
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో వీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. Realme V50, Realme V50s పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో Realme V50, Realme V50s డివైజెస్ లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలో లాంచ్ కాబోయే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Realme V50, Realme V50s డిజైన్ (చైనా టెలీకామ్)
- ఇమేజ్ లో చూస్తుంటే, Realme V50, Realme V50s డివైజెస్ డిజైన్ దాదాపుగా ఒకే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- ముందువైపు చూస్తే, బాక్సీ డిజైన్, రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్స్ ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
- రెండు ఫోన్లలో కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
- డివైజెస్ డిజైన్ ఆకట్టుకునే విధంగా యూనిక్ లుక్ తో ఉంది. డివైజెస్ బ్యాక్ ప్యానెల్ మల్టీ కలర్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో రియల్మీ బ్రాండింగ్ ఉంది.
- డివైజెస్ కి బాటమ్ లో హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
Realme V50, Realme V50s ధర (చైనా టెలీకామ్)
- ధర విషయానికి వస్తే, లిస్టింగ్ ప్రకారం, రెండు ఫోన్లు 3 స్టోరేజీ ఆప్షన్స్ లో వస్తుందని తెలుస్తోంది.
- 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1199 యువాన్లు (సుమారు రూ.14,000) గా ఉంటుంది.
- 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1399 యువాన్లు (సుమారు రూ.16,000) గా ఉంటుంది.
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.20,000) గా ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- రెండు ఫోన్లు మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.
Realme V50, Realme V50s స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్)
- డిస్ప్లే: లిస్టింగ్ ప్రకారం, రెండు స్మార్ట్ ఫోన్లలో 6.72-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయని తెలుస్తోంది.
- ర్యామ్, స్టోరేజీ: ఈ డివైజెస్ లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: రెండు ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Realme V50, Realme V50s డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
- ఓఎస్: Realme V50, Realme V50s డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Realme V50, Realme V50s డివైజెస్ 165.55 మి.మీ పొడవు, 75.98 మి.మీ వెడల్పు, 7.94 మి.మీ మందం, 187.65 గ్రాముల బరువు ఉంటాయి.











