
రియల్మీ కంపెనీ తన నార్జో ఎన్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. Realme Narzo N53 పేరుతో వస్తోన్న ఈ డివైజ్, గత నెలలో లాంచైన Realme Narzo N55 కి క్రింది స్థానంలో ఉంటుంది. రియల్మీ సంస్థ Realme Narzo N53 ని తాము తయారు చేసిన అత్యంత స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెబుతోంది. కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని కూడా రివీల్ చేసింది. ఇప్పుడు బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి.
సరే, ఓసారి Realme Narzo N53 బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Realme Narzo N53 గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు
- మే 18 న లాంచ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
రియల్మీ సంస్థ Realme Narzo N53 డివైజ్ మే 18 న భారత్ లో లాంచ్ కానుందని తెలిపింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ భారత్ లోకి ప్రవేశించబోతున్న రెండో నార్జో ఎన్-సిరీస్ డివైజ్. Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు రియల్మీ సంస్థ ఖరారు చేసింది. ఈ ఫోన్ స్లిమ్ గా ఉన్నప్పటికీ ఇందులో పెద్ద బ్యాటరీని అమర్చగలగడం గొప్ప విషయమని చెప్పాలి. Realme Narzo N53 డివైజ్ 7.49 మిల్లీ మీటర్ల మందం ఉంటుందని సమాచారం.
Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని రియల్మీ వెల్లడించింది. ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తోందని టీజర్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. 34 నిమిషాల్లో డివైజ్ 50 శాతం చార్జ్ అవుతుందని రియల్మీ చెబుతోంది. సురక్షితమైన చార్జింగ్ అనుభూతిని అందించేందుకై ఈ ఫోన్ అన్ని రకాల భద్రత ప్రమాణాలతో వస్తున్నట్లు తెలుస్తోంది.
Realme Narzo N53 స్పెసిఫికేషన్స్ (టీజర్ ద్వారా)
- ఫింగర్ ప్రింట్ స్కానర్
- టైప్-సీ
- 3.5ఎంఎం జాక్
Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో రానుందని విడుదలైన టీజర్స్ ద్వారా తెలుస్తోంది. Realme Narzo N53 డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై గోల్డ్ ఫిలమెంట్ కోటింగ్ కలిగి, కాలిఫోర్నియా సన్‌షైన్ డిజైన్ తో వస్తోంది. ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5-ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
Realme Narzo N53 వెనకాల, స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. Realme Narzo N53 డివైజ్ కెమెరా స్పెసిఫికేషన్స్ ని కంపెనీ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
Realme Narzo N53 డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ ని కలిగి ఉంది. ఈ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా స్పెసిఫికేషన్స్ కి సంబంధించి రియల్మీ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
Realme Narzo N53 కలర్ ఆప్షన్స్, స్టోరేజీ
- 4జిబి/6జిబి ర్యామ్
- 64జిబి/128జిబి స్టోరేజీ
Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: ఫెదర్ బ్లాక్ మరియు ఫెదర్ గోల్డ్. అయితే ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో రావడం లేదు. ఇకపోతే ఈ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది. బేస్ మోడల్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. టాప్ వేరియంట్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. 16జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఫిజికల్ ర్యామ్, ఎక్స్‌స్టెండెడ్ ర్యామ్ తో కలిపి భారీ ర్యామ్ యూజర్ కి లభించనుంది. ఈ ఫోన్ ధర రూ.13,000 లోపు ఉండే అవకాశం ఉంది.











