Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్

Highlights

  • మార్చి 6న లాంచ్ అవుతోన్న Realme 12 5G, 12+ 5G
  • తాజాగా లీకైన డివైజెస్ ఇండియా ధరలు
  • Realme 12 5G ధర రూ.18,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Realme 12 5G, Realme 12+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 6న ముంబైలో జరిగే ఈవెంట్ ఈ హ్యాండ్సెట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్‌కి ముందు తాజాగా Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్స్ యొక్క ఇండియన్ మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన ధర వివరాలు, డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12 5G, Realme 12+ 5G ధర

  • Realme 12 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.18,999 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఇది టాప్ మోడల్ ధర కాగా, బేస్ వేరియంట్ మరింత చవక ధరకి అందుబాటులో ఉంటుందని సమాచారం.
  • Realme 12 5G స్మార్ట్‌ఫోన్ ఉడ్‌ల్యాండ్ గ్రీన్ మరియు ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G ధర

  • Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంటుందని సమాచారం.
  • మిగతా వేరియంట్స్ ధరలు రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.
  • Realme 12+ 5G డివైజ్ పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2400*1080 పిక్సెల్స్), హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ స్క్రీన్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ 163 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం ఉంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
Previous articleSamsung: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy F15 5G
Next articleLava: కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Blaze Curve 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.