Redmi Note 12 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 Mar 2023 13:51:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-january-2023-india-samsung-vivo-iqoo-redmi-tecno/ Sat, 31 Dec 2022 08:31:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4267 హైలైట్స్ 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్ భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2 కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ […]

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్
  • భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు
  • లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2

కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చీ రావడంతోనే అంటే జనవరి 2023 లో కొన్ని దిగ్గజ కంపెనీల నుంచి ఫోన్ లాంచెస్ ని మనం చూడబోతున్నాం. iQOO 11, Redmi Note 12 సిరీస్, Samsung Galaxy F04, Poco C50, Vivo X90 సిరీస్, Tecno Phantom X2 ఫోన్లు జనవరిలో భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్

  • iQOO 11
  • Redmi Note 12 సిరీస్
  • Samsung Galaxy F04
  • Poco C50
  • Vivo X90 సిరీస్
  • Tecno Phantom X2

2023 జనవరి 10 న ఐకూ 11 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 11 తో పాటు ఐకూ 11 ప్రో ఉంటాయి. అయితే తొలుత ఐకూ 11 మాత్రమే వస్తోంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుంది. విషయమేంటంటే ఐకూ 11 సిరీస్ చైనాలో 2022 డిసెంబర్ 8 న లాంచ్ అయ్యింది.

Redmi Note 12 సిరీస్

2023 జనవరి 5 న రెడ్మీ నోట్ 12 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో రెడ్మీ నోట్ 12 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. రెడ్మీ అభిమానులు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Samsung Galaxy F04

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి లో-బడ్జెట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 04 కొత్త సంవత్సరం మొదటి నెలలో భారత్ లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ ఫోన్ ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం ఉంది.

POCO C50

పోకో బ్రాండ్ భారత్ లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ సీ-సిరీస్ ఫోన్ భారతీయ మార్కెట్ లో 2023 జనవరి 3 న లాంచ్ అవుతుందని మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.7,000 గా ఉండే అవకాశం ఉంది.

Moto Edge 40

మోటో ఎడ్జ్ 40 సిరీస్ 2023 జనవరిలో భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. భారత్ లో ఏ తేదీన లాంచ్ అవుతుందో ఇంకా కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Vivo X90 సిరీస్

వివో నుంచి రాబోవు నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన వివో ఎక్స్90 చైనాలో ఈ ఏడాది లాంచ్ అయ్యింది. గ్లోబల్ ఈవెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే లీకైన పోస్టర్స్ ని బట్టి ఈ ఫోన్ 2023 జనవరి 31 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Tecno Phantom X2

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్ భారత్ లో 2023 జనవరి నెలలో లాంచ్ కానుంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి. జనవరి 2 నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలవ్వనుండగా, జనవరి 9 నుంచి సేల్ ప్రారంభమవ్వనుంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. అదే చైనాలో అయితే జనవరి 4 న లాంచ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ నెలలో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్; రిలీజ్ అయిన పోస్టర్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-launch-poster-revealed/ Thu, 20 Oct 2022 08:28:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2986 హైలైట్స్ ఈ నెలలో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, టీజర్ పోస్టర్ ద్వారా వచ్చిన కన్ఫర్మేషన్ ఈ లైనప్ లో వస్తున్న మోడల్స్: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Plus రెండు కొత్త టెక్నాలజీస్ తో వస్తున్న Redmi Note 12 సిరీస్ Redmi Note 12 సిరీస్ లాంచ్ సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అవ్వనుందని […]

The post ఈ నెలలో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్; రిలీజ్ అయిన పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ నెలలో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, టీజర్ పోస్టర్ ద్వారా వచ్చిన కన్ఫర్మేషన్
  • ఈ లైనప్ లో వస్తున్న మోడల్స్: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Plus
  • రెండు కొత్త టెక్నాలజీస్ తో వస్తున్న Redmi Note 12 సిరీస్

Redmi Note 12 సిరీస్ లాంచ్ సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అవ్వనుందని గతంలో వచ్చిన నివేదికలు స్పష్టం చేశాయి. ఇప్పుడు కంపెనీ నుంచి అధికార పోస్టర్ విడుదలైంది. దీంతో లాంచ్ ఈ నెలలోనే ఉండనుందని స్పష్టమైంది. అయితే ఈ పోస్టర్ లో లాంచ్ తేదీ రివీల్ కాలేదు. పోస్టర్ లో “ఈ నెలలో కలుసుకుందాం” అని రాసి ఉంది.

Redmi Note 12 లాంచ్ టీజర్

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Redmi Note 12 లాంచ్ టీజర్ పోస్టర్ ని తొలుత గమనించాడు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో ద్వారా ఈ పోస్టర్ బయటకు వచ్చింది. Redmi Note 12 సిరీస్ ఈ నెలలో లాంచ్ అవ్వనుందన్న విషయంతో పాటు, రెండు కొత్త టెక్నాలజీలతో వస్తున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమైంది. మరి ఈ వరల్డ్-ఫస్ట్ టెక్నాలజీస్ ఏంటో ఇంకా మనకు తెలియదు. మరి ఇటీవలి కాలంలో లీకైన సమాచారాన్ని బట్టి Redmi Note 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Redmi Note 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 లైనప్ లో Redmi Note 12, Redmi Note 12 Pro, మరియు Redmi Note 12 Pro+ మోడల్స్ ఉంటాయని అంతా భావిస్తున్నారు. వీటికి తోడు, Redmi Note 12 Pro Extreme Edition కూడా ఉంటుందని లీకైన లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. లాంచ్ తర్వాత గానీ పూర్తి క్లారిటీ వచ్చేలా లేదు.

Redmi Note 12 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. డైమెన్సిటీ 1300 లేదా ఇంకేదైనా 6ఎన్ఎం చిప్సెట్ వాడే అవకాశం ఉంది. ఈ ఫోన్లు 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే బ్యాటరీ కెపాసిటీస్ వివరాలు ఇంకా తెలియలేదు. రెడ్మీ నోట్ 12 లేదా నోట్ 12 ప్రో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

Redmi Note 12 Pro+ 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు షావోమీ నుంచి 200 వాట్+ ఫాస్ట్ చార్జింగ్ కి సంబంధించిన టీజర్ పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. దీన్ని బట్టి రెడ్మీ 12 సిరీస్ లోని ప్రో వర్షన్ లో 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనుందని అంచనా వేస్తున్నారు.

ఇక డిజైన్ గురించి మాట్లాడితే Redmi Note 12 సిరీస్ కి షావోమీ పెద్దగా మార్పులు చేసే విధంగా కనిపించడం లేదు. కంపెనీ యొక్క EVOL డిజైన్ లాంగ్వేజీనే ఫాలో అయ్యే అవకాశం ఉంది. మార్పులు ఏవైనా ఉంటే అవి సాఫ్ట్‌వేర్ పరంగా తీసుకునేవే అయి ఉంటాయి. ప్రస్తుతం Redmi Note 11 Pro+ ప్రస్తుత లైనప్ లో హైఎండ్ డివైజ్ గా కొనసాగుతోంది. ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ని కలిగి ఉంది. Redmi Note 12 సిరీస్ ప్రాసెసర్, కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ విభాగాల్లో అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఈ నెలలో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్; రిలీజ్ అయిన పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Redmi Note 12 సిరీస్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-battery-specs-leaked-before-launch/ Tue, 18 Oct 2022 10:00:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=2940 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ ఈ లైనప్ లో వస్తున్న 3 మోడల్స్ ఇవే: Redmi Note 12 5G, Note 12 Pro 5G, Note 12 Pro+ 5G లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Redmi Note 12 సిరీస్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో Redmi Note 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన తర్వాత రెడ్మీ కంపెనీ త్వరలో Redmi […]

The post లాంచ్ కి ముందు లీకైన Redmi Note 12 సిరీస్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్
  • ఈ లైనప్ లో వస్తున్న 3 మోడల్స్ ఇవే: Redmi Note 12 5G, Note 12 Pro 5G, Note 12 Pro+ 5G
  • లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Redmi Note 12 సిరీస్

భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో Redmi Note 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన తర్వాత రెడ్మీ కంపెనీ త్వరలో Redmi Note 12 సిరీస్ ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యాక, తర్వాత మిగతా మార్కెట్స్ లోకి ఈ సిరీస్ ఎంట్రీ ఇవ్వనుంది. రీసెంట్ గా బయటకు వచ్చిన లీక్స్ ద్వారా Redmi Note 12 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో ఓ అవగాహన వచ్చింది. తాజాగా Redmi Note 12 సిరీస్ ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ పై కనిపించింది.

టిప్‌స్టర్ ముకుల్ శర్మ గమనించిన Redmi Note 12 సిరీస్ లిస్టింగ్ ద్వారా ఈ లైనప్ లో Redmi Note 12 5G, Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఉన్నట్లు తెలిసింది. ఈ మూడు మోడల్స్ కూడా 5జీ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 5జీ నెట్వర్క్ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో మొబైల్ ఫోన్ కంపెనీలు కూడా 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్లను విడుదల చేస్తున్నాయి.

Redmi Note 12 సిరీస్ వేరియంట్స్, స్పెసిఫికేషన్స్

Redmi Note 12 సిరీస్ ఆన్‌లైన్ లిస్టింగ్ ని బట్టి ఈ లైనప్ లో మూడు మోడల్స్ ఉండనున్నట్లు అర్థమవుతోంది. అవి: Redmi Note 12 5G, Note 12 Pro 5G, Note 12 Pro+ 5G. ఈ మూడు మోడల్స్ కూడా 5జీ సపోర్ట్ తో వస్తున్నాయి. అయితే, లిస్టింగ్ లో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ఏవీ బయటకు రాలేదు. అయితే ధర మాత్రం RMB 9999 అని ఉంది. అన్ని మోడల్స్ కి కూడా ఇదే ధర కనిపిస్తోంది. అంటే ఇంకా ధరను నిర్ణయించలేదని తెలుస్తోంది.

Redmi Note 12 సిరీస్ వచ్చే నెల ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ లైనప్ చైనా కు చెందిన 3సీ సర్టిఫికేషన్ ని పొందింది. 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో 22101316C, 22101316UCP, 22101316UC అనే మోడల్ నంబర్లతో ఈ లైనప్ కనిపించింది. లిస్టింగ్ ద్వారా మూడు మోడల్స్ లో ఒకటి 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. అది Redmi Note 12 Pro+ అయ్యుండే అవకాశం ఉంది. ఇదే లిస్టింగ్ లో MDY-13-EU మరియు 20VDC/10.5A మోడల్ నంబర్ తో 210 వాట్ చార్జర్ కనిపించింది.

ఇదిలా ఉండగా, స్టాండర్డ్ వేరియంట్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రో వేరియంట్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు సమాచారం. Redmi Note 12 50ఎంపి ప్రైమరీ కెమెరాని కలిగి ఉండనుంది. పెర్ఫామెన్స్, ఎక్స్‌పీరియన్స్ విషయంలో Redmi Note సిరీస్ ఓ చిన్నపాటి ఫ్లాగ్షిప్ గా నిలుస్తుందని, అలాగే ప్రతీ 6 నెలలకు ఒకసారి నోట్ సిరీస్ లాంచ్ అవుతూనే ఉంటుందని రెడ్మీ ప్రోడక్ట్ మేనేజర్ లూ వీబింగ్ తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Redmi Note 12 సిరీస్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
210W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 12 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-210w-fast-charging-launch-timeline/ Sun, 02 Oct 2022 04:35:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=2698 హైలైట్స్: 3C సర్టిఫికేషన్ పై కనిపించిన Redmi Note 12 సిరీస్ హ్యాండ్సెట్స్ 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 12 సిరీస్, 3సీ సర్టిఫికేషన్ ద్వారా బయటకు వచ్చిన సమాచారం లైనప్ లో ఉన్న మోడల్స్: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ Redmi Note 12 సిరీస్ వరుస లీకులతో వార్తల్లో నిలుస్తోంది. ప్రైస్‌బాబా నుంచి లేటెస్ట్ గా మరో వార్త […]

The post 210W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 3C సర్టిఫికేషన్ పై కనిపించిన Redmi Note 12 సిరీస్ హ్యాండ్సెట్స్
  • 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 12 సిరీస్, 3సీ సర్టిఫికేషన్ ద్వారా బయటకు వచ్చిన సమాచారం
  • లైనప్ లో ఉన్న మోడల్స్: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+

Redmi Note 12 సిరీస్ వరుస లీకులతో వార్తల్లో నిలుస్తోంది. ప్రైస్‌బాబా నుంచి లేటెస్ట్ గా మరో వార్త వచ్చింది. దీని ప్రకారం, Redmi Note 12 సిరీస్ ఫోన్లు 3సీ సర్టిఫికేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. రిపోర్ట్ ని బట్టి, Redmi Note 12 సిరీస్ 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ ఉండనున్నాయి. అవి: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. వీటిలో Redmi Note 12 Pro+ 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. 3సీ లిస్టింగ్ ద్వారా రెడ్మీ నోట్ 12 సిరీస్ కి సంబంధించిన ఇంకా ఏయే వివరాలు తెలిసాయో ఓసారి చూద్దాం పదండి.

Redmi Note 12 సిరీస్ 3C సర్టిఫికేషన్

తాజాగా రివీల్ అయిన 3సీ సర్టిఫికేషన్ ద్వారా Redmi Note 12 సిరీస్ కి సంబంధించిన పలు వివరాలు తెలిశాయి. రెడ్మీ 12 సిరీస్ లోని మూడు మోడళ్ళు, 22101316C, 22101316UCP, 22101316UC అనే మోడల్ నంబర్లను కలిగి ఉన్నాయి. ఈ మోడల్ నంబర్లు Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ కి సంబంధించినవి. సర్టిఫికేషన్ ని బట్టి ఈ మూడు మోడల్స్ 5జీ కనెక్టివిటీ కలిగి ఉంటాయని అర్థమవుతోంది.

Redmi Note 12 సిరీస్ మూడు ఫోన్లు వరుసగా 67 వాట్, 120 వాట్, 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉండనున్నాయి.20VDc/10.5A max (210W) మరియు MDY-13-EU అనే మోడల్ నంబర్లతో కొత్త చార్జర్ ఒకటి లిస్టింగ్ లో కనిపించింది.

ఈ న్యూస్ గనుక నిజమైతే, Redmi Note 12 సిరీస్, iQOO 10 Pro చార్జింగ్ స్పీడ్ ని దాటేయడం ఖాయం. ప్రస్తుతం ఐకూ 10 ప్రో 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్ గా పిలవబడుతోంది. రెడ్మీ నోట్ 12 సిరీస్ ఎంట్రీ ఇస్తే, ఆ పేరును ఐకూ నుంచి లాగేసుకోనుంది.

అక్టోబర్ ప్రథమార్థంలో Redmi Note 12 సిరీస్ ఫోన్లు చైనా మార్కెట్ లోకి అడుగుపెడతాయని వార్తలు వినిపిస్తున్నాయి. 2023 త్రైమాసికంలో రెడ్మీ 12 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఇండియా లాంచ్ తేదీకి సంబంధించిన మరింత క్లారిటీ రానుంది. ఏదేమైనా, రెడ్మీ నోట్ 12 సిరీస్ లాంచ్ కి ముందే ఇంత బజ్ క్రియేట్ చేస్తోందంటే, లాంచ్ అయ్యాక మరెంతగా ప్రభావం చూపెడుతుందో చూడాలి. అస్సలే రెడ్మీ ఫోన్లకు మార్కెట్ లో గిరాకీ చాలా ఎక్కువ.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 210W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP మెయిన్ కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Redmi Note 12 https://www.91mobiles.com/telugu/redmi-note-12-launch-timeline-china-specs-tipped/ Tue, 13 Sep 2022 13:00:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=2306 హైలైట్స్: Redmi Note 12 50ఎంపి కెమెరాతో రానుందని వినిపిస్తోన్న రూమర్లు 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుందని సమాచారం ఈ ఏడాది చైనాలో లాంచ్ కానున్న Redmi Note 12, వచ్చే ఏడాది గ్లోబల్ లాంచ్ ఉండే అవకాశం Redmi Note సిరీస్ కి భారత్ లో మాంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ లో మరొక ఫోన్ Redmi Note 12 రానుంది. Redmi Note […]

The post 50MP మెయిన్ కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Redmi Note 12 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Redmi Note 12 50ఎంపి కెమెరాతో రానుందని వినిపిస్తోన్న రూమర్లు
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుందని సమాచారం
  • ఈ ఏడాది చైనాలో లాంచ్ కానున్న Redmi Note 12, వచ్చే ఏడాది గ్లోబల్ లాంచ్ ఉండే అవకాశం

Redmi Note సిరీస్ కి భారత్ లో మాంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ లో మరొక ఫోన్ Redmi Note 12 రానుంది. Redmi Note 12 ఈ ఏడాది చైనాలో, వచ్చే ఏడాది గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ టిప్ స్టర్ Redmi Note 12 యొక్క కెమెరా, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ ను టీజ్ చేసింది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, Redmi Note 12 ఫోన్ 50ఎంపి ప్రైమరీ వైడ్ యాంగిల్ షూటర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ రానున్నట్లు తెలిపింది. బాక్స్ లో ఫోన్ తో పాటు చార్జర్ కూడా వస్తుందని వెల్లడించింది. అలాగే ఫోన్ రెక్టాంగ్యులర్ డిజైన్, స్క్వేర్డ్ ఎడ్జెస్ ని కలిగి ఉంటుందని చెప్పింది. చైనా వర్షన్ తీరుతెన్నులను గురించి టిప్‌స్టర్ వివరాలను తెలిపిందని మనం గమనించాలి. గ్లోబల్ వేరియంట్ కూడా దాదాపు అవే స్పెసిఫికేషన్స్ తో వచ్చే అవకాశం ఉంది. Redmi Note 12 లో 8 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలిగిన తొలి మిడ్-రేంజ్ షావోమీ ఫోన్ Xiaomi 11i HyperCharge 5G. భారత్ లో ఈ ఫోన్ విరివిగా అమ్ముడు పోయింది. Redmi Note 12 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలిగిన మరో ఫోన్ గా జనాల ముందుకు వస్తోంది. 0 నుంచి 100 శాతం చార్జింగ్ అవ్వడానికి Redmi Note 12 ఫోన్ 20 నిమిషాల సమయం తీసుకుంటుందని సమాచారం. Xiaomi 12 Pro ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కూడా ఇంతే సమయం తీసుకుంటుంది.

ఇంతకు ముందు, Redmi ప్రోడక్ట్ మేనేజర్ లూ వైబింగ్ మాట్లాడుతూ.. ప్రతీ 6 నెలలకు ఒకసారి Redmi Note సిరీస్ మార్పు చెందుతుందని చెప్పారు. అలాగే ఈ సిరీస్ పెర్ఫామెన్స్ విషయంలో చిన్నపాటి ఫ్లాగ్షిప్, ఎక్స్‌పీరియన్స్ లో కూడా చిన్న ఫ్లాగ్షిప్ వంటిదని ఆయన అన్నారు. చైనా సోషల్ మీడియా వేదిక వీబో లో Redmi Note సిరీస్ ఫోన్ లాంచ్ కి సంబంధించిన టీజర్ ని వైబింగ్ షేర్ చేశారు.

ట్రిపుల్ కెమెరా కాకుండా, 120వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ని Redmi Note 12 కలిగి ఉండనుందని సమాచారం. Redmi Note 12 ఈ ఏడాది చైనాలో లాంచ్ కానుందని పలు కథనాలు తెలియజేస్తున్నాయి. గత నెలలో ఈసీసీ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై రెండు Redmi Note 12 మోడల్స్ 22101316UG మోడల్ నంబర్స్ తో కనిపించాయి. వీటిలో ‘G’ అంటే గ్లోబల్ వేరియంట్ అని అనుకుంటున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్స్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 50MP మెయిన్ కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Redmi Note 12 first appeared on 91Mobiles Telugu.

]]>