Redmi Note 12 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 02 Jan 2024 15:49:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi Note 12 4G ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-note-12-4g-price-drop-know-the-full-details/ Tue, 02 Jan 2024 15:49:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9527 Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో తన కొత్త నంబర్ సిరీస్ Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. జనవరి 4వ తేదీన ఈ సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో గత సిరీస్ లోని Redmi Note 12 4G ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. Redmi Note 12 4G డివైజ్ ధరపై రూ.3,000 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఆసక్తిగల వినియోగదారులు Redmi Note 12 4G ని చాలా తక్కువ […]

The post Redmi Note 12 4G ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 12 4G పై డిస్కౌంట్
  • Snapdragon 685 చిప్‌తో వచ్చిన డివైజ్
  • ఫోన్ పై రూ.3,000 తగ్గించిన రెడ్మీ సంస్థ

Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో తన కొత్త నంబర్ సిరీస్ Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. జనవరి 4వ తేదీన ఈ సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో గత సిరీస్ లోని Redmi Note 12 4G ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. Redmi Note 12 4G డివైజ్ ధరపై రూ.3,000 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఆసక్తిగల వినియోగదారులు Redmi Note 12 4G ని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సరే, ఓసారి కొత్త ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 4G కొత్త ధర

  • Redmi Note 12 4G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అందులో 6జిబి ర్యామ్ + 64జిబి వేరియంట్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.11,999 గా ఉంది.
  • Redmi Note 12 4G టాప్ మోడల్ (6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ) డిస్కౌంట్ తర్వాత రూ.13,999 కి లభిస్తోంది.
  • Redmi Note 12 4G ఫోన్ కొనాలని భావించే వారు Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • అంతే కాదు, Redmi Note 12 4G డివైజ్ ని హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
  • అంటే Redmi Note 12 4G డివైజ్ యొక్క బేస్ మోడల్ రూ.10,499 కి, టాప్ మోడల్ రూ.12,499 కి లభిస్తుంది.
  • Redmi Note 12 4G ఫోన్ యొక్క పాత ధరలు వరుసగా రూ.14,999 మరియు రూ.16,999 గా ఉన్నాయి.
  • ఇకపోతే, Redmi Note 12 4G స్మార్ట్‌ఫోన్ లునార్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్ మరియు ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 12 4G డివైజ్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 సపోర్ట్ తో వచ్చింది.
  • ప్రాసెసర్: Redmi Note 12 4G లో స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 2.8 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 12 4G లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 12 4G లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, యూఎస్బీ ఓటీజీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ తో వచ్చింది.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 12 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Redmi Note 12 4G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ అందించనుంది.

The post Redmi Note 12 4G ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 4G https://www.91mobiles.com/telugu/redmi-note-12-4g-launched-india-price-specs-availability/ Thu, 30 Mar 2023 09:23:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=5662 షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ నేడు భారత్ లో Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4జీ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. 4జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదొక మంచి ఆప్షన్ గా నిలవనుంది. స్నాడప్ డ్రాగన్ 685 చిప్సెట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అందించారు. 11జిబి వరకు వర్చువల్ ర్యామ్ […]

The post అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 685 4జీ చిప్సెట్ పై పని చేయనున్న Redmi Note 12 4G

షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ నేడు భారత్ లో Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4జీ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. 4జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదొక మంచి ఆప్షన్ గా నిలవనుంది. స్నాడప్ డ్రాగన్ 685 చిప్సెట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అందించారు. 11జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

Redmi Note 12 4G ధర, కలర్ ఆప్షన్స్

భారత్ లో Redmi Note 12 4G సన్ రైజ్ గోల్డ్, లునార్ బ్లాక్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. రెడ్మీ నోట్ 11 తో పోల్చితే Redmi Note 12 4G డివైజ్ ఎన్నో అప్‌గ్రేడ్స్ తో వచ్చింది. స్లీక్ డిజైన్ యూజర్లను ఇట్టే ఆకట్టుకోనుంది. ఈ డివైజ్ కేవలం 7.8 ఎంఎం మందం, 186 గ్రాముల బరువు కలిగి ఉంది.

Redmi Note 12 4G డివైజ్ 6జిబి/64జిబి వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి/128జిబి మోడల్ ధర రూ.16,999 గా ఉంది. ఏప్రిల్ 6 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఎంఐ వెబ్ సైట్, ఎంఐ హోమ్ స్టోర్స్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. షావోమి ఫ్యాన్స్ తమ పాత ఫోన్లను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్

  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్
  • 11జిబి వర్చువల్ ర్యామ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

Redmi Note 12 4G డివైజ్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 సపోర్ట్ తో వచ్చింది. Redmi Note 12 4G లో స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 2.8 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. 11జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

Redmi Note 12 4G లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది. ఈ ఫోన్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, యూఎస్బీ ఓటీజీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ తో వచ్చింది.

పవర్ బ్యాకప్ కోసం Redmi Note 12 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ తో లాంచైన Redmi Note 12 4G https://www.91mobiles.com/telugu/redmi-note-12-4g-launched-globally-price-specs-availability/ Sun, 26 Mar 2023 12:14:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=5578 Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచైంది. మార్చి 30 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ Redmi Note 12 4G కావడం విశేషం. ఇక రెడ్మీ నోట్ 12 లైనప్ లో ఇప్పటి వరకు రెడ్మీ నోట్ 12 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో+ […]

The post స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ తో లాంచైన Redmi Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ Redmi Note 12 4G
  • భారత్ లో మార్చి 30 న లాంచ్ కానున్న Redmi Note 12 4G

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచైంది. మార్చి 30 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ Redmi Note 12 4G కావడం విశేషం. ఇక రెడ్మీ నోట్ 12 లైనప్ లో ఇప్పటి వరకు రెడ్మీ నోట్ 12 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో+ 5జీ అనే ఫోన్లు వచ్చాయి. సరే, తాజాగా లాంచైన Redmi Note 12 4G కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 4G ధర

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచైంది. 4జిబి ర్యామ్ వేరియంట్ ధర 199 యూరోలు (సుమారు రూ.17,000) గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ ధర 229.99 యూరోలు (సుమారు రూ.20,600) గా ఉంది. 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 249.99 (సుమారు రూ.22,000) గా ఉంది. Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ ఐస్ బ్లూ, ఆనిక్స్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. భారత్ లో లాంచ్ అయ్యాక ఈ ఫోన్ ధరలు వేరుగా ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ ధరలతో పోల్చితే భారత్ లో ధరలు ఇంకా తక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంది.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

Redmi Note 12 4G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Redmi Note 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇది పవర్ బటన్ లో ఎంబెడ్ చేయబడి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ తో లాంచైన Redmi Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi 12C, Note 12 4G https://www.91mobiles.com/telugu/redmi-12c-redmi-note-12-4g-india-global-launch-tipped/ Mon, 06 Mar 2023 12:57:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5232 Redmi సంస్థ వివిధ మార్కెట్స్ లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో Redmi 12C ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. 2022 డిసెంబర్ 31 న Redmi 12C చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ నెలలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత్ లో కూడా Redmi 12C ఎంట్రీ […]

The post త్వరలో భారత్‌తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi 12C, Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • MediaTek Helio G85 చిప్సెట్ తో రానున్న Redmi 12C
  • 5000mAh బ్యాటరీతో రానున్న Redmi 12C, Note 12 4G డివైజెస్
  • స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో రానున్న Redmi Note 12 4G

Redmi సంస్థ వివిధ మార్కెట్స్ లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో Redmi 12C ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. 2022 డిసెంబర్ 31 న Redmi 12C చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ నెలలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

భారత్ లో కూడా Redmi 12C ఎంట్రీ ఇవ్వనుందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. Redmi Note 12 4G కూడా భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానుందని ముకుల్ శర్మ తెలిపాడు.

షావోమి సబ్-బ్రాండ్ Redmi నుంచి Redmi Note 12 4G కొత్త బడ్జెట్ శ్రేణి ఫోన్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Redmi 12C, Note 12 4G ఫోన్ల యొక్క లాంచ్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

Redmi 12C, Redmi Note 12 4G ఇండియా లాంచ్ వివరాలు

Redmi 12C డివైజ్ చవకైన ఫోన్ గా కంపెనీ నుంచి రానుంది. ఈ నెలలోనే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ముకుల్ శర్మ లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేయలేదు. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నందున త్వరలోనే భారత్ తో పాటు, ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ అదే హార్డ్‌వేర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Redmi 12C ఒక 4జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ లో 6.71-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 1650 x 720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మందపాటి బెజెల్ ని కలిగి ఉంటుంది.

చైనాలో Redmi 12C 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచైంది. ఇతర మార్కెట్స్ లో కూడా ఇదే స్టోరేజీతో లాంచ్ కానున్నట్లు సమాచారం. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా 512జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు. Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 0.8 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. Redmi 12C లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇందులో ఇచ్చారు. భద్రత కోసం రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. మైక్రో యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకునే వీలుంది.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 4G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ఉన్నాయి. లీకైన స్పెసిఫికేషన్స్ ప్రకారం, ఈ ఫోన్ ఐస్ బ్లూ, ఆనిక్స్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ లో లభ్యమవ్వనుంది. Redmi Note 12 4G గ్లోబల్ గా 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది.

Redmi Note 12 4G లో స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వాడనున్నారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 4G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

Redmi Note 12 4G డివైజ్ ఐపీ53 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది. ఈ డివైజ్ 165.66 మిల్లీ మీటర్ల పొడవు, 75.96 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.85 మిల్లీ మీటర్ల మందం, 183.5 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi 12C, Note 12 4G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-4g-specifications-color-options-leaked-before-launch/ Wed, 01 Mar 2023 05:22:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=5155 భారత్ లో Redmi Note 12 సిరీస్ ని లాంచ్ చేసిన షావోమి ఇప్పుడు ఈ సిరీస్ లో ఒక 4జీ వేరియంట్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే Redmi Note 12 4G డివైజ్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. రూమర్లను బట్టి, ఈ డివైజ్ రానున్న కొన్ని నెలల్లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో దర్శనమిచ్చింది. టిప్‌స్టర్ SnoopyTech తాజాగా ఒక కొత్త సమాచారంతో […]

The post లీకైన Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 12 సిరీస్ లో 4జీ వేరియంట్ ని లాంచ్ చేయాలని భావిస్తోన్న షావోమి
  • భారత్ లో ఇప్పటికే Redmi Note 12 సిరీస్ లో లాంచైన 3 ఫోన్లు
  • మూడు కలర్ వేరియంట్స్ లో లభించనున్న Redmi Note 12 4G; త్వరలోనే గ్లోబల్ గా లాంచ్ కానున్న డివైజ్

భారత్ లో Redmi Note 12 సిరీస్ ని లాంచ్ చేసిన షావోమి ఇప్పుడు ఈ సిరీస్ లో ఒక 4జీ వేరియంట్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే Redmi Note 12 4G డివైజ్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. రూమర్లను బట్టి, ఈ డివైజ్ రానున్న కొన్ని నెలల్లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో దర్శనమిచ్చింది. టిప్‌స్టర్ SnoopyTech తాజాగా ఒక కొత్త సమాచారంతో వచ్చాడు. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 4G లాంచ్ వివరాలు, స్టోరేజీ, కలర్ వేరియంట్స్

Redmi Note 12 4G డివైజ్ రానున్న కొన్ని వారాల్లో గ్లోబల్ గా లాంచ్ కానుందని టిప్‌స్టర్ వెల్లడించాడు. అయితే Redmi Note 12 4G డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియదు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభించనుంది. మింట్ గ్రీన్, ఆనిక్స్ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుందని అంచనా వేస్తున్నారు.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా తో రానుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ను వాడనున్నారు. చిప్సెట్ వివరాలు ఇంకా తెలియదు. ఇక బ్యాటరీ విభాగం చూస్తే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. ఐపీ53 రేటింగ్, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఈ ఫోన్ రానున్నట్లు టిప్‌స్టర్ చెబుతున్నాడు.

రిపోర్ట్ ప్రకారం, Redmi Note 12 4G డివైజ్ NBTC, TDRA, FCC, IMDA సర్టిఫికేషన్స్ ని పొందినట్లు తెలుస్తోంది. FCC లిస్టింగ్ ప్రకారం, Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ వర్షన్ వివరాలు తెలుస్తాయి. Redmi Note 10 Pro కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా Redmi Note 12 4G వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 12 4G భారత్ & గ్లోబల్ లాంచ్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-note-12-4g-india-and-global-launch-timeline/ Wed, 18 Jan 2023 05:40:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=4511 షావోమి సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ అఫీషియల్ గా Redmi Note 12 సిరీస్ ని భారత్ మరియు చైనాల్లో లాంచ్ చేసింది. భారత్ లో లాంచైన నోట్ 12 సిరీస్ ఫోన్లు 3 కాగా, చైనాలో వీటికి తోడు మరికొన్ని మోడల్స్ కూడా లాంచ్ అయ్యాయి. చైనాలో లాంచైన అన్ని మోడల్స్ దాదాపుగా 5జీ కనెక్టివిటీ కలిగినవే ఉన్నాయి. అయితే త్వరలోనే షావోమి Redmi Note 12 4G వర్షన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఇంకా […]

The post Redmi Note 12 4G భారత్ & గ్లోబల్ లాంచ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రానున్న కొన్ని వారాల్లో భారత్ లో లాంచ్ కానున్న Redmi Note 12 4G
  • IMEI డేటాబేస్ పై కనిపించిన Redmi Note 12 4G
  • 8జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో వస్తోన్న Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్

షావోమి సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ అఫీషియల్ గా Redmi Note 12 సిరీస్ ని భారత్ మరియు చైనాల్లో లాంచ్ చేసింది. భారత్ లో లాంచైన నోట్ 12 సిరీస్ ఫోన్లు 3 కాగా, చైనాలో వీటికి తోడు మరికొన్ని మోడల్స్ కూడా లాంచ్ అయ్యాయి. చైనాలో లాంచైన అన్ని మోడల్స్ దాదాపుగా 5జీ కనెక్టివిటీ కలిగినవే ఉన్నాయి.

అయితే త్వరలోనే షావోమి Redmi Note 12 4G వర్షన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఇంకా 5జీ సేవలు అందుబాటులోకి రాని మార్కెట్స్ లో ఈ 4జీ మోడల్ ని లాంచ్ చేయనుంది షావోమి. ఇకపోతే, భారత్ మరియు చైనాల్లో కూడా ఈ తక్కువ ధర కలిగిన Redmi Note 12 4G ఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నారు.

షావోమి ఇంకా Redmi Note 12 4G యొక్క లాంచ్ వివరాలను ఖరారు చేయలేదు. ఈలోపు XiaomiUI వెబ్‌సైట్ Redmi Note 12 4G కి సంబంధించిన రిపోర్ట్ ని లీక్ చేసింది. త్వరలోనే Redmi Note 12 4G భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. ఐఎంఈఐ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా Redmi Note 12 4G కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 4G IMEI లిస్టింగ్

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ కొన్ని వారాల్లో భారత్ లో లాంచ్ కానుంది. షావోమి ఇంకా వివరాలను కన్ఫర్మ్ చేయలేదు. అయితే కొన్ని రూమర్లైతే నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. షావోమియూఐ రిపోర్ట్ ప్రకారం Redmi Note 12 4G రెండు వర్షన్స్ లో రానుంది.

Redmi Note 12 4G కోడ్ నేమ్ తపస్ అని పెట్టారు. ఈ ఫోన్ 23028RA60L, 23021RAAEG అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది. ఈ రెండు వేరియంట్లు ఎన్ఎఫ్‌సీ ఫీచర్ తో రావడం లేదు. అయితే ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్న వేరియంట్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. ఈ వేరియంట్ భారత్ లో లాంచ్ కాదు. ఈ వేరియంట్ కోడ్ నేమ్ టోపాజ్ కాగా, 23021RAA2Y అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

Redmi Note 12 4G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇక భారత్ లో లాంచైన Redmi Note 12 సిరీస్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ తో వచ్చింది.

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో వస్తోంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంది.https://www.indiangadgetawards.com/

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Redmi Note 12 4G భారత్ & గ్లోబల్ లాంచ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>