Realme C63 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Aug 2024 10:46:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme C63 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో లాంచైన రియల్మీ సీ63 5జీ https://www.91mobiles.com/telugu/realme-c63-5g-launched-india-dimensity-6300-chipset/ https://www.91mobiles.com/telugu/realme-c63-5g-launched-india-dimensity-6300-chipset/#respond Mon, 12 Aug 2024 10:46:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=12951 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme C63 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Realme C63 5G ధర, […]

The post Realme C63 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో లాంచైన రియల్మీ సీ63 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Realme C63 5G లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ప్రారంభ ధర రూ.10,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme C63 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C63 5G ధర, లభ్యత

Realme C63 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

Realme C63 5G యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.10,999 గా పెట్టారు.

Realme C63 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధరను రూ.11,999 గా పెట్టారు.

Realme C63 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ ను రియల్మీ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో బేస్ మోడల్‌ను రూ.9,999 కి, మిడ్ వేరియంట్‌ను రూ.10,999 కి, టాప్ మోడల్‌ను రూ.11,999 కి సొంతం చేసుకోవచ్చు.

Realme C63 5G యొక్క సేల్ ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ పై మొదలవుతుంది.

Realme C63 5G డివైజ్ స్టారీ గోల్డ్ మరియు ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme C63 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C63 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ ఐ కంఫర్ట్ డిస్ప్లే, డైనమిక్ 50హెర్ట్జ్, 60హెర్ట్జ్, 90హెర్ట్జ్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్స్ ఉంటాయి.

చిప్సెట్: Realme C63 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Realme C63 5G స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ. ఈ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme C63 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి ఏఐ మెయిన్ కెమెరా అందించారు. దీంతో పాటు ఒక సెకండరీ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Realme C63 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ క్విక్ చార్జ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme C63 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C63 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, 9 5జీ బ్యాండ్స్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme C63 5G లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Realme C63 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో లాంచైన రియల్మీ సీ63 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-c63-5g-launched-india-dimensity-6300-chipset/feed/ 0
Realme C63 5G: ఆగస్టు 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-c63-5g-india-launch-date-august-12-official/ https://www.91mobiles.com/telugu/realme-c63-5g-india-launch-date-august-12-official/#respond Wed, 07 Aug 2024 15:05:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=12868 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme జులై నెలలో Realme C63 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అది 4జీ టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు Realme C63 5G ఫోన్‌ని లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని సంస్థ టీజర్ ద్వారా ప్రకటించింది. ఆగస్టు 12వ తేదీన భారతీయ మార్కెట్ లో Realme C63 5G లాంచ్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme C63 5G లాంచ్ తేదీ ఖరారు […]

The post Realme C63 5G: ఆగస్టు 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme C63 5G లాంచ్ తేదీ ఖరారు
  • ఆగస్టు 12 న ఫోన్ విడుదల
  • టీజర్ షేర్ చేసిన రియల్మీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme జులై నెలలో Realme C63 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అది 4జీ టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు Realme C63 5G ఫోన్‌ని లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని సంస్థ టీజర్ ద్వారా ప్రకటించింది. ఆగస్టు 12వ తేదీన భారతీయ మార్కెట్ లో Realme C63 5G లాంచ్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C63 5G లాంచ్ తేదీ ఖరారు

Realme C63 5G స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్‌ను తన అధికార వెబ్‌సైట్ పై రియల్మీ విడుదల చేసింది.

టీజర్ ఇమేజ్ లో ఆగస్టు 12వ తేదీన Realme C63 5G లాంచ్ అవుతుందని పేర్కొనబడి ఉంది.

Realme C63 5G డివైజ్ గోల్డెన్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో టీజర్ పై కనిపించింది.

Realme C63 5G డివైజ్.. స్విఫ్ట్, స్మూథ్ మరియు 5జీ ఛాంపియన్ అని తన పోస్ట్ లో కంపెనీ పేర్కొంది.

Realme C63 5G డిజైన్

Realme C63 5G ఫోన్ డిజైన్ ని గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ షేప్ లో కర్వ్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్‌ని చూస్తుంటే, గ్లోబల్ గా లాంచైన Realme V60 మాదిరి కనిపిస్తోంది. ఓసారి వీ60 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Realme V60 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme V60 లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 720*1604 పిక్సెల్స్ రెజుల్యూషన్, 625 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme V60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడరాు. ఇది ఆక్టా-కోర్ చిప్.

స్టోరేజీ: Realme V60 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Realme V60 లో 32ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme V60 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కనెక్టివిటీ: Realme V60 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme C63 5G: ఆగస్టు 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-c63-5g-india-launch-date-august-12-official/feed/ 0