Redmi 14C 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 02 Sep 2024 06:14:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi 14C: 120Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 14సీ, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-14c-globally-launched-120hz-display-price-specs/ https://www.91mobiles.com/telugu/redmi-14c-globally-launched-120hz-display-price-specs/#respond Mon, 02 Sep 2024 06:14:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=13292 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Redmi 14C అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ Redmi 13C కి సక్సెసర్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Redmi 14C స్మార్ట్‌ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.88-ఇంచ్ డిస్ప్లే, హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 50ఎంపి కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post Redmi 14C: 120Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 14సీ, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో రెడ్మీ 14సీ విడుదల
  • హీలియో జీ81-అల్ట్రా చిప్
  • 5160 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Redmi 14C అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ Redmi 13C కి సక్సెసర్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Redmi 14C స్మార్ట్‌ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.88-ఇంచ్ డిస్ప్లే, హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 50ఎంపి కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 14C ధర

Redmi 14C స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ ధరను VND 30,90,000 (సుమారు రూ.10,500) గా నిర్ణయించారు.

Redmi 14C డివైజ్ సేజ్ గ్రీన్ (లెదర్ బ్యాక్ ఫినిష్), మిడ్నైట్ బ్లాక్, డ్రీమీ పర్పుల్ మరియు స్టారీ బ్లూ (స్టారీ ట్రెయిల్ డిజైన్) కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi 14C స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. తర్వాత ఇతర మార్కెట్స్ లో కూడా విడుదలవుతుంది.

Redmi 14C స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 14C లో 6.88-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1640*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, రీడింగ్ మోడ్, టీయూవీ లో బ్లూ లైట్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, డీసీ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 14C లో మీడియాటెక్ హీలియో జీ81-అల్ట్రా చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 ఎంసీ2 జీపీయూ ఇచ్చారు.

మెమొరీ: Redmi 14C స్మార్ట్‌ఫోన్ 4జిబి+128జిబి, 4జిబి+256జిబి, 6జిబి+128జిబి, 8జిబి+256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 14C లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi 14C డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi 14C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ: Redmi 14C లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post Redmi 14C: 120Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 14సీ, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-14c-globally-launched-120hz-display-price-specs/feed/ 0
Redmi 14C: 5160mAh బ్యాటరీతో లాంచ్ కానున్న రెడ్మీ 14సీ https://www.91mobiles.com/telugu/redmi-14c-to-launch-with-5160mah-battery/ https://www.91mobiles.com/telugu/redmi-14c-to-launch-with-5160mah-battery/#respond Fri, 23 Aug 2024 13:10:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=13134 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో 14 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 14C పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ గత కొన్ని రోజులుగా సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించడంతో పాటు, కొన్ని లీక్స్ ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ ఖరారైంది. ఆగస్టు 31వ తేదీన Redmi 14C వియత్నాంలో లాంచ్ అవుతోంది. ఒక గ్లోబల్ రిటైలర్ ద్వారా […]

The post Redmi 14C: 5160mAh బ్యాటరీతో లాంచ్ కానున్న రెడ్మీ 14సీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 14C లాంచ్
  • 6.88-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో 14 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 14C పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ గత కొన్ని రోజులుగా సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించడంతో పాటు, కొన్ని లీక్స్ ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ ఖరారైంది. ఆగస్టు 31వ తేదీన Redmi 14C వియత్నాంలో లాంచ్ అవుతోంది. ఒక గ్లోబల్ రిటైలర్ ద్వారా ఈ సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi 14C డిజైన్

Redmi 14C డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. డివైజ్ యొక్క బ్లూ కలర్ మోడల్ ఆకర్షణీయమైన గ్రేడియంట్ ఫినిష్ తో కనిపిస్తోంది. దీంతో ఫోన్ మరింత ప్రీమియమ్ గా కనబడుతోంది.

కెమెరా మాడ్యూల్ లో 4 రింగ్స్ ఉన్నాయి. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Redmi 14C బ్లూ కలర్ తో పాటు, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇవన్నీ కూడా వీగన్ లెదర్ ఫినిష్‌ని కలిగి ఉంటాయి.

ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, ఈ మోడల్‌లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, ఫ్లాట్ స్క్రీన్ ఉంటాయి.

Redmi 14C స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 14C లో 6.88-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.

చిప్సెట్: Redmi 14C లో మీడియాటెక్ మీలియో జీ91 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Redmi 14C స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ లేదా 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవ్వనుంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 14C స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: Redmi 14C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Redmi 14C లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.

Redmi 14C లాంచ్ తేదీ, ధర

గ్లోబల్ రిటైలర్ లిస్టింగ్ ప్రకారం, Redmi 14C డివైజ్ ఆగస్టు 31వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ వియత్నాంలో లాంచ్ కానుందని సమాచారం. ధర, స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తే, ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.

The post Redmi 14C: 5160mAh బ్యాటరీతో లాంచ్ కానున్న రెడ్మీ 14సీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-14c-to-launch-with-5160mah-battery/feed/ 0
Redmi 14C 4G: రివీలైన రెడ్మీ 14సీ 4జీ గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/redmi-14c-4g-global-launch-timeline-storage-color-options/ https://www.91mobiles.com/telugu/redmi-14c-4g-global-launch-timeline-storage-color-options/#respond Wed, 21 Aug 2024 05:35:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13083 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 14 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 14C 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గత మోడల్ Redmi 13C 4G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఈ వివరాలను 91mobiles ఎక్స్‌క్లూజివ్‌గా తన కథనంలో ప్రచురించింది. ఓసారి ఆ […]

The post Redmi 14C 4G: రివీలైన రెడ్మీ 14సీ 4జీ గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 14C 4G లాంచ్
  • రివీలైన గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్
  • 256జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 14 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 14C 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గత మోడల్ Redmi 13C 4G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఈ వివరాలను 91mobiles ఎక్స్‌క్లూజివ్‌గా తన కథనంలో ప్రచురించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi 14C 4G లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు ప్రకారం, Redmi 14C 4G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో ఈ నెలాఖరులో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. త్వరలో రెడ్మీ నుంచి అధికార సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర గత మోడల్ రెడ్మీ 13సీ మాదిరి తక్కువ ఉంటుందని అంచనా.

Redmi 14C 4G స్టోరేజీ, ర్యామ్ మరియు కలర్ ఆప్షన్స్ (లీక్)

లీకైన వివరాల ప్రకారం, Redmi 14C 4G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుంది. అవి: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.

Redmi 14C 4G డివైజ్ బ్లాక్ మరియు బ్లూ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

Redmi 14C 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi 14C 4G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

Redmi 14C 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ 1.0 ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Redmi 14C 4G డివైజ్ 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Redmi 13C 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13C 4G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 13C 4G లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 4G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Redmi 13C 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi 13C 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi 13C 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi 13C 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Redmi 14C 4G: రివీలైన రెడ్మీ 14సీ 4జీ గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-14c-4g-global-launch-timeline-storage-color-options/feed/ 0