Redmi Note 12S - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 May 2023 16:43:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 108ఎంపి కెమెరా, హీలియో జీ96 చిప్‌తో పోలాండ్ లో లాంచైన Redmi Note 12S https://www.91mobiles.com/telugu/redmi-note-12s-launched-poland-price-specs/ Thu, 11 May 2023 16:43:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=6265 గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా ఎన్నో Redmi Note 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన రెడ్మీ సంస్థ, తాజాగా Redmi Note 12S డివైజ్ ని పోలాండ్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ96 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. Redmi Note 12S ఒక 4జీ స్మార్ట్ ఫోన్. దీన్ని పోలాండ్ లో లాంచ్ చేశారు. […]

The post 108ఎంపి కెమెరా, హీలియో జీ96 చిప్‌తో పోలాండ్ లో లాంచైన Redmi Note 12S first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ మార్కెట్ లో లాంచైన Redmi Note 12S
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Redmi Note 12S ధర 1,499 పోలిష్ జ్లోటీలు (సుమారు రూ.29,500)

గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా ఎన్నో Redmi Note 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన రెడ్మీ సంస్థ, తాజాగా Redmi Note 12S డివైజ్ ని పోలాండ్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ96 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

Redmi Note 12S ఒక 4జీ స్మార్ట్ ఫోన్. దీన్ని పోలాండ్ లో లాంచ్ చేశారు. అయితే భారత మార్కెట్ లాంచ్ టైమ్‌లైన్ ఇంకా తెలియలేదు. సరే, ఓసారి Redmi Note 12S డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 12S ధర, డిజైన్, కలర్స్

  • Redmi Note 12S స్మార్ట్ ఫోన్ 8జిబి+256జిబి వేరియంట్ ధర 1499 పోలిష్ జ్లాటీలు (సుమారు రూ.29,500) గా ఉంది.
  • Redmi Note 12S డిజైన్ విషయానికి వస్తే, పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి.
  • ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో ప్రైమరీ సెన్సర్, రెండు రెగ్యులర్ కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ప్యానెల్ పై రెడ్మీ బ్రాండింగ్ ఉంది.
  • ఒనిక్స్ బ్లాక్, ఐస్ బ్లూ మరియు పెర్ల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Redmi Note 12S స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 90 హెర్ట్జ్ డిస్ప్లే
  • అమోలెడ్ ప్యానెల్

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్, స్టోరేజీ, ర్యామ్

  • హీలియో జీ96
  • 256జిబి స్టోరేజీ
  • 8జిబి ర్యామ్

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ96 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి. 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఆప్షన్ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 12S డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. స్టీరియో స్పీకర్, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వై-ఫై, 4జీ, డ్యూయల్ సిమ్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు.

వెయిట్, డైమెన్షన్స్

  • 176 గ్రాములు
  • 8.09 ఎంఎం

Redmi Note 12S స్మార్ట్ ఫోన్ 159.87 మిల్లీ మీటర్ల పొడవు, 73.87 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.09 మిల్లీ మీటర్ల మందం, 176 గ్రాముల బరువు ఉంటుంది.

The post 108ఎంపి కెమెరా, హీలియో జీ96 చిప్‌తో పోలాండ్ లో లాంచైన Redmi Note 12S first appeared on 91Mobiles Telugu.

]]>
108ఎంపి కెమెరాతో లాంచైన Redmi Note 12S; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-note-12s-launched-greece-price-specs-color-options/ Thu, 06 Apr 2023 09:08:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=5778 Redmi Note 12 సిరీస్ యురోపియన్ దేశం గ్రీస్ లోకి ప్రవేశించింది. రెడ్మీ బ్రాండ్ Redmi Note 12S ఫోన్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఈ డివైజ్ ఇంకా భారత్, చైనా మరే ఇతర దేశంలో లాంచ్ కాలేదు. కానీ, గ్రీస్ లో లాంచైంది. ఈ రెడ్మీ ఫోన్ శక్తివంతమైన కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12S డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Redmi Note 12S స్పెసిఫికేషన్స్ […]

The post 108ఎంపి కెమెరాతో లాంచైన Redmi Note 12S; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్రీస్ లో లాంచైన Redmi Note 12S స్మార్ట్ ఫోన్
  • 108ఎంపి కెమెరాతో వచ్చిన Redmi Note 12S
  • Redmi Note 12S ఐపీ53 సర్టిఫైడ్ ఫోన్

Redmi Note 12 సిరీస్ యురోపియన్ దేశం గ్రీస్ లోకి ప్రవేశించింది. రెడ్మీ బ్రాండ్ Redmi Note 12S ఫోన్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఈ డివైజ్ ఇంకా భారత్, చైనా మరే ఇతర దేశంలో లాంచ్ కాలేదు. కానీ, గ్రీస్ లో లాంచైంది. ఈ రెడ్మీ ఫోన్ శక్తివంతమైన కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12S డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi Note 12S స్పెసిఫికేషన్స్

డిస్ప్లే – Redmi Note 12S స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్, 6.43-ఇంచ్ డిస్ప్లే తో వచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్ – Redmi Note 12S డివైజ్ మీడియాటెక్ హీలియో జీ96 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెడ్మీ సంస్థ ఈ ఫోన్ లో రెడ్మీ ఎక్స్‌టెన్షన్ టెక్నాలజీని అందించింది. దీంతో వర్చువల్ ర్యామ్ ని పొందే అవకాశం ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 13జిబి ర్యామ్ లభిస్తుంది.

కెమెరా – Redmi Note 12S లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. మిగతా రెండు లెన్సెస్ వివరాలు ఇంకా తెలియలేదు. ఒక అల్ట్రావైడ్ మరియు ఒక మ్యాక్రో లెన్స్ వీటిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

బ్యాటరీ – పవర్ బ్యాకప్ కోసం Redmi Note 12S లో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది.

Redmi Note 12S ఫీచర్స్

  • Redmi Note 12S డివైజ్ ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ తో వచ్చింది.
  • ఐఆర్ బ్లాస్టర్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో అందించారు.
  • భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • డ్యూయల్ స్పీకర్లు Redmi Note 12S లో అందించారు.
  • Redmi Note 12S లో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

Redmi Note 12S ధర

Redmi Note 12S ఎన్ని వేరియంట్లలో లభ్యం కానుందో ఇంకా తెలియదు. యురోపియన్ మార్కెట్ లో సేల్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే యూరోప్ మార్కెట్ లో ఈ ఫోన్ ధర 289 యూరోలు గా ఉంది. భారత కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.25,700 గా ఉంటుంది. Redmi Note 12S గ్రీస్ లో ఆనిక్స్ బ్లాక్, ఐస్ బ్లూ మరియు పెర్ల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 108ఎంపి కెమెరాతో లాంచైన Redmi Note 12S; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>