50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N53

Highlights

  • భారత్ లో లాంచైన Realme Narzo N53
  • 6.74-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Realme Narzo N53 ప్రారంభ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ, భారత్ లో తాజాగా Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ డివైజ్ మినీ క్యాప్సూల్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నోటిఫికేషన్స్, కాల్ అలర్ట్స్, బ్యాటరీ ఇండికేషన్ తదితర విషయాలు చూపబడతాయి. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.

భారత్ లో Realme Narzo N53 ధర, సేల్

Realme Narzo N53 డివైజ్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. 6జిబి + 128జిబి మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ ఫెదర్ గోల్డ్ మరియు ఫెదర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మే 24 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రియల్మీ వెబ్ సైట్, అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

మే 22 న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య స్పెషల్ సేల్ లో భాగంగా బేస్ మోడల్ పై రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. హై-ఎండ్ వర్షన్ కి హెచ్డీఎఫ్‌సీ కార్డ్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme Narzo N53 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Realme Narzo N53 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, ఫ్లాట్ ఎడ్జెస్, 90.3 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 450 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

బ్యాటరీ, ఓఎస్

  • 5000ఎంఏహెచ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Realme Narzo N53 పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • యూనిసాక్ టీ612 చిప్
  • 4జిబి/6జిబి ర్యామ్
  • 64జిబి/128జిబి స్టోరేజీ

Realme Narzo N53 డివైజ్ లో యూనిసాక్ టీ612 చిప్సెట్ ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉన్నాయి. 12జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఈ డివైజ్ లో ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా

Realme Narzo N53 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5పీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ

  • 4జీ ఎల్టీఈ
  • టైప్-సీ

Realme Narzo N53 లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డేటా సింక్ ఉన్నాయి.