Realme C65 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 11 Jun 2024 09:07:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme C65 5G: భారత్‌లో లాంచైన రియల్మీ సీ65 5జీ స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/realme-c65-5g-speedy-red-color-variant-launched-in-india/ Tue, 11 Jun 2024 09:07:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11996 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం Realme C65 5G ఫోన్ లాంచ్ అయ్యింది. తాజాగా స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ లో ఈ ఫోన్‌ని లాంచ్ చేశారు. ఈ కలర్ లో ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కలర్ మార్పు తప్పా, ఇతర స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఓసారి స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme C65 5G ధర, లభ్యత Realme […]

The post Realme C65 5G: భారత్‌లో లాంచైన రియల్మీ సీ65 5జీ స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా
  • Realme C65 5G ధర రూ.10,499
  • జూన్ 14 నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం Realme C65 5G ఫోన్ లాంచ్ అయ్యింది. తాజాగా స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ లో ఈ ఫోన్‌ని లాంచ్ చేశారు. ఈ కలర్ లో ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కలర్ మార్పు తప్పా, ఇతర స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఓసారి స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme C65 5G ధర, లభ్యత

Realme C65 5G స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C65 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.10,499 గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 12,499 గా నిర్ణయించారు.

Realme C65 5G స్పీడీ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ అధికార వెబ్‌సైట్ ద్వారా జూన్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Realme C65 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C65 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 720*1604 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C65 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme C65 5G డివైజ్ 6జిబి/4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి డైనమిక్ ర్యామ్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Realme C65 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme C65 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ క్విక్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme C65 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme C65 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎయిర్ జెశ్చర్, రెయిన్‌డ్రాప్ స్మార్ట్ టచ్, డైనమిక్ బటన్, స్మార్ట్ కోడ్ స్కాన్, మినీ క్యాప్సూల్ 2.0, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Realme C65 5G: భారత్‌లో లాంచైన రియల్మీ సీ65 5జీ స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme C65 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-c65-5g-launched-in-india-dimensity-6300-chipset/ Fri, 26 Apr 2024 18:14:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11221 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Realme తాజాగా భారత్ లో ఒక కొత్త సీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C65 5G పేరుతో ఈ ఫోన్ భారత్‌లోకి వచ్చింది. రియల్మీ సీ65 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ65 5జీ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి. Realme […]

The post Realme C65 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme C65 5G లాంచ్
  • 6.67-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే
  • ప్రారంభ ధర రూ.10,499

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Realme తాజాగా భారత్ లో ఒక కొత్త సీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C65 5G పేరుతో ఈ ఫోన్ భారత్‌లోకి వచ్చింది. రియల్మీ సీ65 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ65 5జీ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C65 5G ధర మరియు లభ్యత

Realme C65 5G డివైజ్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.10,499 గా ఉంది.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.11,499 గా నిర్ణయించారు.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా యూజర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme C65 5G డివైజ్ ఫెదర్ గ్రీన్ మరియు గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ.కామ్ ద్వారా రియల్మీ సీ65 5జీ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Realme C65 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C65 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 720*1604 పిక్సెల్స్ రెజుల్యూషన్, 89.97% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ హై బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C65 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme C65 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో డైనమిక్ టెక్నాలజీ ద్వారా అందించారు.

కెమెరా: Realme C65 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: Realme C65 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ క్విక్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Realme C65 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme C65 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎయిర్ జెశ్చర్, రెయిన్‌డ్రాప్ స్మార్ట్ టచ్, డైనమిక్ బటన్, స్మార్ట్ కోడ్ స్కాన్, మినీ క్యాప్సూల్ 2.0, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ఉన్నాయి.

The post Realme C65 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-april-2024/ Fri, 12 Apr 2024 14:14:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11062 గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి. Moto G64 5G iQOO Z9 Turbo Vivo T3x 5G Realme […]

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి.

  • Moto G64 5G
  • iQOO Z9 Turbo
  • Vivo T3x 5G
  • Realme P1 5G
  • Realme C65

Moto G64 5G

మోటో జీ64 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 16న లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. Moto G64 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Moto G64 5G ఫోన్ మూడు ప్రీమియమ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది.

iQOO Z9 Turbo

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోంది. ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. ఈ ఫోన్ 1.5కే డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Vivo T3x 5G

వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

Realme P1 5G

రియల్మీ నుంచి కొత్తగా పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అవి: Realme P1 5G మరియు Realme P1 Pro 5G. ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 15వ తేదీన లాంచ్ కానున్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం ఈ పీ-సిరీస్ ని తీసుకొస్తున్నట్లు రియల్మీ తెలిపింది. Realme P1 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది. Realme P1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది.

Realme C65

Realme C65 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. రియల్మీ సీ65 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్! https://www.91mobiles.com/telugu/realme-c67-5g-ram-storage-color-options-revealed-might-launch-next-month/ Wed, 29 Nov 2023 13:54:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=9042 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ TDRA, SIRIM, FCC, EEC, TKDN, SDPPI, BIS సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా Realme C67 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పైన పేర్కొన్న అన్ని సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై Realme C67 5G […]

The post వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme C67 5G
  • 4జిబి/6జిబి/8జిబి మోడల్స్‌లో వస్తోన్న డివైజ్
  • ధర రూ.12,000-రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ TDRA, SIRIM, FCC, EEC, TKDN, SDPPI, BIS సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా Realme C67 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పైన పేర్కొన్న అన్ని సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై Realme C67 5G డివైజ్ RMX3890 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ Realme C65 పేరుతో రానుందని ఇంతకు ముందు అనుకున్నారు.

Realme C67 5G ధర, కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ

  • Realme C67 5G డివైజ్ 3 మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. అవి: 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ.
  • Realme C67 5G డివైజ్ ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Realme C67 5G డివైజ్ గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • Realme C67 5G కి సంబంధించి ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ వివరాలు తప్పా ఇతర స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు. రానున్న రోజుల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Realme C51 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ 12 నానోమీటర్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C51 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. ఇంకా 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Realme C51 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme C51 డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme C51 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: Realme C51 డివైజ్ 167.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంది.
  • కనెక్టివిటీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme C51 డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా అల్ట్రాబూమ్ స్పీకర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

The post వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Realme C65 5G; సీ-సిరీస్‌లో రియల్మీ నుంచి మొదటి 5G ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-c65-5g-might-launch-soon-india/ Fri, 17 Nov 2023 17:30:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=8882 గత నెల రోజుల నుంచి పెద్దగా మొబైల్ ఫోన్ లాంచెస్ లేవనే చెప్పాలి. అయితే డిసెంబర్ సమీపిస్తోన్న తరుణంలో మళ్ళీ ఫోన్ల విడుదల మరోసారి ప్రారంభం కానుంది. డిసెంబర్ 12 న iQOO 12 భారత్ లో లాంచ్ కాబోతోంది. తాజాగా రియల్మీ నుంచి మొదటి సీ-సిరీస్ 5జీ ఫోన్ రాబోతున్నట్లు 91మొబైల్స్ కి సమాచారం అందింది. Realme C65 5G పేరుతో రానున్న ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. […]

The post త్వరలో లాంచ్ కానున్న Realme C65 5G; సీ-సిరీస్‌లో రియల్మీ నుంచి మొదటి 5G ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme C65 5G
  • సీ-సిరీస్ లో మొదటి 5జీ డివైజ్
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ

గత నెల రోజుల నుంచి పెద్దగా మొబైల్ ఫోన్ లాంచెస్ లేవనే చెప్పాలి. అయితే డిసెంబర్ సమీపిస్తోన్న తరుణంలో మళ్ళీ ఫోన్ల విడుదల మరోసారి ప్రారంభం కానుంది. డిసెంబర్ 12 న iQOO 12 భారత్ లో లాంచ్ కాబోతోంది. తాజాగా రియల్మీ నుంచి మొదటి సీ-సిరీస్ 5జీ ఫోన్ రాబోతున్నట్లు 91మొబైల్స్ కి సమాచారం అందింది. Realme C65 5G పేరుతో రానున్న ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Realme C65 5G వివరాలు (ఎక్స్‌క్లూజివ్)

ప్రస్తుతం Realme C65 5G ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాలు ఏమీ తెలియలేదు. కానీ, 91మొబైల్స్ కి అందిన ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ప్రకారం, రియల్మీ సంస్థ Realme C65 5G ఫోన్ ని 2 కలర్ వేరియంట్స్, 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ చేయనుంది. RMX783IN అనే మోడల్ నంబర్ ని Realme C65 5G కలిగి ఉంది. పర్పుల్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Realme C65 5G డివైజ్ 128జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. Realme C65 5G ఫోన్ గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme C65 5G లాంచ్ టైమ్‌లైన్

Realme C65 5G లాంచ్ తేదీ వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ, డిసెంబర్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఈ ఫోన్ ని తీసుకొస్తారని అంచనా. అంటే కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య పెట్టే అవకాశం ఉంది.

ఇప్పటికే Realme C-సిరీస్ లో మార్కెట్ లో పలు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Realme C1, C51, C53, C55 డివైజెస్ జనాల్లో పాపులర్ అయ్యాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Realme C65 5G; సీ-సిరీస్‌లో రియల్మీ నుంచి మొదటి 5G ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>