Realme 12 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 06 Mar 2024 11:24:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Realme 12 5G https://www.91mobiles.com/telugu/realme-12-5g-launched-india-mediatek-dimensity-6100-plus-chipset/ Wed, 06 Mar 2024 11:24:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10564 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12 5G అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. ఆపిల్ డివైజెస్ లో కనిపించే డైనమిక్ బటన్ మాదిరి ఫీచర్ Realme 12 5G లో ఉండటం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 108ఎంపి 3ఎక్స్ జూమ్ పొట్రెయిట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి Realme 12 5G డివైజ్ యొక్క పూర్తి […]

The post Realme: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Realme 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Realme 12 5G
  • 108ఎంపి కెమెరాతో వచ్చిన ఫోన్
  • Realme 12 5G ప్రారంభ ధర రూ.16,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12 5G అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. ఆపిల్ డివైజెస్ లో కనిపించే డైనమిక్ బటన్ మాదిరి ఫీచర్ Realme 12 5G లో ఉండటం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 108ఎంపి 3ఎక్స్ జూమ్ పొట్రెయిట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి Realme 12 5G డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12 5G ధర

Realme 12 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది.

Realme 12 5G ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme 12 5G డివైజ్ మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Realme 12 5G డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ యొక్క కొత్త ఆఫర్ లో భాగంగా, రూ.2,998 విలువ గల రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 ని యూజర్లు ఉచితంగా పొందవచ్చు.

Realme 12 5G డిజైన్

Realme 12 5G స్మార్ట్‌ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.

ఇంకా డ్యూయల్ కెమెరా సెటప్ తో పాటు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ ముందువైపు ఫ్లాట్ ప్యానెల్ ఉంది.

Realme 12 5G డివైజ్ ట్విలైట్ పర్పుల్ మరియు ఉడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 91.40% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • కెమెరా: Realme 12 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 12 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కనెక్టివిటీ: Realme 12 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Realme 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/realme-12-5g-realme-12-plus-5g-india-prices-color-options-leaked/ Tue, 05 Mar 2024 06:24:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=10535 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Realme 12 5G, Realme 12+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 6న ముంబైలో జరిగే ఈవెంట్ ఈ హ్యాండ్సెట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్‌కి ముందు తాజాగా Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్స్ యొక్క ఇండియన్ మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన ధర వివరాలు, డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Realme 12 5G, […]

The post Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 6న లాంచ్ అవుతోన్న Realme 12 5G, 12+ 5G
  • తాజాగా లీకైన డివైజెస్ ఇండియా ధరలు
  • Realme 12 5G ధర రూ.18,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Realme 12 5G, Realme 12+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 6న ముంబైలో జరిగే ఈవెంట్ ఈ హ్యాండ్సెట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్‌కి ముందు తాజాగా Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్స్ యొక్క ఇండియన్ మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన ధర వివరాలు, డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12 5G, Realme 12+ 5G ధర

  • Realme 12 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.18,999 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఇది టాప్ మోడల్ ధర కాగా, బేస్ వేరియంట్ మరింత చవక ధరకి అందుబాటులో ఉంటుందని సమాచారం.
  • Realme 12 5G స్మార్ట్‌ఫోన్ ఉడ్‌ల్యాండ్ గ్రీన్ మరియు ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G ధర

  • Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంటుందని సమాచారం.
  • మిగతా వేరియంట్స్ ధరలు రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.
  • Realme 12+ 5G డివైజ్ పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2400*1080 పిక్సెల్స్), హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ స్క్రీన్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ 163 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం ఉంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: భారత్‌లో నేటి నుంచి మొదలైన Realme 12 5G, Realme 12+ 5G ప్రీ-ఆర్డర్స్ https://www.91mobiles.com/telugu/realme-12-5g-12-plus-5g-pre-orders-started-india/ Thu, 29 Feb 2024 17:29:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10503 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో మార్చి 6న Realme 12+ 5G ని లాంచ్ చేయబోతోంది. అయితే ఈ ఫోన్ తో పాటు Realme 12 5G ని కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా రియల్మీ ప్రకటించింది. Realme 12 5G డివైజ్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని రియల్మీ వెల్లడించింది. Realme 12+ 5G డివైజ్ వైట్ కలర్ ఆప్షన్ లో వస్తోంది. Realme […]

The post Realme: భారత్‌లో నేటి నుంచి మొదలైన Realme 12 5G, Realme 12+ 5G ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12 5G, 12+ 5G లాంచ్ తేదీ మార్చి 6
  • నేటి నుంచి మొదలైన ప్రీ-ఆర్డర్స్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో మార్చి 6న Realme 12+ 5G ని లాంచ్ చేయబోతోంది. అయితే ఈ ఫోన్ తో పాటు Realme 12 5G ని కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా రియల్మీ ప్రకటించింది. Realme 12 5G డివైజ్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని రియల్మీ వెల్లడించింది. Realme 12+ 5G డివైజ్ వైట్ కలర్ ఆప్షన్ లో వస్తోంది.

Realme 12 5G లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు

  • Realme 12 5G లాంచ్ వివరాలు X ప్లాట్ఫామ్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి.
  • Realme 12 5G తో పాటు Realme 12+ 5G డివైజ్ మార్చి 6న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుందని కంపెనీ వదిలిన కొత్త టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • రెండు ఫోన్లు కూడా నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వచ్చాయి.
  • Realme 12 5G 108ఎంపి క్లియర్ పొట్రెయిట్ మాస్టర్ కెమెరా, 3ఎక్స్ జూమ్ ఫీచర్ తో వస్తోంది.

Realme 12 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme 12 5G లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: Realme 12 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.
  • కెమెరా: Realme 12 5G డివైజ్ లో భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ లేదా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme 12 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Realme: భారత్‌లో నేటి నుంచి మొదలైన Realme 12 5G, Realme 12+ 5G ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G https://www.91mobiles.com/telugu/realme-12-5g-listed-on-bis-and-other-websites/ Tue, 27 Feb 2024 06:09:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=10439 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్‌కు మరొక మోడల్‌ని జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ Realme 12 5G పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు Realme 12+ 5G మార్చి 6న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈలోపు Realme 12 5G బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఈఈసీ, టీకేడీఎన్, ఎస్ఐఆర్ఐఎమ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ […]

The post Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12 5G
  • సర్టిఫికేషన్ సైట్స్ ద్వారా రివీలైన వివరాలు
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్‌కు మరొక మోడల్‌ని జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ Realme 12 5G పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు Realme 12+ 5G మార్చి 6న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈలోపు Realme 12 5G బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఈఈసీ, టీకేడీఎన్, ఎస్ఐఆర్ఐఎమ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి అవేంటో తెలుసుకుందాం.

Realme 12 5G లిస్టింగ్ వివరాలు

 

  • Realme 12 5G డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పై RMX3999 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • టీయూవీ రెయిన్‌ల్యాండ్ లిస్టింగ్ పై 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో Realme 12 5G కనిపించింది. అంటే ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అని అంచనా వేయవచ్చు.
  • ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Realme 12 5G డివైజ్ యొక్క మోడల్ నంబర్, పేరు కన్ఫర్మ్ అయ్యాయి.
  • Realme 12 5G ఫోన్ ఈఈసీ, టీకేడీఎన్, ఇండోనేషియా టెలీకామ్ సర్టిఫికేషన్ సైట్స్ పై RMX3999 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • FCC లిస్టింగ్ పై 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్స్ రివీల్ అయ్యాయి.
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో Realme 12 5G వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా రివీల్ అయ్యింది.
  • ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై Realme 12 5G ఫోటో కూడా కనిపించింది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ మాడ్యూల్ తో ఫోన్ కనిపిస్తోంది.

Realme 12 5G కెమెరా ఎఫ్‌వీ-5 లిస్టింగ్

  • Realme 12 5G డివైజ్ కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్ లిస్టింగ్ పై కనిపించింది.
  • లిస్టింగ్ ప్రకారం, Realme 12 5G డివైజ్ f/1.8 అపర్చర్, 5.2ఎంఎం ఫోకల్ లెంగ్త్, జెపీఈజీ ఇమేజ్ ఫార్మాట్ కి సపోర్ట్ చేస్తుంది.
  • Realme 12 5G డివైజ్ f/2.0 అపర్చర్, 2.6ఎంఎం ఫోకల్ లెంగ్త్ సపోర్ట్ తో వస్తోంది.

The post Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>