
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనాలో రెండు బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసింది. Realme V50, Realme V50s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. చూడటానికి ఈ ఫోన్లు Realme 11x మాదిరి కనిపిస్తున్నాయి. కాకపోతే, ఈ ఫోన్లలో కెమెరా విభిన్నంగా ఉంది. ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతాయో లేదో తెలియదు. సరే, ఓసారి Realme V50 మరియు Realme V50s డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme V50, Realme V50s ధర (చైనా)
- Realme V50 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.13,758) గా ఉంది.
- Realme V50 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ.16,259) గా ఉంది.
- Realme V50s 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ.17,500) గా ఉంది.
- Realme V50s 8జిబి ర్యామ్ + 256జిబి మోడల్ ధర 1,799 యువాన్లు (సుమారు రూ.20,850) గా ఉంది.
- Realme V50, Realme V50s డివైజెస్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది.
Realme V50, Realme V50s స్పెసిఫికేషన్స్ (చైనా)
- డిజైన్: Realme V50 సిరీస్ ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో వచ్చింది. ఇది 7.89 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
- డిస్ప్లే: Realme V50, Realme V50s డివైజెస్ లో 6.72-ఇంచ్ సెంటర్ పంచ్-హోల్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ (ఫుల్ హెచ్డీ+), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme V50, Realme V50s ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
- ఓఎస్: Realme V50 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- కెమెరా: Realme V50, Realme V50s ఫోన్లలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Realme V50, Realme V50s ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. చార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ ఫోన్లు 10 వాట్ లేదా 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
- ఇతర ఫీచర్లు: Realme V50, Realme V50s డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.











