
Redmi Note 12 సిరీస్ యురోపియన్ దేశం గ్రీస్ లోకి ప్రవేశించింది. రెడ్మీ బ్రాండ్ Redmi Note 12S ఫోన్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఈ డివైజ్ ఇంకా భారత్, చైనా మరే ఇతర దేశంలో లాంచ్ కాలేదు. కానీ, గ్రీస్ లో లాంచైంది. ఈ రెడ్మీ ఫోన్ శక్తివంతమైన కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12S డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi Note 12S స్పెసిఫికేషన్స్
డిస్ప్లే – Redmi Note 12S స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్, 6.43-ఇంచ్ డిస్ప్లే తో వచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్ – Redmi Note 12S డివైజ్ మీడియాటెక్ హీలియో జీ96 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెడ్మీ సంస్థ ఈ ఫోన్ లో రెడ్మీ ఎక్స్‌టెన్షన్ టెక్నాలజీని అందించింది. దీంతో వర్చువల్ ర్యామ్ ని పొందే అవకాశం ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 13జిబి ర్యామ్ లభిస్తుంది.
కెమెరా – Redmi Note 12S లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. మిగతా రెండు లెన్సెస్ వివరాలు ఇంకా తెలియలేదు. ఒక అల్ట్రావైడ్ మరియు ఒక మ్యాక్రో లెన్స్ వీటిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.
బ్యాటరీ – పవర్ బ్యాకప్ కోసం Redmi Note 12S లో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది.
Redmi Note 12S ఫీచర్స్
- Redmi Note 12S డివైజ్ ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ తో వచ్చింది.
- ఐఆర్ బ్లాస్టర్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో అందించారు.
- భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
- డ్యూయల్ స్పీకర్లు Redmi Note 12S లో అందించారు.
- Redmi Note 12S లో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
Redmi Note 12S ధర
Redmi Note 12S ఎన్ని వేరియంట్లలో లభ్యం కానుందో ఇంకా తెలియదు. యురోపియన్ మార్కెట్ లో సేల్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే యూరోప్ మార్కెట్ లో ఈ ఫోన్ ధర 289 యూరోలు గా ఉంది. భారత కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.25,700 గా ఉంటుంది. Redmi Note 12S గ్రీస్ లో ఆనిక్స్ బ్లాక్, ఐస్ బ్లూ మరియు పెర్ల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











