
Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 Ultra డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ లో Redmi K70, Redmi K70e మరియు Redmi K70 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్ లో మరొక మోడల్ Redmi K70 Ultra ని లాంచ్ చేసేందుకు రెడ్మీ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అల్ట్రా వేరియంట్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Redmi K70 Ultra వివరాలు (లీక్)
- టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Redmi K70 Ultra యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
- Redmi K70 Ultra ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయని సమాచారం.
- Redmi K70 Ultra మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
- Redmi K70 Ultra డివైజ్ మెటల్ మిడ్ ఫ్రేమ్, వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చే అవకాశం ఉంది.
Redmi K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
- లీక్ ప్రకారం, Redmi K70 Ultra డివైజ్ 2024 జూన్ నెలలో లాంచ్ అవుతుందని అర్థమవుతోంది.
- ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ Xiaomi 14 Pro పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే రెడ్మీ నుంచి ఈ డివైజ్ యొక్క లాంచ్ ప్రకటన వస్తుందని భావించవచ్చు.
Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Redmi K70 Ultra లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Redmi K70 Ultra లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Redmi K70 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్ ఎల్‌వైటీఐఏ 800 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Redmi K70 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi K70 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi K70 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











