Realme 9i 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Sep 2022 14:34:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3t-5g-realme-9i-5g-ralme-c30s-narzo-50i-prime-first-sale/ Thu, 22 Sep 2022 14:29:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=2521 హైలైట్స్: సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్ తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల […]

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు
  • విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G
  • విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్

తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల చేస్తూ జనాల నుంచి మన్ననలు అందుకుంటోంది. మరీ ముఖ్యంగా రియల్మీ లో-బడ్జెట్ ఫోన్లను జనాలు బాగా ఇష్టపడతారు. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను అందిస్తుండటమే ఇందుకు కారణం. ఈ నెలలో ఎన్నో స్మార్ట్ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. రేపు, అనగా సెప్టెంబర్ 23 న మరికొన్న రియల్మీ ఫోన్లు యూజర్లను పలకరించబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme C30s, Realme Narzo 50i Prime, Realme 9i 5G and Realme GT Neo 3T 5G ఫోన్లు సెప్టెంబర్ 23 న భారత మార్కెట్ లో తొలిసారిగా సేల్ కి వస్తున్నాయి. ఈ నాలుగు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణులను ఉద్దేశించి విడుదల అయ్యాయి. సెగ్మెంట్ బెస్ ఫీచర్లను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ల ధర, సేల్ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Realme C30S

Realme C30S ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. మొదటి సేల్ లో కంపెనీ రూ.100 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ని రేపటి నుంచి కొనుగోలు చేయవచ్చు. స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Realme Narzo 50i Prime

Realme Narzo 50i Prime రేపటి నుంచి సేల్ కి వస్తోంది. రెండు వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ పై రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme 9i 5G

Realme 9i 5G ఫోన్ సెప్టెంబర్ 23 నుంచి సేల్ కి వస్తోంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. రియల్మీ కంపెనీ అదనంగా రూ.250 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Realme GT Neo 3T 5G

భారత్ లో Realme GT Neo 3T 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.29,999. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.31,999. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.33,999. Realme GT Neo 3T 5G ఫోన్ ని డ్యాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో సెప్టెంబర్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు.

The post సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి వస్తున్న నాలుగు Realme ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50ఎంపి కెమెరాతో లాంచ్ అయిన Realme 9i 5G: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-9i-5g-launched-india-price-specs/ Thu, 18 Aug 2022 10:01:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=1755 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన రియల్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో రియల్ మీ 9ఐ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం రియల్ మీ 9ఐ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇది రియల్ మీ నుంచి వచ్చిన లేటెస్ట్ […]

The post డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50ఎంపి కెమెరాతో లాంచ్ అయిన Realme 9i 5G: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన రియల్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్
  • 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో రియల్ మీ 9ఐ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం

రియల్ మీ 9ఐ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇది రియల్ మీ నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్. దేశంలో రియల్ మీ 9ఐ 4జీ ఫోన్ ని లాంచ్ చేశాక కొన్ని నెలలకు ఈ 5జీ వర్షన్ ని రియల్ మీ లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ మనకు తొలి వింటేజ్ సీడీ డిజైన్ ని తీసుకొచ్చింది. ఎంఈటీ గాలా 2022 ట్రెండ్ స్పూర్తి తో ఈ డిజైన్ ను రూపొందించారు. కాంతి తగిలినప్పుడు సీడీ మాదిరిగానే ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగు మెరుస్తూ, మారుతూ ఉంటుంది. ఇక సెల్ఫీ స్నాపర్ కోసం ముందువైపున వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. అలాగే భద్రత కొరకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరాల కటౌట్ ఉంది.

6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 128జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రధాన ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

భారత్ లో Realme 9i ధర, అమ్మకపు వివరాలు

రియల్ మీ 9ఐ 5జీ 4జిబి + 64జిబి మోడల్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్స్, ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా ఆగస్టు 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కంపెనీ రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది.

Realme 9i 5G స్పెసిఫికేషన్స్

రియల్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90.5 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-జీ57 ఎంసీ2 950మెగాహెర్ట్జ్, 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 3జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

రియల్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12, రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ వైఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. భద్రత కొరకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

రియల్ మీ 9ఐ లో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా కాగా, రెండోది 2ఎంపి మ్యాక్రో లెన్స్, మూడోది 2ఎంపి పోట్రెయిట్ లెన్స్. అలాగే వెనకాల ఎల్ఈడీ ఫ్లాష్ ని అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8 ఎంపి కెమెరాను అందించారు.

The post డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50ఎంపి కెమెరాతో లాంచ్ అయిన Realme 9i 5G: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Realme 9i 5G రెండర్స్ https://www.91mobiles.com/telugu/realme-9i-5g-renders-leaked-before-launch/ Sun, 14 Aug 2022 11:08:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=1673 హైలైట్స్: త్వరలో రియల్ మీ కంపెనీ నుంచి రానున్న బడ్జెట్ ఫోన్ రియల్ మీ 9ఐ 5జీ రెండు కలర్ వేరియంట్స్ లో రానున్న హ్యాండ్సెట్ ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోన్న రియల్ మీ 9ఐ 5జీ మైక్రోసైట్ రియల్ మీ కంపెనీ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 9ఐ 5జీ ఆగస్టు 18 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే ఫోన్ మరికొన్ని రోజుల్లో లాంచ్ అవుతోందనగా, ఫోన్ రెండర్స్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Realme 9i 5G రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో రియల్ మీ కంపెనీ నుంచి రానున్న బడ్జెట్ ఫోన్ రియల్ మీ 9ఐ 5జీ
  • రెండు కలర్ వేరియంట్స్ లో రానున్న హ్యాండ్సెట్
  • ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోన్న రియల్ మీ 9ఐ 5జీ మైక్రోసైట్

రియల్ మీ కంపెనీ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 9ఐ 5జీ ఆగస్టు 18 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే ఫోన్ మరికొన్ని రోజుల్లో లాంచ్ అవుతోందనగా, ఫోన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. లీక్స్ ద్వారా ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్, లేజర్ లైట్ డిజైన్ కనిపించాయి. బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్స్ లో ఈ హ్యాండ్సెట్ లభించనుంది. ఫ్లిప్ కార్ట్ లో ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ఒక మైక్రోసైట్ కనిపిస్తోంది.

Realme 9i 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

రియల్ మీ 9ఐ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ను కలిగి ఉండనుంది. అలాగే 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్లో ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. లుక్స్ పరంగా చూస్తే, ఈ హ్యాండ్సెట్ రియల్ మీ 9ఐ 4జీ మోడల్ మాదిరి కనిపిస్తున్నాయి. రియల్ మీ 9ఐ కొన్ని వారాల క్రితమే లాంచ్ అయ్యింది.

ట్విట్టర్ లో టిప్ స్టార్ సుదాన్శు అంభోరే షేర్ చేసిన రెండర్స్ ని బట్టి, రియల్ మీ 9ఐ 5జీ నలుపు, బంగారు వర్ణాల్లో లభించనుంది. ఇదివరకు అనుకున్నట్లు, రెండర్స్ లో ట్రిపుల్ కెమెరా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశముంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

ఫ్లాట్ సైడ్స్ తో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్ లో కుడివైపున పవర్ బటన్, ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక ముందు వైపు డిజైన్ ని గమనిస్తే, బాటమ్ లో భారీగా చిన్ కనిపిస్తోంది. సెల్ఫీ కెమెరా కోసం డ్యూ-డ్రాప్ నాచ్ ఉంది. ఇక డిస్ప్లే సైజ్ గురించి పూర్తి వివరాలు తెలియదు. అయితే, 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఇందులో ఉండే అవకాశముంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్, రియల్ మీ యూఐ 2.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. రియల్ మీ 9ఐ 5జీ ఫోన్ ధర దాదాపు రూ.15,000 ఉండే అవకాశముంది.

Realme 9i 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్, రియల్ మీ యూఐ 2.0 కస్టమ్ స్కిన్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

ఆగస్టు 18 న ఉదయం 11.30 గంటలకు రియల్ మీ 9ఐ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరింత సమాచారం తెలుస్తాయి.

The post లాంచ్ కి ముందు లీకైన Realme 9i 5G రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>