POCO: డైమెన్సిటీ 6080 చిప్సెట్‌తో లాంచైన X6 Neo

Highlights

  • భారత్‌లో POCO X6 Neo లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 24జిబి వరకు ర్యామ్ పవర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO తాజాగా ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. POCO X6 Neo పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 24జిబి ర్యామ్ పవర్, 108ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. POCO X6 Neo ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6 Neo ధర, లభ్యత

POCO X6 Neo డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

POCO X6 Neo 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంది.

POCO X6 Neo ఆస్ట్రల్ బ్లాక్, హరైజన్ బ్లూ మరియు మార్షియన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేడు రాత్రి 7 గంటల నుంచి ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై వినియోగదారులకు రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు రూ.1,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తాయి. అంతేకాదు, ఇంకా 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

POCO X6 Neo స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO X6 Neo లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో, 100% డీసీఐ పీ3 కలర్ గేముత్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO X6 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 Neo డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ తో గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకోవచ్చు.
  • కెమెరా: POCO X6 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: POCO X6 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: POCO X6 Neo ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో పాటు, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • ఇతర ఫీచర్లు: POCO X6 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఐపీ54 రేటింగ్, 7 5జీ బ్యాండ్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleMotorola: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G 5G (2024)
Next articleiQOO: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న Z9 Turbo
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.