
Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో 14 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 14C పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ గత కొన్ని రోజులుగా సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించడంతో పాటు, కొన్ని లీక్స్ ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ ఖరారైంది. ఆగస్టు 31వ తేదీన Redmi 14C వియత్నాంలో లాంచ్ అవుతోంది. ఒక గ్లోబల్ రిటైలర్ ద్వారా ఈ సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Redmi 14C డిజైన్
Redmi 14C డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. డివైజ్ యొక్క బ్లూ కలర్ మోడల్ ఆకర్షణీయమైన గ్రేడియంట్ ఫినిష్ తో కనిపిస్తోంది. దీంతో ఫోన్ మరింత ప్రీమియమ్ గా కనబడుతోంది.
కెమెరా మాడ్యూల్ లో 4 రింగ్స్ ఉన్నాయి. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
Redmi 14C బ్లూ కలర్ తో పాటు, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇవన్నీ కూడా వీగన్ లెదర్ ఫినిష్ని కలిగి ఉంటాయి.
ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, ఈ మోడల్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, ఫ్లాట్ స్క్రీన్ ఉంటాయి.
Redmi 14C స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi 14C లో 6.88-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.
చిప్సెట్: Redmi 14C లో మీడియాటెక్ మీలియో జీ91 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.
ర్యామ్, స్టోరేజీ: Redmi 14C స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ లేదా 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవ్వనుంది.
బ్యాటరీ, చార్జింగ్: Redmi 14C స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది.
కనెక్టివిటీ: Redmi 14C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
ఇతర ఫీచర్లు: Redmi 14C లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.
Redmi 14C లాంచ్ తేదీ, ధర
గ్లోబల్ రిటైలర్ లిస్టింగ్ ప్రకారం, Redmi 14C డివైజ్ ఆగస్టు 31వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ వియత్నాంలో లాంచ్ కానుందని సమాచారం. ధర, స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తే, ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.












