
షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 Neo డివైజ్ లాంచ్ కానుంది. రానున్న కొన్ని నెలల్లో భారతీయ మార్కెట్ లోకి POCO X6 Neo ప్రవేశించనుంది. Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా POCO X6 Neo వస్తున్నట్లు సమాచారం. తాజాగా POCO X6 Neo ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్టైంది. దీంతో పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
POCO X6 Neo బీఐఎస్ లిస్టింగ్

- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై 2311FRAFDI అనే మోడల్ నంబర్ తో POCO X6 Neo డివైజ్ కనిపించింది.
- ఈ మోడల్ నంబర్ Redmi Note 13R Pro మోడల్ నంబర్ 2311FRAFDC ని పోలి ఉంది. ఇటీవలె ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది.
- POCO X6 Neo డివైజ్ Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
- బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పితే, మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. కానీ, బీఐఎస్ లిస్టింగ్ అనేది త్వరలోనే POCO X6 Neo డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని తెలియజేస్తోంది.
Redmi Note 13R Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 13R Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13R Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13R Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Redmi Note 13R Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి 3ఎక్స్ జూమ్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi Note 13R Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13R Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.











