Redmi 12C - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Oct 2023 06:02:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఇప్పుడు Redmi 12C ధర రూ.7,999 మాత్రమే; ఆఫర్ వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-12c-price-cut-by-rs-200-available-on-amazon/ Fri, 09 Jun 2023 10:17:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=6700 మీరు గనుక తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావిస్తుంటే, అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే రెడ్మీ సంస్థ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 12C ధరను తగ్గించింది. అయితే, ఈ ధర తగ్గింపు కొంత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్ గురించి మాట్లాడితే, ఇందులో 6.71-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ […]

The post ఇప్పుడు Redmi 12C ధర రూ.7,999 మాత్రమే; ఆఫర్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తగ్గిన Redmi 12C స్మార్ట్ ఫోన్ ధర
  • బేస్ వేరియంట్ కి వర్తించనున్న ఆఫర్
  • 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వచ్చిన ఫోన్

మీరు గనుక తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావిస్తుంటే, అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే రెడ్మీ సంస్థ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 12C ధరను తగ్గించింది. అయితే, ఈ ధర తగ్గింపు కొంత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్ గురించి మాట్లాడితే, ఇందులో 6.71-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.

Redmi 12C ఆఫర్ వివరాలు

  • Redmi 12C పై ధర తగ్గింపు కేవలం బేస్ వేరియంట్ కి మాత్రమే లభిస్తుంది. బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • ఈ ఏడాది ఏప్రిల్ లో Redmi 12C డివైజ్ రూ.8,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఈ ఫోన్ ధర రూ.8,799 గా చూపిస్తోంది. అంటే ఫోన్ పై నేరుగా రూ.200 తగ్గించారన్నమాట. మీరు మరొక రూ.800 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
  • ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తో Redmi 12C ఫోన్ ని కొనుగోలు చేస్తే, రూ.800 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
  • డిస్కౌంట్ అనేది కేవలం ఈఎంఐ ఆర్డర్లకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. అయితే, యూపీఐ పేమెంట్ యాప్ అమెజాన్ పే ద్వారా డబ్బు చెల్లించి రూ.800 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో Redmi 12C ని రూ.7,999 కే కొనుగోలు చేయవచ్చు.
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ ఆఫర్ కి జూన్ 15 చివరి తేదీ అని అమెజాన్ వెల్లడించింది.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12C లో 6.71-ఇంచ్ హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 3జిబి/5జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: Redmi 12C లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Redmi 12C లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏజీపీఎస్, బైడూ, గెలీలియో, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 12C స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 12C లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ ని కలిగి ఉంది.

The post ఇప్పుడు Redmi 12C ధర రూ.7,999 మాత్రమే; ఆఫర్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 6.71-ఇంచ్ డిస్ప్లేతో భారత్ లో లాంచైన Redmi 12C https://www.91mobiles.com/telugu/redmi-12c-launched-india-price-specs-availability/ Thu, 30 Mar 2023 09:44:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=5669 నేడు భారత్ లో Redmi 12C స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఎంట్రీ లెవెల్ కేటగిరీలో ఇది శక్తివంతమైన ఫోన్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. 50ఎంపి ఏఐ మెయిన్ కెమెరాను ఈ ఫోన్ లో అందించడం విశేషం. 5 మెమొరీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. భారత్ లో Redmi 12C ధర, […]

The post మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 6.71-ఇంచ్ డిస్ప్లేతో భారత్ లో లాంచైన Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi 12C స్మార్ట్ ఫోన్
  • ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన Redmi 12C
  • 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చిన Redmi 12C

నేడు భారత్ లో Redmi 12C స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఎంట్రీ లెవెల్ కేటగిరీలో ఇది శక్తివంతమైన ఫోన్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. 50ఎంపి ఏఐ మెయిన్ కెమెరాను ఈ ఫోన్ లో అందించడం విశేషం. 5 మెమొరీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.

భారత్ లో Redmi 12C ధర, కలర్ మరియు స్టోరేజీ ఆప్షన్స్

Redmi 12C డివైజ్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: గ్రాఫైట్ గ్రే, ఓషన్ బ్లూ, మింట్ గ్రీన్, ల్యావెండర్ పర్పుల్. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా నిర్ణయించారు. స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు పెంచుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫోన్ కొనుగోలు పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ని ఏప్రిల్ 6 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఎంఐ వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. షావోమి ఫ్యాన్స్ తమ పాత ఫోన్లను ఎక్స్‌చేంజ్ చేస్తే అదనంగా రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ కెమెరాలు
  • 5ఎంపి సెల్ఫీ కెమెరా

Redmi 12C లో 6.71-ఇంచ్ డాట్ డ్రాప్ డిస్ప్లే, 1650*720 హెచ్డీ+ డిస్ప్లే, 20.6:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, ఎన్టీఎస్‌సీ 70 పర్సెంట్, రీడింగ్ మోడ్ ఉన్నాయి. Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. ఇది 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.

Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, మరొక ఆగ్జిలరీ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. Redmi 12C డివైజ్ 168.76 మిల్లీ మీటర్ల పొడవు, 76.41 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.77 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

Redmi 12C లో భద్రత కోసం రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఏఐ ఫేస్ అన్‌లాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.1, ఎఫ్ఎం రేడియో, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

Redmi 12C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. బాక్స్ లో ఫోన్, అడాప్టర్, యూఎస్బీ కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, వ్యారంటీ కార్డ్, యూజర్ గైడ్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 6.71-ఇంచ్ డిస్ప్లేతో భారత్ లో లాంచైన Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.10 వేల లోపు ధరతో వస్తోన్న Redmi 12C https://www.91mobiles.com/telugu/redmi-12c-price-range-revealed-before-launch/ Tue, 28 Mar 2023 06:12:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=5606 షావోమి సంస్థ తన కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Redmi 12C ని భారత్ లో మార్చి 30 న లాంచ్ చేయనుంది. ఆమేరకు కంపెనీ నుంచి ఇప్పటికే ఒక ప్రకటన వచ్చేసింది. అమెజాన్ లో కనిపిస్తోన్న ప్రొడక్ట్ పేజీ ద్వారా ఫోన్ కి సంబంధించిన ఎన్నో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. తాజాగా అమెజాన్ లిస్టింగ్ ద్వారా Redmi 12C యొక్క ధర కూడా రివీల్ అయ్యింది. భారత్ లో Redmi 12C ఫోన్ రూ.10 […]

The post రూ.10 వేల లోపు ధరతో వస్తోన్న Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ షాపింగ్ సైట్ పై లైవ్ లో దర్శనమిస్తోన్న Redmi 12C
  • Redmi 12C ధర రూ.10 వేల లోపు ఉంటుందని అమెజాన్ ద్వారా వచ్చిన స్పష్టత
  • మార్చి 30 న భారత్ లో లాంచ్ కానున్న లో-బడ్జెట్ ఫోన్ Redmi 12C

షావోమి సంస్థ తన కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Redmi 12C ని భారత్ లో మార్చి 30 న లాంచ్ చేయనుంది. ఆమేరకు కంపెనీ నుంచి ఇప్పటికే ఒక ప్రకటన వచ్చేసింది. అమెజాన్ లో కనిపిస్తోన్న ప్రొడక్ట్ పేజీ ద్వారా ఫోన్ కి సంబంధించిన ఎన్నో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. తాజాగా అమెజాన్ లిస్టింగ్ ద్వారా Redmi 12C యొక్క ధర కూడా రివీల్ అయ్యింది. భారత్ లో Redmi 12C ఫోన్ రూ.10 వేల లోపు ధరతో లాంచ్ అవుతుందని సమాచారం.

భారత్ లో Redmi 12C ధర

Redmi 12C ప్రొడక్ట్ పేజీ అమెజాన్ లో దర్శనమిస్తోంది. Redmi 12C ధర భారత్ లో రూ.10 వేల లోపు ఉంటుందని తెలుస్తోంది. 2023 లో వచ్చిన అన్ని రూ.10 వేల లోపు ఫోన్లలో Redmi 12C ఫాస్టెస్ట్ ఫోన్ అని కంపెనీ చెబుతోంది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. భారత్ లో Redmi 12C సేల్ రూ.8,999 తో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 5జిబి వర్చువల్ ర్యామ్
  • మీడియాటెక్ హీలియో జీ85
  • 50ఎంపి రియర్ కెమెరా
  • 10 వాట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Redmi 12C చైనీస్ మోడల్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 20.6:9 యాస్పెక్ట్ రేషియో, 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ85 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన చిప్. ఇక గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.

Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భారత్ లో రెడ్మీ 12సీ స్మార్ట్ ఫోన్ మార్చి 30 న లాంచ్ అవుతోంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా, చిప్సెట్ కలిగిన ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ బాగా సరిపోతుంది. లాంచ్ రోజున ఫోన్ కి సంబంధించిన కచ్చితమైన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.10 వేల లోపు ధరతో వస్తోన్న Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi 12C, Note 12 4G https://www.91mobiles.com/telugu/redmi-12c-redmi-note-12-4g-india-global-launch-tipped/ Mon, 06 Mar 2023 12:57:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5232 Redmi సంస్థ వివిధ మార్కెట్స్ లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో Redmi 12C ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. 2022 డిసెంబర్ 31 న Redmi 12C చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ నెలలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత్ లో కూడా Redmi 12C ఎంట్రీ […]

The post త్వరలో భారత్‌తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi 12C, Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • MediaTek Helio G85 చిప్సెట్ తో రానున్న Redmi 12C
  • 5000mAh బ్యాటరీతో రానున్న Redmi 12C, Note 12 4G డివైజెస్
  • స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో రానున్న Redmi Note 12 4G

Redmi సంస్థ వివిధ మార్కెట్స్ లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో Redmi 12C ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. 2022 డిసెంబర్ 31 న Redmi 12C చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ నెలలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

భారత్ లో కూడా Redmi 12C ఎంట్రీ ఇవ్వనుందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. Redmi Note 12 4G కూడా భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానుందని ముకుల్ శర్మ తెలిపాడు.

షావోమి సబ్-బ్రాండ్ Redmi నుంచి Redmi Note 12 4G కొత్త బడ్జెట్ శ్రేణి ఫోన్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Redmi 12C, Note 12 4G ఫోన్ల యొక్క లాంచ్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

Redmi 12C, Redmi Note 12 4G ఇండియా లాంచ్ వివరాలు

Redmi 12C డివైజ్ చవకైన ఫోన్ గా కంపెనీ నుంచి రానుంది. ఈ నెలలోనే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ముకుల్ శర్మ లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేయలేదు. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నందున త్వరలోనే భారత్ తో పాటు, ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ అదే హార్డ్‌వేర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Redmi 12C ఒక 4జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ లో 6.71-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 1650 x 720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మందపాటి బెజెల్ ని కలిగి ఉంటుంది.

చైనాలో Redmi 12C 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచైంది. ఇతర మార్కెట్స్ లో కూడా ఇదే స్టోరేజీతో లాంచ్ కానున్నట్లు సమాచారం. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా 512జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు. Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 0.8 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. Redmi 12C లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇందులో ఇచ్చారు. భద్రత కోసం రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. మైక్రో యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకునే వీలుంది.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 4G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ఉన్నాయి. లీకైన స్పెసిఫికేషన్స్ ప్రకారం, ఈ ఫోన్ ఐస్ బ్లూ, ఆనిక్స్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ లో లభ్యమవ్వనుంది. Redmi Note 12 4G గ్లోబల్ గా 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది.

Redmi Note 12 4G లో స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వాడనున్నారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 4G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

Redmi Note 12 4G డివైజ్ ఐపీ53 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది. ఈ డివైజ్ 165.66 మిల్లీ మీటర్ల పొడవు, 75.96 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.85 మిల్లీ మీటర్ల మందం, 183.5 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi 12C, Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
BIS, TDRA సర్టిఫికేషన్స్ పొందిన Redmi 12C https://www.91mobiles.com/telugu/redmi-12c-bis-tdra-certifications-india-launch-imminent/ Fri, 03 Mar 2023 05:02:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=5202 భారతీయ మార్కెట్ లో త్వరలోనే Redmi 12C స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని Redmi కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ లీక్ అయ్యాయి. తాజాగా ఇండియన్ వేరియంట్ Redmi 12C బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. సర్టిఫికేషన్ ద్వారా Redmi 12C త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. UAE కి చెందిన TDRA సర్టిఫికేషన్ ని కూడా Redmi 12C పొందింది. Redmi 12C […]

The post BIS, TDRA సర్టిఫికేషన్స్ పొందిన Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 12C భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించిన Redmi 12C ఇండియన్ వేరియంట్
  • బీఐఎస్ లిస్టింగ్ తో Redmi 12C ఇండియా లాంచ్ పై వచ్చిన స్పష్టత

భారతీయ మార్కెట్ లో త్వరలోనే Redmi 12C స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని Redmi కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ లీక్ అయ్యాయి. తాజాగా ఇండియన్ వేరియంట్ Redmi 12C బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. సర్టిఫికేషన్ ద్వారా Redmi 12C త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. UAE కి చెందిన TDRA సర్టిఫికేషన్ ని కూడా Redmi 12C పొందింది.

Redmi 12C డివైజ్ ఎంట్రీ లెవెల్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ ని కొనాలని భావించే వారికి ఇది సరైన ఎంపిక అవుతుంది. లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టి, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.71-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ ప్యానెల్ తో రానున్నట్లు తెలిసింది.

Redmi 12C ఇండియా లాంచ్

ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ Redmi 12C ని Redmi 221220RN86I అనే మోడల్ నంబర్ తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై గుర్తించాడు. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. కానీ, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఫోన్ పేరు ఏంటో బయటకు రాలేదు. అయితే Redmi 12C గ్లోబల్ వేరియంట్ TDRA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ లో పేరు పేర్కొనబడింది.

Redmi 12C స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇప్పటికే లీకైన Redmi 12C స్పెసిఫికేషన్స్ జాబితా ప్రకారం, ఈ డివైజ్ 6.71-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయిన మీడియాటెక్ హీలియో జీ85 ని కలిగి ఉండనుంది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. పవర్ బ్యాకప్ కోసం Redmi 12C డివైజ్ లో 5,000 mAh బ్యాటరీ ఇచ్చారు.

Redmi 12C యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, మరొక క్యూవీజీఏ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Redmi 12C స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది. త్వరలోనే Redmi 12C ఫోన్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BIS, TDRA సర్టిఫికేషన్స్ పొందిన Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో రానున్న POCO C55 (Redmi 12C) https://www.91mobiles.com/telugu/poco-c55-launch-on-cards-rebrand-of-redmi-12c/ Tue, 10 Jan 2023 10:35:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4413 హైలైట్స్ అత్యధిక ఫీచర్లు కలిగిన సీ-సిరీస్ ఫోన్ గా వస్తోన్న POCO C55 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రానున్న POCO C55 Redmi 12C ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న POCO C55 పోకో సంస్థ ఇటీవలె భారత్ లో POCO C50 అనే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ సీ-సిరీస్ లో POCO C55 అనే ఫోన్ ని […]

The post MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో రానున్న POCO C55 (Redmi 12C) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అత్యధిక ఫీచర్లు కలిగిన సీ-సిరీస్ ఫోన్ గా వస్తోన్న POCO C55 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రానున్న POCO C55
  • Redmi 12C ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న POCO C55

పోకో సంస్థ ఇటీవలె భారత్ లో POCO C50 అనే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ సీ-సిరీస్ లో POCO C55 అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek ప్రకారం, POCO C55 ఫోన్ రెడ్మీ 12సీ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్నట్లు సమాచారం. రెడ్మీ 12సీ ఫోన్ ఇటీవలె చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.

POCO C55 కూడా రీబ్రాండ్ చేయబడిన రెడ్మీ డివైజ్. అసలైతే, పోకో సీ-సిరీస్ ఫోన్లన్నీ రీబ్రాండ్ చేయబడిన రెడ్మీ ఫోన్స్ అని చెప్పాలి. 2021 లో లాంచైన పోకో సీ31 ఫోన్, రెడ్మీ 9 యాక్టివ్ యొక్క రీబ్రాండ్ వర్షన్. తన లేటెస్ట్ ఫైండింగ్ ని టిప్ స్టర్ క్యాస్పర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అయితే ఎంఐయూఐ కోడ్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు క్యాస్పర్ వెల్లడించలేదు. కానీ, తరచూ ఇతడు ఎంఐయూఐ కోడ్ ద్వారానే తన లీక్స్ ని బయటపెడుతుంటాడు. సరే, ఓసారి Redmi 12C యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలను తెలుసుకుందాం. పదండి.

Redmi 12C స్పెసిఫికేషన్స్, ధర

Redmi 12C స్మార్ట్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఇకపోతే ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ ఉపయోగించారు. హీలియో జీ85 చిప్సెట్ మూడేళ్ళ క్రితం ఇంట్రడ్యూస్ అయ్యింది. ఎన్నో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో దీన్ని వాడారు. రెడ్మీ నోట్ 9, రియల్మీ నార్జో 20, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, మోటో జీ31 తదితర ఫోన్లలో ఈ చిప్ ని ఉపయోగించారు.

Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో మైక్రో యూఎస్బీ పోర్ట్ ప్రొవైడ్ చేశారు.

Redmi 12C స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బరువు 192 గ్రాములు. మైక్రోఎస్డీ కార్డ్ సౌకర్యం, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi 12C స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి+64జిబి వేరియంట్ ధర RMB 699 (సుమారు రూ.8,500), 4జిబి+128జిబి వేరియంట్ ధర RMB 799 (సుమారు రూ.9,700), 6జిబి+128జిబి వేరియంట్ ధర RMB 899 (సుమారు రూ.11,000) గా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో రానున్న POCO C55 (Redmi 12C) first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 6GB ర్యామ్ తో లాంచైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Redmi 12C https://www.91mobiles.com/telugu/redmi-12c-smartphone-launched-china-price-specs/ Mon, 02 Jan 2023 04:59:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4273 హైలైట్స్ చైనాలో లాంచైన Redmi 12C బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చిన హ్యాండ్సెట్ 4 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Redmi 12C స్మార్ట్ ఫోన్ రెడ్మీ బ్రాండ్ చైనాలో ఒక కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Redmi 12C అనే పేరుతో వచ్చిన ఈ ఫోన్ 2022 డిసెంబర్ 31 న లాంచ్ అయ్యింది. ఇప్పటికే చైనాలో […]

The post 50MP కెమెరా, 6GB ర్యామ్ తో లాంచైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Redmi 12C బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్
  • 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చిన హ్యాండ్సెట్
  • 4 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Redmi 12C స్మార్ట్ ఫోన్

రెడ్మీ బ్రాండ్ చైనాలో ఒక కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Redmi 12C అనే పేరుతో వచ్చిన ఈ ఫోన్ 2022 డిసెంబర్ 31 న లాంచ్ అయ్యింది. ఇప్పటికే చైనాలో రెడ్మీ కే60 సిరీస్ అమ్మకాలు మొదలయ్యాయి. రెడ్మీ 10సీ స్మార్ట్ ఫోన్ కి సక్సెసర్ గా Redmi 12C మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మోడల్ తో పోల్చితే తాజాగా వచ్చిన Redmi 12C ఫోన్ యొక్క డిజైన్ కాస్త వేరుగా ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో ఫోన్ వచ్చింది.

Redmi 12C ఒక బడ్జెట్ ఆఫరింగ్. పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ ని ఈ ఫోన్ కల్గి ఉంది. షావోమి ఈ ఫోన్ ని మూడు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ చేసింది. సరే, ఓసారి Redmi 12C యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ చూద్దాం. పదండి.

Redmi 12C ధర, స్పెసిఫికేషన్స్

Redmi 12C ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ తో చైనాలో లాంచైంది. బేస్ మోడల్ అయిన 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ధర 699 యువాన్లు (సుమారు రూ.8,400) గా ఉంది. 4జిబి + 128జిబి వేరియంట్ ధర 799 యువాన్లు (సుమారు రూ.9,600) గా ఉంది. ఇక టాప్ ఎండ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 899 యువాన్లు (సుమారు రూ.10,800) గా ఉంది.

Redmi 12C స్మార్ట్ ఫోన్ షాడో బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్ మరియు లావెండర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi 12C స్పెసిఫికేషన్స్

Redmi 12C స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ షేప్డ్ మాడ్యూల్ ఉంది. ఇందులో పిల్ షేప్డ్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50ఎంపి కెమెరా ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi 12C స్మార్ట్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.6:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డ్యూ-డ్రాప్ నాచ్ ఉన్నాయి. న్యారో బెజెల్స్, మందపాటి చిన్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ చిప్సెట్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 జీపీయూ ఉపయోగించారు. ఈ డివైజ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, ఈఎంఎంసీ 5.1 ఫ్లాష్ మెమొరీ ని కల్గి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో హైబ్రిడ్ సిమ్ స్లాట్, 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.

Redmi 12C డివైజ్ మైక్రో యూఎస్బీ పోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi 12C ఫోన్ 168.76 మిల్లీ మీటర్ల పొడవు, 76.41 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.7 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50MP కెమెరా, 6GB ర్యామ్ తో లాంచైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Redmi 12C first appeared on 91Mobiles Telugu.

]]>