
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo X100 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో పోటీపడే రేంజ్ సెన్సర్స్ ని ఈ ఫోన్లలో నిక్షిప్తం చేశారు. దీంతో కెమెరా ఓరియెంటెడ్ ఫోన్ కొనాలని భావించే వారికి Vivo X100 సిరీస్ చక్కటి ఎంపిక అవుతుందని చెప్పవచ్చు. Vivo X100 సిరీస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, 50ఎంపి 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 వీసీఎస్ బయోనిక్ సెన్సర్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo X100 సిరీస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo X100 సిరీస్ భారత మార్కెట్ ధరలు
- Vivo X100 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ప్రో వేరియంట్ కేవలం ఒకే వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
- Vivo X100 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.63,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.69,999 గా నిర్ణయించారు.
- Vivo X100 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.89,999 గా నిర్ణయించారు.
- Vivo X100 సిరీస్ కలర్స్ విషయానికి వస్తే, ఈ సిరీస్ ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌గేజ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Vivo X100 సిరీస్ ప్రీ-బుకింగ్స్ నేటి (జనవరి 4 వ తేదీ) నుంచి మొదలయ్యాయి. 2024 జనవరి 11 నుంచి సేల్ మొదలుకానుంది.
- లాంచ్ ఆఫర్ లో భాగంగా ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ కార్డ్స్ హోల్డర్స్ కి 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
- Vivo X100 సిరీస్ లోని రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు ఇతర రిటైల్ ఔట్లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo X100 సిరీస్ లోని రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ వినియోగించారు.
- కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
- బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
- ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.











