్
  • Redmi Note 13R Pro కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO X6 Neo
  • జులైలో POCO F6 భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO X6 Neo, POCO F6 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించి అధికార సమాచారం ఇంకా బయటకు రాలేదు. కానీ, టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ సౌజన్యంతో 91mobiles ఈ రెండు ఫోన్లకు సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

మార్చిలో భారత్‌లో లాంచ్ కానున్న POCO X6 Neo (లీక్)

  • రిపోర్ట్ ప్రకారం, POCO X6 Neo భారత్ లో మార్చి నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • POCO X6 Neo డివైజ్ Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
  • 2024 ప్రథమార్థంలో లాంచ్ కాబోయే చివరి ఫోన్ POCO X6 Neo అని రిపోర్ట్ తెలియజేస్తోంది.
  • మరొక ఫోన్ POCO F6 భారత్ లో జులైలో లాంచ్ కానుందని ఈ రిపోర్ట్ తెలియజేసింది.
  • POCO F6 ఇప్పటికే సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సర్టిఫికేషన్ ని పొందింది. ఈ డివైజ్ 2311DRK48G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • భారత్ కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై కూడా POCO F6 లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ Redmi K70E కి రీబ్రాండ్ గా రానుందని సమాచారం. రెడ్మీ కే70ఈ గతేడాది నవంబర్ లో చైనాలో లాంచ్ అయ్యింది.

Remi Note 13R Pro (POCO X6 Neo) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Remi Note 13R Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (1080*2400 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 395 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Remi Note 13R Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్సెట్, అడ్రెనో మాలి-జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Remi Note 13R Pro లో 12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Remi Note 13R Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Remi Note 13R Pro లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Remi Note 13R Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Remi Note 13R Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Remi Note 13R Pro డివైజ్ 161.1 మి.మీ పొడవు, 75మి.మీ వెడల్పు, 7.7 మి.మీ మందం, 175 గ్రాముల బరువు ఉంటుంది.
  • కలర్స్: Remi Note 13R Pro టైమ్ బ్లూ, మార్నింగ్ లైట్ గోల్డ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన POCO X6 Neo; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/poco-x6-neo-spotted-bis-certification-site-india-launch-soon/ Mon, 20 Nov 2023 15:33:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=8906 షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 Neo డివైజ్ లాంచ్ కానుంది. రానున్న కొన్ని నెలల్లో భారతీయ మార్కెట్ లోకి POCO X6 Neo ప్రవేశించనుంది. Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా POCO X6 Neo వస్తున్నట్లు సమాచారం. తాజాగా POCO X6 Neo ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్టైంది. దీంతో పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో […]

The post BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన POCO X6 Neo; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న POCO X6 Neo
  • బీఐఎస్ పై లిస్టైన POCO X6 Neo
  • 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 Neo డివైజ్ లాంచ్ కానుంది. రానున్న కొన్ని నెలల్లో భారతీయ మార్కెట్ లోకి POCO X6 Neo ప్రవేశించనుంది. Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా POCO X6 Neo వస్తున్నట్లు సమాచారం. తాజాగా POCO X6 Neo ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్టైంది. దీంతో పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO X6 Neo బీఐఎస్ లిస్టింగ్

  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై 2311FRAFDI అనే మోడల్ నంబర్ తో POCO X6 Neo డివైజ్ కనిపించింది.
  • ఈ మోడల్ నంబర్ Redmi Note 13R Pro మోడల్ నంబర్ 2311FRAFDC ని పోలి ఉంది. ఇటీవలె ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది.
  • POCO X6 Neo డివైజ్ Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పితే, మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. కానీ, బీఐఎస్ లిస్టింగ్ అనేది త్వరలోనే POCO X6 Neo డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని తెలియజేస్తోంది.

Redmi Note 13R Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13R Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13R Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13R Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi Note 13R Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి 3ఎక్స్ జూమ్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13R Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13R Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

The post BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన POCO X6 Neo; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>