Redmi K70 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 22 Jul 2024 10:11:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi K70 Ultra: 24జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన రెడ్మీ కే70 అల్ట్రా https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-launched-china-24gb-ram/ https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-launched-china-24gb-ram/#respond Mon, 22 Jul 2024 09:15:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12607 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi K70 Ultra పేరుతో వచ్చిన ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఈ డివైజ్ లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 24జిబి వరకు ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, ఐపీ68 రేటింగ్, డైమెన్సిటీ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు […]

The post Redmi K70 Ultra: 24జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన రెడ్మీ కే70 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Redmi K70 Ultra లాంచ్
  • డైమెన్సిటీ 9300 ప్రాసెసర్
  • 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi K70 Ultra పేరుతో వచ్చిన ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఈ డివైజ్ లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 24జిబి వరకు ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, ఐపీ68 రేటింగ్, డైమెన్సిటీ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi K70 Ultra ధర, కలర్ ఆప్షన్స్

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 5 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi K70 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2599 యువాన్లు (సుమారు రూ.29,900) గా పెట్టారు.

Redmi K70 Ultra 12జిబి + 512జిబి వేరియంట్ ధర 2899 యువాన్లు (సుమారు రూ.33,300) గా ఉంది.

Redmi K70 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3199 యువాన్లు (సుమారు రూ.36,800) గా ఉంది.

Redmi K70 Ultra 16జిబి + 1టిబి వేరియంట్ ధరను 3599 (సుమారు రూ.41,400) గా ఉంది.

Redmi K70 Ultra సుప్రీమ్ చాంపియన్ ఎడిషన్ 24జిబి+1టిబి వేరియంట్ ధరను 3999 యువాన్లు (రూ.46,000) గా ఉంది.

Redmi K70 Ultra డివైజ్ అల్ట్రా బ్లాక్, స్నో వైట్ మరియు ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. రెడ్మీ కే70 అల్ట్రా సుప్రీమ్ ఎడిషన్ ఆరెంజ్ మరియు గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 Ultra లో 6.67-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3840 హెర్ట్జ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, షావోమి షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ గ్రాఫిక్స్‌ను ఈ ఫోన్ లో వాడారు.

మెమొరీ: Redmi K70 Ultra డివైజ్ 12జిబి/16జిబి/24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Redmi K70 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Redmi K70 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi K70 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi K70 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డాల్బీ అట్మాస్, ఐపీ68 రేటింగ్, హై-రెజ్ ఆడియో వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Redmi K70 Ultra డివైజ్ 160.38 మి.మీ పొడవు, 75.14 మి.మీ వెడల్పు, 8.39 మి.మీ మందం, 211 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi K70 Ultra: 24జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన రెడ్మీ కే70 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-launched-china-24gb-ram/feed/ 0
Redmi K70 Ultra: గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ద్వారా రివీలైన రెడ్మీ కే70 అల్ట్రా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-specs-revealed-via-geekbench-listing/ https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-specs-revealed-via-geekbench-listing/#respond Thu, 04 Jul 2024 16:51:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12374 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మీ నుంచి ఈ మేరకు టీజర్ కూడా విడుదలైంది. లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈలోపు బెంచ్‌మార్కింగ్ సైట్ Geekbench పై Redmi K70 Ultra లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి […]

The post Redmi K70 Ultra: గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ద్వారా రివీలైన రెడ్మీ కే70 అల్ట్రా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K70 Ultra లాంచ్
  • మోడల్ నంబర్ 2407FRK8EC
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మీ నుంచి ఈ మేరకు టీజర్ కూడా విడుదలైంది. లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈలోపు బెంచ్‌మార్కింగ్ సైట్ Geekbench పై Redmi K70 Ultra లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Redmi K70 Ultra గీక్‌బెంచ్ లిస్టింగ్

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 2407FRK8EC అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఐఎంఈఐ డేటాబేస్ పై కూడా ఈ ఫోన్ కనిపించింది.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2218 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 7457 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ డివైజ్ ఆక్టా-కోర్ చిప్సెట్ తో వస్తోంది. మదర్‌బోర్డ్ పేరు Rothko అని పేర్కొనబడి ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్ గా ఉంది. మాలి-జీ720-ఇమ్మోర్టాలిస్ ఎంసీ12 జీపీయూ గ్రాఫిక్స్ లిస్ట్ పై కనిపించాయి.

వివరాలను బట్టి, Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో రానుందని అర్థమవుతోంది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌తో వస్తోందని టీజర్ ద్వారా రెడ్మీ సంస్థ కన్ఫర్మ్ చేసింది.

3సీ సర్టిఫికేషన్ ప్రకారం, Redmi K70 Ultra డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలిసింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ పై 16జిబి ర్యామ్ తో Redmi K70 Ultra కనిపించింది. 24జిబి వరకు ర్యామ్, 1టిబి ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్ వస్తుందని అంచనా వేయవచ్చు.

Redmi K70 Ultra డివైజ్ యొక్క డిస్ప్లే సైజ్ ఇంకా తెలియలేదు. అయితే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే రెడ్మీ కే70 అల్ట్రా కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

The post Redmi K70 Ultra: గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ద్వారా రివీలైన రెడ్మీ కే70 అల్ట్రా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-specs-revealed-via-geekbench-listing/feed/ 0
Redmi K70 Ultra: 3C సర్టిఫికేషన్ పొందిన రెడ్మీ కే70 అల్ట్రా https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-receives-3c-certification/ Wed, 15 May 2024 04:25:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11538 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K70 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Ultra అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. Redmi K70 Ultra డివైజ్ గ్లోబల్‌గా Xiaomi 14T Pro పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Redmi K70 Ultra 3సీ […]

The post Redmi K70 Ultra: 3C సర్టిఫికేషన్ పొందిన రెడ్మీ కే70 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K70 Ultra లాంచ్
  • డివైజ్ గ్లోబల్ పేరు Xiaomi 14T Pro
  • K70 Ultra మోడల్ నంబర్ 2407FRK8EC

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K70 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Ultra అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. Redmi K70 Ultra డివైజ్ గ్లోబల్‌గా Xiaomi 14T Pro పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi K70 Ultra 3సీ లిస్టింగ్

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 3సీ లిస్టింగ్ పై 2407FRK8EC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఒక రిపోర్ట్ ప్రకారం, కే70 అల్ట్రా గ్లోబల్ మార్కెట్స్ లో షావోమి 14టీ ప్రో పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Redmi K70 Ultra యొక్క 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా MDY-14-ED, MDY-160EB మోడల్ నంబర్లు గల చార్జర్స్ రివీల్ అయ్యాయి. ఈ చార్జర్లు 15వాట్, 27 వాట్, 66 వాట్, 120 వాట్ పవర్ ఔట్‌పుట్ కి సపోర్ట్ చేస్తాయి. అంటే త్వరలో లాంచ్ కాబోయే ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని అర్థమవుతోంది.

Redmi K70 Ultra డివైజ్ rothko అనే కోడ్ నేమ్ కలిగి ఉందని భావిస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్సెట్. దీంతో పాటు మాలి-జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ గ్రాఫిక్స్ ని జత చేయనున్నారు.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని అంచనా వేస్తున్నారు.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ గతేడాది వచ్చిన కే60 అల్ట్రాకి సక్సెసర్‌గా వస్తోంది.

Redmi K60 Ultra స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Redmi K60 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు. దీంతో పాటు x7 డిస్ప్లే చిప్ ని కూడా అందించారు.

మెమొరీ: Redmi K60 Ultra లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Redmi K60 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 సెన్సర్ ని అందించారు.

బ్యాటరీ: Redmi K60 Ultra డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
డైమెన్షన్స్, వెయిట్: Redmi K60 Ultra డివైజ్ 162.15 మి.మీ పొడవు, 75.7 మి.మీ వెడల్పు, 8.49 మి.మీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Redmi K60 Ultra లో డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

The post Redmi K70 Ultra: 3C సర్టిఫికేషన్ పొందిన రెడ్మీ కే70 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: లీకైన K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-launch-timeline-leaked/ Fri, 03 May 2024 06:09:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=11335 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. తాజాగా Redmi K70 Ultra యొక్క లాంచ్ టైమ్‌లైన్ లీకైంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Redmi K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్) Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ వివరాలను చైనాకు చెందిన […]

The post Redmi: లీకైన K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K70 Ultra లాంచ్
  • 8టీ ఓఎల్ఈడీ ప్యానెల్
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. తాజాగా Redmi K70 Ultra యొక్క లాంచ్ టైమ్‌లైన్ లీకైంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ వివరాలను చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు షేర్ చేశారు.

లీక్ ప్రకారం, Redmi K70 Ultra డివైజ్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

గతేడాది Redmi K60 Ultra ఆగస్టు నెలలో లాంచ్ అయ్యింది. దీన్ని బట్టి, రెడ్మీ కే70 అల్ట్రా ఈ ఏడాది జులై లేదా ఆగస్టు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Redmi K70 Ultra లో 8టీ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ మే 7న లాంచ్ అవుతోంది.

మెమొరీ: Redmi K70 Ultra డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

బ్యాటరీ: Redmi K70 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఓఎస్: Redmi K70 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 Ultra డివైజ్ లో ఐపీ68 రేటింగ్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

Redmi K60 Ultra స్పెసిఫికేషన్స్

Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు. దీంతో పాటు x7 డిస్ప్లే చిప్ ని కూడా అందించారు.

మెమొరీ విషయానికి వస్తే, Redmi K60 Ultra లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి. రెడ్మీ కే60 అల్ట్రాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 సెన్సర్ ని అందించారు.

ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. Redmi K60 Ultra డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60 Ultra డివైజ్ 162.15 మి.మీ పొడవు, 75.7 మి.మీ వెడల్పు, 8.49 మి.మీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

The post Redmi: లీకైన K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: 24GB LPDDR5T ర్యామ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రానున్న Redmi K70 Ultra https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-could-feature-24gb-lpddr5t-ram-144hz-refresh-rate/ Mon, 22 Jan 2024 15:27:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=9851 Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 Ultra అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. చైనాకు ఆవల గ్లోబల్ మార్కెట్స్ లో Xiaomi T-సిరీస్ పేరుతో ఈ డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన పలు వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. మరో విషయం ఏంటంటే, Redmi K60 Ultra గ్లోబల్ మార్కెట్స్ లో Xiaomi 13T Pro […]

The post Redmi: 24GB LPDDR5T ర్యామ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రానున్న Redmi K70 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 ద్వితీయార్థంలో లాంచ్ కానున్న Redmi K70 Ultra
  • చైనాకు బయట టీ-సిరీస్ పేరుపై లాంచ్ అయ్యే ఛాన్స్
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వస్తోన్న Redmi K70 Ultra

Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 Ultra అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. చైనాకు ఆవల గ్లోబల్ మార్కెట్స్ లో Xiaomi T-సిరీస్ పేరుతో ఈ డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన పలు వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

మరో విషయం ఏంటంటే, Redmi K60 Ultra గ్లోబల్ మార్కెట్స్ లో Xiaomi 13T Pro పేరుతో లాంచ్ అయ్యింది. దీంతో Redmi K70 Ultra డివైజ్ Xiaomi 14T Pro పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Redmi K70 Ultra యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

  • డిస్ప్లే: Redmi K70 Ultra లో 8టీ ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ వాడనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi K70 Ultra డివైజ్ 24జిబి ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్ మరియు 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలిసాయి. ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్ తో రాబోవు తొలి ఫోన్ గా Redmi K70 Ultra అవకాశం ఉంది.
  • కెమెరా: Redmi K70 Ultra లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 800 ఓఐఎస్, ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయని సమాచారం. ఇతర కెమెరా సెన్సర్స్ గురించి ఇంకా వివరాలు తెలియలేదు.

మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ విషయానికి వస్తే, రీసెంట్ గా వచ్చిన Vivo X100 మరియు Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లలో ఇదే చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ వాడారు.

The post Redmi: 24GB LPDDR5T ర్యామ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రానున్న Redmi K70 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi K70 Ultra: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే70 అల్ట్రా ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-key-specs-leaked-before-launch/ Tue, 09 Jan 2024 15:28:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=9634 Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 Ultra డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ లో Redmi K70, Redmi K70e మరియు Redmi K70 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్ లో మరొక మోడల్ Redmi K70 Ultra ని లాంచ్ చేసేందుకు రెడ్మీ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అల్ట్రా వేరియంట్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ […]

The post Redmi K70 Ultra: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే70 అల్ట్రా ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi K70 Ultra
  • తాజాగా లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్
  • Dimensity 9300 చిప్‌తో వస్తోన్న ఫోన్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 Ultra డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ లో Redmi K70, Redmi K70e మరియు Redmi K70 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్ లో మరొక మోడల్ Redmi K70 Ultra ని లాంచ్ చేసేందుకు రెడ్మీ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అల్ట్రా వేరియంట్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Redmi K70 Ultra వివరాలు (లీక్)

  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Redmi K70 Ultra యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Redmi K70 Ultra ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయని సమాచారం.
  • Redmi K70 Ultra మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
  • Redmi K70 Ultra డివైజ్ మెటల్ మిడ్ ఫ్రేమ్, వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చే అవకాశం ఉంది.

Redmi K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

  • లీక్ ప్రకారం, Redmi K70 Ultra డివైజ్ 2024 జూన్ నెలలో లాంచ్ అవుతుందని అర్థమవుతోంది.
  • ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ Xiaomi 14 Pro పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే రెడ్మీ నుంచి ఈ డివైజ్ యొక్క లాంచ్ ప్రకటన వస్తుందని భావించవచ్చు.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi K70 Ultra లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi K70 Ultra లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Redmi K70 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్ ఎల్‌వైటీఐఏ 800 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Redmi K70 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi K70 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi K70 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Redmi K70 Ultra: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే70 అల్ట్రా ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
2024 లో లాంచ్ కానున్న Redmi K70 Ultra; లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-specs-leaked-might-launch-in-2024/ Wed, 06 Dec 2023 15:38:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9148 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 సిరీస్ ని నవంబర్ లో చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 2024 లో Redmi K70 Ultra డివైజ్ కూడా లాంచ్ కానుందని సమాచారం. ఇతర డివైజెస్ తో పోల్చితే Redmi K70 Ultra లో విభిన్నమైన చిప్సెట్, స్పెసిఫికేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. తాజాగా Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ […]

The post 2024 లో లాంచ్ కానున్న Redmi K70 Ultra; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi K70 Ultra
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • డైమెన్సిటీ 9300 చిప్‌తో రానున్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 సిరీస్ ని నవంబర్ లో చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 2024 లో Redmi K70 Ultra డివైజ్ కూడా లాంచ్ కానుందని సమాచారం. ఇతర డివైజెస్ తో పోల్చితే Redmi K70 Ultra లో విభిన్నమైన చిప్సెట్, స్పెసిఫికేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. తాజాగా Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ వీబో పై Redmi K70 Ultra యొక్క స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ షేర్ అయ్యాయి.
  • Redmi K70 Ultra లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • టిప్‌స్టర్ ప్రకారం, Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. మాలి-జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
  • Redmi K70 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • Redmi K70 Ultra లో 50ఎంపి సోని ఐఎంఎక్స్ ఎల్‌వైటీఐఏ800 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఒక టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • 2024 ప్రథమార్థంలో Redmi K70 Ultra లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi K70 Ultra లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi K70 Ultra లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Redmi K70 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్ ఎల్‌వైటీఐఏ 800 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Redmi K70 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi K70 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi K70 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post 2024 లో లాంచ్ కానున్న Redmi K70 Ultra; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>