Realme Narzo N53 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 23 Oct 2023 16:31:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Realme Narzo N53; ధర రూ.9,999 మాత్రమే! https://www.91mobiles.com/telugu/realme-narzo-n53-8gb-ram-variant-launched-india-price-specs-availability/ Mon, 23 Oct 2023 16:31:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=8513 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో Realme Narzo N53 8జిబి ర్యామ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. అయితే ఇదివరకే Realme Narzo N53 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ మోడల్స్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 8జిబి ర్యామ్ వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. సరే, ఓసారి Realme Narzo N53 8జిబి ర్యామ్ మోడల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Realme Narzo N53 ధర Realme […]

The post 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Realme Narzo N53; ధర రూ.9,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Narzo N53 8జిబి ర్యామ్ మోడల్
  • ఇదివరకే లాంచైన 4జిబి/6జిబి ర్యామ్ మోడల్స్
  • Narzo N53 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో Realme Narzo N53 8జిబి ర్యామ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. అయితే ఇదివరకే Realme Narzo N53 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ మోడల్స్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 8జిబి ర్యామ్ వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. సరే, ఓసారి Realme Narzo N53 8జిబి ర్యామ్ మోడల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Narzo N53 ధర

Realme Narzo N53 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,999 పెట్టారు. ఇకపోతే, బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఫోన్ ధర రూ.8,999 గా ఉంది. అయితే Realme Narzo N53 యొక్క అన్ని ర్యామ్ వేరియంట్స్ పై కంపెనీ ఆఫర్లను ప్రకటించింది. దీంతో ఫోన్లపై కస్టమర్లకు మంచి డిస్కౌంట్ లభించనుంది. ఆ విశేషాలను క్రింద అందించాం. ఓసారి చదివేయండి.

Realme Narzo N53 ఆఫర్స్

  • దీపావళి పండుగ సందర్భంగా రియల్మీ సంస్థ Realme Narzo N53 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.2,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.
  • 4జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,000 డిస్కౌంట్, 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
  • 8జిబి ర్యామ్ మోడల్ పై రూ.1,000 డిస్కౌంట్ మరియు రూ.1,000 కూపన్ వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి. దీంతో ఆఫర్ తర్వాత 8జిబి ర్యామ్ వేరియంట్ ని రూ.9,999 కే కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo N53 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme Narzo N53 లో 6.74-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 450 నిట్స్ బ్రైట్నెస్, 16.7 మిలియన్ కలర్ సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo N53 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: Realme Narzo N53 డివైజ్ గరిష్టంగా 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
  • కెమెరా: Realme Narzo N53 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5పీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, ఓఎస్: Realme Narzo N53 పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Narzo N53 లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డేటా సింక్ ఉన్నాయి.

The post 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Realme Narzo N53; ధర రూ.9,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N53 https://www.91mobiles.com/telugu/realme-narzo-n53-launched-india-price-specs-availability/ Thu, 18 May 2023 09:26:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=6365 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ, భారత్ లో తాజాగా Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ డివైజ్ మినీ క్యాప్సూల్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నోటిఫికేషన్స్, కాల్ అలర్ట్స్, బ్యాటరీ ఇండికేషన్ తదితర విషయాలు చూపబడతాయి. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి […]

The post 50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N53 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Realme Narzo N53
  • 6.74-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Realme Narzo N53 ప్రారంభ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ, భారత్ లో తాజాగా Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ డివైజ్ మినీ క్యాప్సూల్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నోటిఫికేషన్స్, కాల్ అలర్ట్స్, బ్యాటరీ ఇండికేషన్ తదితర విషయాలు చూపబడతాయి. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.

భారత్ లో Realme Narzo N53 ధర, సేల్

Realme Narzo N53 డివైజ్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. 6జిబి + 128జిబి మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ ఫెదర్ గోల్డ్ మరియు ఫెదర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మే 24 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రియల్మీ వెబ్ సైట్, అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

మే 22 న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య స్పెషల్ సేల్ లో భాగంగా బేస్ మోడల్ పై రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. హై-ఎండ్ వర్షన్ కి హెచ్డీఎఫ్‌సీ కార్డ్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme Narzo N53 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Realme Narzo N53 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, ఫ్లాట్ ఎడ్జెస్, 90.3 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 450 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

బ్యాటరీ, ఓఎస్

  • 5000ఎంఏహెచ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Realme Narzo N53 పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • యూనిసాక్ టీ612 చిప్
  • 4జిబి/6జిబి ర్యామ్
  • 64జిబి/128జిబి స్టోరేజీ

Realme Narzo N53 డివైజ్ లో యూనిసాక్ టీ612 చిప్సెట్ ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉన్నాయి. 12జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఈ డివైజ్ లో ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా

Realme Narzo N53 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5పీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ

  • 4జీ ఎల్టీఈ
  • టైప్-సీ

Realme Narzo N53 లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డేటా సింక్ ఉన్నాయి.

The post 50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N53 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme Narzo N53 బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్; మే 18న లాంచ్ అవుతోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/realme-narzo-n53-battery-specs-revealed/ Sun, 14 May 2023 17:00:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=6295 రియల్మీ కంపెనీ తన నార్జో ఎన్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. Realme Narzo N53 పేరుతో వస్తోన్న ఈ డివైజ్, గత నెలలో లాంచైన Realme Narzo N55 కి క్రింది స్థానంలో ఉంటుంది. రియల్మీ సంస్థ Realme Narzo N53 ని తాము తయారు చేసిన అత్యంత స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెబుతోంది. కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని కూడా రివీల్ చేసింది. ఇప్పుడు బ్యాటరీ […]

The post లీకైన Realme Narzo N53 బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్; మే 18న లాంచ్ అవుతోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నార్జో ఎన్-సిరీస్ లో వస్తోన్న రెండో ఫోన్ Realme Narzo N53
  • రియల్మీ తయారు చేసిన స్లిమ్మెస్ట్ ఫోన్ గా చెప్పబడుతోన్న డివైజ్
  • Realme Narzo N53 ఫోన్ మందం కేవలం 7.49 మిల్లీ మీటర్లు

రియల్మీ కంపెనీ తన నార్జో ఎన్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. Realme Narzo N53 పేరుతో వస్తోన్న ఈ డివైజ్, గత నెలలో లాంచైన Realme Narzo N55 కి క్రింది స్థానంలో ఉంటుంది. రియల్మీ సంస్థ Realme Narzo N53 ని తాము తయారు చేసిన అత్యంత స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెబుతోంది. కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని కూడా రివీల్ చేసింది. ఇప్పుడు బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి.

సరే, ఓసారి Realme Narzo N53 బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Narzo N53 గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు

  • మే 18 న లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్మీ సంస్థ Realme Narzo N53 డివైజ్ మే 18 న భారత్ లో లాంచ్ కానుందని తెలిపింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ భారత్ లోకి ప్రవేశించబోతున్న రెండో నార్జో ఎన్-సిరీస్ డివైజ్. Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు రియల్మీ సంస్థ ఖరారు చేసింది. ఈ ఫోన్ స్లిమ్ గా ఉన్నప్పటికీ ఇందులో పెద్ద బ్యాటరీని అమర్చగలగడం గొప్ప విషయమని చెప్పాలి. Realme Narzo N53 డివైజ్ 7.49 మిల్లీ మీటర్ల మందం ఉంటుందని సమాచారం.

Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని రియల్మీ వెల్లడించింది. ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తోందని టీజర్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. 34 నిమిషాల్లో డివైజ్ 50 శాతం చార్జ్ అవుతుందని రియల్మీ చెబుతోంది. సురక్షితమైన చార్జింగ్ అనుభూతిని అందించేందుకై ఈ ఫోన్ అన్ని రకాల భద్రత ప్రమాణాలతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Realme Narzo N53 స్పెసిఫికేషన్స్ (టీజర్ ద్వారా)

  • ఫింగర్ ప్రింట్ స్కానర్
  • టైప్-సీ
  • 3.5ఎంఎం జాక్

Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో రానుందని విడుదలైన టీజర్స్ ద్వారా తెలుస్తోంది. Realme Narzo N53 డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై గోల్డ్ ఫిలమెంట్ కోటింగ్ కలిగి, కాలిఫోర్నియా సన్‌షైన్ డిజైన్ తో వస్తోంది. ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5-ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

Realme Narzo N53 వెనకాల, స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. Realme Narzo N53 డివైజ్ కెమెరా స్పెసిఫికేషన్స్ ని కంపెనీ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

Realme Narzo N53 డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ ని కలిగి ఉంది. ఈ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా స్పెసిఫికేషన్స్ కి సంబంధించి రియల్మీ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Realme Narzo N53 కలర్ ఆప్షన్స్, స్టోరేజీ

  • 4జిబి/6జిబి ర్యామ్
  • 64జిబి/128జిబి స్టోరేజీ

Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: ఫెదర్ బ్లాక్ మరియు ఫెదర్ గోల్డ్. అయితే ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో రావడం లేదు. ఇకపోతే ఈ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది. బేస్ మోడల్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. టాప్ వేరియంట్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.

Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. 16జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఫిజికల్ ర్యామ్, ఎక్స్‌స్టెండెడ్ ర్యామ్ తో కలిపి భారీ ర్యామ్ యూజర్ కి లభించనుంది. ఈ ఫోన్ ధర రూ.13,000 లోపు ఉండే అవకాశం ఉంది.

The post లీకైన Realme Narzo N53 బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్; మే 18న లాంచ్ అవుతోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>