రూ.10 వేల లోపు ధరతో వస్తోన్న Redmi 12C

Highlights

  • అమెజాన్ షాపింగ్ సైట్ పై లైవ్ లో దర్శనమిస్తోన్న Redmi 12C
  • Redmi 12C ధర రూ.10 వేల లోపు ఉంటుందని అమెజాన్ ద్వారా వచ్చిన స్పష్టత
  • మార్చి 30 న భారత్ లో లాంచ్ కానున్న లో-బడ్జెట్ ఫోన్ Redmi 12C

షావోమి సంస్థ తన కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Redmi 12C ని భారత్ లో మార్చి 30 న లాంచ్ చేయనుంది. ఆమేరకు కంపెనీ నుంచి ఇప్పటికే ఒక ప్రకటన వచ్చేసింది. అమెజాన్ లో కనిపిస్తోన్న ప్రొడక్ట్ పేజీ ద్వారా ఫోన్ కి సంబంధించిన ఎన్నో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. తాజాగా అమెజాన్ లిస్టింగ్ ద్వారా Redmi 12C యొక్క ధర కూడా రివీల్ అయ్యింది. భారత్ లో Redmi 12C ఫోన్ రూ.10 వేల లోపు ధరతో లాంచ్ అవుతుందని సమాచారం.

భారత్ లో Redmi 12C ధర

Redmi 12C ప్రొడక్ట్ పేజీ అమెజాన్ లో దర్శనమిస్తోంది. Redmi 12C ధర భారత్ లో రూ.10 వేల లోపు ఉంటుందని తెలుస్తోంది. 2023 లో వచ్చిన అన్ని రూ.10 వేల లోపు ఫోన్లలో Redmi 12C ఫాస్టెస్ట్ ఫోన్ అని కంపెనీ చెబుతోంది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. భారత్ లో Redmi 12C సేల్ రూ.8,999 తో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 5జిబి వర్చువల్ ర్యామ్
  • మీడియాటెక్ హీలియో జీ85
  • 50ఎంపి రియర్ కెమెరా
  • 10 వాట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Redmi 12C చైనీస్ మోడల్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 20.6:9 యాస్పెక్ట్ రేషియో, 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ85 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన చిప్. ఇక గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.

Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భారత్ లో రెడ్మీ 12సీ స్మార్ట్ ఫోన్ మార్చి 30 న లాంచ్ అవుతోంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా, చిప్సెట్ కలిగిన ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ బాగా సరిపోతుంది. లాంచ్ రోజున ఫోన్ కి సంబంధించిన కచ్చితమైన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.198 విలువజేసే చవకైన ప్లాన్‌ని లాంచ్ చేసిన Jio
Next articleగీక్‌బెంచ్ పై కనిపించిన కొత్త లావా ఫోన్, త్వరలోనే లాంచ్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.