హైలైట్స్:
- సెప్టెంబర్ 23 న తొలిసారి సేల్ కి వస్తున్న 4 రియల్మీ ఫోన్లు
- విక్రయానికి వస్తున్న ఫోన్లు: Realme C30S, Narzo 50i Prime, Realme 9i 5G, Realme GT Neo 3T 5G
- విభిన్న బడ్జెట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హ్యాండ్సెట్స్
తక్కువ కాలంలోనే రియల్మీ సంస్థ భారత మార్కెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లను విడుదల చేస్తూ జనాల నుంచి మన్ననలు అందుకుంటోంది. మరీ ముఖ్యంగా రియల్మీ లో-బడ్జెట్ ఫోన్లను జనాలు బాగా ఇష్టపడతారు. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను అందిస్తుండటమే ఇందుకు కారణం. ఈ నెలలో ఎన్నో స్మార్ట్ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. రేపు, అనగా సెప్టెంబర్ 23 న మరికొన్న రియల్మీ ఫోన్లు యూజర్లను పలకరించబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
Realme C30s, Realme Narzo 50i Prime, Realme 9i 5G and Realme GT Neo 3T 5G ఫోన్లు సెప్టెంబర్ 23 న భారత మార్కెట్ లో తొలిసారిగా సేల్ కి వస్తున్నాయి. ఈ నాలుగు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణులను ఉద్దేశించి విడుదల అయ్యాయి. సెగ్మెంట్ బెస్ ఫీచర్లను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ల ధర, సేల్ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.
Realme C30S
Realme C30S ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. మొదటి సేల్ లో కంపెనీ రూ.100 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ని రేపటి నుంచి కొనుగోలు చేయవచ్చు. స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Realme Narzo 50i Prime
Realme Narzo 50i Prime రేపటి నుంచి సేల్ కి వస్తోంది. రెండు వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ పై రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
Realme 9i 5G
Realme 9i 5G ఫోన్ సెప్టెంబర్ 23 నుంచి సేల్ కి వస్తోంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. రియల్మీ కంపెనీ అదనంగా రూ.250 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
Realme GT Neo 3T 5G
భారత్ లో Realme GT Neo 3T 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.29,999. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.31,999. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.33,999. Realme GT Neo 3T 5G ఫోన్ ని డ్యాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో సెప్టెంబర్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు.
















