స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ తో లాంచైన Redmi Note 12 4G

Highlights

  • గ్లోబల్ గా లాంచైన Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ Redmi Note 12 4G
  • భారత్ లో మార్చి 30 న లాంచ్ కానున్న Redmi Note 12 4G

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచైంది. మార్చి 30 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ Redmi Note 12 4G కావడం విశేషం. ఇక రెడ్మీ నోట్ 12 లైనప్ లో ఇప్పటి వరకు రెడ్మీ నోట్ 12 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో+ 5జీ అనే ఫోన్లు వచ్చాయి. సరే, తాజాగా లాంచైన Redmi Note 12 4G కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 4G ధర

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచైంది. 4జిబి ర్యామ్ వేరియంట్ ధర 199 యూరోలు (సుమారు రూ.17,000) గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ ధర 229.99 యూరోలు (సుమారు రూ.20,600) గా ఉంది. 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 249.99 (సుమారు రూ.22,000) గా ఉంది. Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ ఐస్ బ్లూ, ఆనిక్స్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. భారత్ లో లాంచ్ అయ్యాక ఈ ఫోన్ ధరలు వేరుగా ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ ధరలతో పోల్చితే భారత్ లో ధరలు ఇంకా తక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంది.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

Redmi Note 12 4G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Redmi Note 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇది పవర్ బటన్ లో ఎంబెడ్ చేయబడి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Realme C55
Next article90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Samsung Galaxy F14 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.