హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్
- ఈ లైనప్ లో వస్తున్న 3 మోడల్స్ ఇవే: Redmi Note 12 5G, Note 12 Pro 5G, Note 12 Pro+ 5G
- లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Redmi Note 12 సిరీస్
భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో Redmi Note 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన తర్వాత రెడ్మీ కంపెనీ త్వరలో Redmi Note 12 సిరీస్ ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యాక, తర్వాత మిగతా మార్కెట్స్ లోకి ఈ సిరీస్ ఎంట్రీ ఇవ్వనుంది. రీసెంట్ గా బయటకు వచ్చిన లీక్స్ ద్వారా Redmi Note 12 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో ఓ అవగాహన వచ్చింది. తాజాగా Redmi Note 12 సిరీస్ ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పై కనిపించింది.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ గమనించిన Redmi Note 12 సిరీస్ లిస్టింగ్ ద్వారా ఈ లైనప్ లో Redmi Note 12 5G, Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఉన్నట్లు తెలిసింది. ఈ మూడు మోడల్స్ కూడా 5జీ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 5జీ నెట్వర్క్ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో మొబైల్ ఫోన్ కంపెనీలు కూడా 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్లను విడుదల చేస్తున్నాయి.
Redmi Note 12 సిరీస్ వేరియంట్స్, స్పెసిఫికేషన్స్
Redmi Note 12 సిరీస్ ఆన్లైన్ లిస్టింగ్ ని బట్టి ఈ లైనప్ లో మూడు మోడల్స్ ఉండనున్నట్లు అర్థమవుతోంది. అవి: Redmi Note 12 5G, Note 12 Pro 5G, Note 12 Pro+ 5G. ఈ మూడు మోడల్స్ కూడా 5జీ సపోర్ట్ తో వస్తున్నాయి. అయితే, లిస్టింగ్ లో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ఏవీ బయటకు రాలేదు. అయితే ధర మాత్రం RMB 9999 అని ఉంది. అన్ని మోడల్స్ కి కూడా ఇదే ధర కనిపిస్తోంది. అంటే ఇంకా ధరను నిర్ణయించలేదని తెలుస్తోంది.
Redmi Note 12 సిరీస్ వచ్చే నెల ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ లైనప్ చైనా కు చెందిన 3సీ సర్టిఫికేషన్ ని పొందింది. 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో 22101316C, 22101316UCP, 22101316UC అనే మోడల్ నంబర్లతో ఈ లైనప్ కనిపించింది. లిస్టింగ్ ద్వారా మూడు మోడల్స్ లో ఒకటి 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. అది Redmi Note 12 Pro+ అయ్యుండే అవకాశం ఉంది. ఇదే లిస్టింగ్ లో MDY-13-EU మరియు 20VDC/10.5A మోడల్ నంబర్ తో 210 వాట్ చార్జర్ కనిపించింది.
ఇదిలా ఉండగా, స్టాండర్డ్ వేరియంట్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రో వేరియంట్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు సమాచారం. Redmi Note 12 50ఎంపి ప్రైమరీ కెమెరాని కలిగి ఉండనుంది. పెర్ఫామెన్స్, ఎక్స్పీరియన్స్ విషయంలో Redmi Note సిరీస్ ఓ చిన్నపాటి ఫ్లాగ్షిప్ గా నిలుస్తుందని, అలాగే ప్రతీ 6 నెలలకు ఒకసారి నోట్ సిరీస్ లాంచ్ అవుతూనే ఉంటుందని రెడ్మీ ప్రోడక్ట్ మేనేజర్ లూ వీబింగ్ తెలిపారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












