Realme V50 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 11 Dec 2023 10:15:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 చైనాలో లాంచైన Realme V50, V50s; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-v50-v50s-launched-china-price-specs-availability/ Mon, 11 Dec 2023 10:15:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=9220 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనాలో రెండు బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసింది. Realme V50, Realme V50s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. చూడటానికి ఈ ఫోన్లు Realme 11x మాదిరి కనిపిస్తున్నాయి. కాకపోతే, ఈ ఫోన్లలో కెమెరా విభిన్నంగా ఉంది. ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతాయో లేదో తెలియదు. సరే, ఓసారి Realme V50 మరియు Realme V50s డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర […]

The post చైనాలో లాంచైన Realme V50, V50s; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Realme V50 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Realme V50, V50s
  • 6.72-ఇంచ్ స్క్రీన్‌తో వచ్చిన డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనాలో రెండు బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసింది. Realme V50, Realme V50s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. చూడటానికి ఈ ఫోన్లు Realme 11x మాదిరి కనిపిస్తున్నాయి. కాకపోతే, ఈ ఫోన్లలో కెమెరా విభిన్నంగా ఉంది. ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతాయో లేదో తెలియదు. సరే, ఓసారి Realme V50 మరియు Realme V50s డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme V50, Realme V50s ధర (చైనా)

  • Realme V50 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.13,758) గా ఉంది.
  • Realme V50 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ.16,259) గా ఉంది.
  • Realme V50s 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ.17,500) గా ఉంది.
  • Realme V50s 8జిబి ర్యామ్ + 256జిబి మోడల్ ధర 1,799 యువాన్లు (సుమారు రూ.20,850) గా ఉంది.
  • Realme V50, Realme V50s డివైజెస్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది.

Realme V50, Realme V50s స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిజైన్: Realme V50 సిరీస్ ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో వచ్చింది. ఇది 7.89 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
  • డిస్ప్లే: Realme V50, Realme V50s డివైజెస్ లో 6.72-ఇంచ్ సెంటర్ పంచ్-హోల్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ (ఫుల్ హెచ్డీ+), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme V50, Realme V50s ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: Realme V50 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కెమెరా: Realme V50, Realme V50s ఫోన్లలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme V50, Realme V50s ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. చార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ ఫోన్లు 10 వాట్ లేదా 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
  • ఇతర ఫీచర్లు: Realme V50, Realme V50s డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.

The post చైనాలో లాంచైన Realme V50, V50s; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన Realme V50, Realme V50s; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/realme-v50-v50s-spotted-china-telecom-specs-design-price/ Wed, 22 Nov 2023 15:21:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=8939 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో వీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. Realme V50, Realme V50s పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో Realme V50, Realme V50s డివైజెస్ లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలో లాంచ్ కాబోయే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Realme […]

The post చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన Realme V50, Realme V50s; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme V50 సిరీస్
  • లైనప్‌లో రానున్న Realme V50, V50s
  • 6.72-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోన్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో వీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. Realme V50, Realme V50s పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో Realme V50, Realme V50s డివైజెస్ లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలో లాంచ్ కాబోయే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme V50, Realme V50s డిజైన్ (చైనా టెలీకామ్)

  • ఇమేజ్ లో చూస్తుంటే, Realme V50, Realme V50s డివైజెస్ డిజైన్ దాదాపుగా ఒకే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  • ముందువైపు చూస్తే, బాక్సీ డిజైన్, రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్స్ ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
  • రెండు ఫోన్లలో కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
  • డివైజెస్ డిజైన్ ఆకట్టుకునే విధంగా యూనిక్ లుక్ తో ఉంది. డివైజెస్ బ్యాక్ ప్యానెల్ మల్టీ కలర్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో రియల్మీ బ్రాండింగ్ ఉంది.
  • డివైజెస్ కి బాటమ్ లో హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

Realme V50, Realme V50s ధర (చైనా టెలీకామ్)

  • ధర విషయానికి వస్తే, లిస్టింగ్ ప్రకారం, రెండు ఫోన్లు 3 స్టోరేజీ ఆప్షన్స్ లో వస్తుందని తెలుస్తోంది.
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1199 యువాన్లు (సుమారు రూ.14,000) గా ఉంటుంది.
  • 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1399 యువాన్లు (సుమారు రూ.16,000) గా ఉంటుంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.20,000) గా ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • రెండు ఫోన్లు మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.

Realme V50, Realme V50s స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్)

  • డిస్ప్లే: లిస్టింగ్ ప్రకారం, రెండు స్మార్ట్ ఫోన్లలో 6.72-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయని తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ డివైజెస్ లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: రెండు ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme V50, Realme V50s డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
  • ఓఎస్: Realme V50, Realme V50s డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Realme V50, Realme V50s డివైజెస్ 165.55 మి.మీ పొడవు, 75.98 మి.మీ వెడల్పు, 7.94 మి.మీ మందం, 187.65 గ్రాముల బరువు ఉంటాయి.

The post చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన Realme V50, Realme V50s; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>