Redmi Note 13 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 16:35:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/ https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/#respond Tue, 08 Oct 2024 16:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13990 ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం. Best camera phones […]

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

Best camera phones (రూ.25,000 లోపు)

స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర
ఐకూ జెడ్9ఎస్ ప్రో రూ.24,999
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ.24,999
నథింగ్ ఫోన్ (2ఏ) రూ.23,999
రెడ్మీ నోట్ 13 ప్రో రూ.23,999

iQOO Z9s Pro

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో కెమెరా పెర్ఫామెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫోకస్ ఫాస్ట్‌గా, షట్టర్ స్పీడ్స్ బాగున్నాయి.

అయితే లో-లైట్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, వైబ్రంట్, డీటెయిల్డ్ ఇమేజెస్, అద్భుతమైన డైనమిక్ రేంజ్ ను ఈ ఫోన్ డెలివర్ చేస్తోంది. అల్ట్రావైడ్ లెన్స్ విషయానికి వస్తే, వివిడ్, హై-కాంట్రాస్ట్ షాట్స్ ను బాగా క్యాప్చర్ అవుతున్నాయి. పొట్రెయిట్స్ షార్ప్‌గా, స్కిన్ టోన్స్ ఆక్యురేట్ గా ఉన్నాయి. బొకే ఎఫెక్ట్ మాత్రం నేచురల్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ లో-లైట్ ఇష్యూస్
అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ పనితనం అసహజమైన బొకే ఎఫెక్ట్
సాలిడ్ పొట్రెయిట్ మోడ్

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఇంప్రెస్సివ్ షాట్స్ డెలివర్ చేస్తోంది. అయితే కలర్స్ కాస్త బూస్ట్ చేస్తోంది. ఆకాశాన్ని ఎక్కువ నీలంగా, గడ్డిని మరింత పచ్చగా చేస్తోంది.

పొట్రెయిట్, నైట్ మోడ్స్ విషయంలో ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తోంది. అయితే, ల్యాండ్‌స్కేప్ సెల్ఫీస్ విషయంలో బగ్ వల్లన, క్యాషెస్ లేదా బొకే ఎఫెక్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్, సరైన స్కిన్ టోన్స్ అందిస్తోంది.

బాగున్నవి బాగాలేనివి
కలర్‌ఫుల్, వైబ్రంట్ ఇమేజెస్ కలర్ బూస్టింగ్
పొట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఎడ్జ్ డిటెక్షన్ అసహజమైన బొకే ఎఫెక్ట్
మంచి సెల్ఫీ కెమెరా ల్యాండ్‌స్కేప్ సెల్ఫీ మోడ్‌లో బగ్
మంచి లో-లైట్ పెర్ఫామెన్స్

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్ లో నార్డ్ సీఈ4 పనితీరు బాగుంది. సరైన వైట్ బ్యాలన్స్, సహజ రంగులు ఇమేజెస్ లో బాగున్నాయి.

కెమెరా డీసెంట్ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసింది. అయితే డార్క్ బ్లూ టోన్స్ మరియు పొట్రెయిట్ షాట్స్ లోని ఫేషియల్ డీటెయిల్స్ విషయాల్లో కెమెరా కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పొట్రెయిట్ మోడ్ రిచ్ బొకే ఎఫెక్ట్, ఎడ్జ్ డిటెక్షన్ అందిస్తోంది. అయితే, హై-రెజ్ మోడ్ యొక్క కలర్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
నేచురల్ కలర్ ప్రొడక్షన్ అల్ట్రావైడ్ షాట్స్ లో సాఫ్ట్ డైనమిక్ రేంజ్
క్రిస్ప్ డీటెయిల్స్ కోసం హై-రెజ్ మోడ్ ఫేషియల్ డీటెయిల్స్ సాఫ్ట్ అవ్వడం
పొట్రెయిట్ మోడ్‌లో యాక్యురేట్ ఫేస్ డిటెక్షన్

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలు పిక్సెల్-బైనింగ్ ద్వారా 12.5ఎంపి ఇమేజెస్‌ను బైడీఫాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. డే-లైట్ లో షార్ప్, డీటెయిల్డ్ షాట్స్ మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ తో వస్తున్నాయి.

కలర్స్ పూర్తిగా నేచురల్ గా లేవు. అవి వైబ్రంట్ మరియు పంచీగా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ డీసెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాస్త వార్మ్ టోన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాతో పోల్చితే తక్కువ క్వాలిటీ గల ఇమేజెస్‌ను అల్ట్రావైడ్ అందిస్తోంది. లో-లైట్ కండీషన్స్ లో కెమెరాలు ఆటోమేటిక్ గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. నైట్ మోడ్ లో ఎక్స్‌పోజర్ మెరుగ్గా, షార్ప్‌నెస్, నాయిస్ తక్కువగా ఉన్నాయి. డేలైట్ లో ఫ్రంట్ కెమెరా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోర్ కండీషన్స్ (లోలైట్) లో కెమెరా పనితీరు నాసీరకంగా ఉంది.

బాగున్నవి బాగాలేనివి
అద్భుతమైన డేలైట్ పనితీరు ఎక్కువ వైబ్రంట్‌గా కనిపిస్తోన్న కలర్స్
ఎఫెక్టివ్ నైట్ మోడ్ బాగాలేని లో-లైట్ సెల్ఫీ పెర్ఫామెన్స్
మంచి డే-లైట్ సెల్ఫీస్ యావరేజీ క్వాలిటీ అల్ట్రావైడ్ లెన్స్

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 13 Pro

Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు వైబ్రంట్ గా ఉన్నాయి. అయితే కాస్త ఆరెంజ్ వంటి కలర్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్, డైనమిక్ రేంజ్ బాగున్నాయి.

అయితే, లో-లైట్ కండీషన్స్ లో కలర్ కన్సిస్టెన్సీ బాగాలేదు. ఇమేజెస్ లో ఓవర్‌ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అల్ట్రావైడ్ లెన్స్ కలర్ బ్యాలన్స్, ప్రైమరీ కెమెరాకు దాదాపు సమానంగా ఉంది. అయితే డీటెయిల్స్ బాగాలేవు. పొట్రెయిట్ షాట్స్ విషయంలో ఫోకస్ సమస్యగా ఉంది. ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్ లో బాగుంది. పొట్రెయిట్ మోడ్‌లో స్కిన్ టోన్ డిటెక్షన్ పర్ఫెక్ట్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ సరిగ్గాలేని లో-లైట్ పనితీరు
ఏఐ ఎడిటింగ్ టూల్స్ సరిగ్గాలేని స్కిన్ టోన్ డిటెక్షన్
మంచి డేలైట్ సెల్ఫీస్ అల్ట్రావైడ్ షాట్స్ లో డీటెయిల్స్ బాగా లేవు

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ చార్జింగ్

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/feed/ 0
Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-phones-get-price-cut-know-full-details/ Wed, 01 May 2024 09:05:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11291 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కొన్ని రోజుల క్రితం Redmi Note 13 5G అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Xiaomi 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా Redmi Note 13 5G సిరీస్ లోని ఫోన్ల ధరను షావోమి తగ్గించింది. దీంతో ఈ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర ప్రస్తుతం రూ.15,499 గా ఉంది. ఓసారి ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి. Redmi Note 13 5G ధర తగ్గింపు […]

The post Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల పై డిస్కౌంట్
  • గతేడాది లాంచైన నోట్ 13 5జీ సిరీస్
  • సిరీస్ ప్రారంభ ధర రూ.15,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కొన్ని రోజుల క్రితం Redmi Note 13 5G అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Xiaomi 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా Redmi Note 13 5G సిరీస్ లోని ఫోన్ల ధరను షావోమి తగ్గించింది. దీంతో ఈ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర ప్రస్తుతం రూ.15,499 గా ఉంది. ఓసారి ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G ధర తగ్గింపు

Redmi Note 13 5G సిరీస్ లోని అన్ని ఫోన్ల ధరలను షావోమి తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత Redmi Note 13 Pro 5G ధర రూ.21,999 గా ఉంది. Pro+ ధర రూ.27,999 గా ఉంది.

షావోమి ఐసీఐసీఐ బ్యాంక్ తో జట్టు కట్టి, అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ/నాన్-ఈఎంఐ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Redmi Note 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంఐ.కామ్, షావోమి హోమ్ మరియు షావోమి రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 Pro సిరీస్ లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ68 రేటింగ్, 200ఎంపి కెమెరాలు ఉన్నాయి.

Redmi Note 13 లో ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, 100ఎంపి కెమెరా, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/realme-12-pro-5g-vs-redmi-note-13-pro-5g-which-is-best/ Mon, 29 Jan 2024 15:41:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9963 Realme 12 Pro మరియు Redmi Note 13 Pro డివైజెస్ మిడ్ రేంజ్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ లో లాంచ్ చేయబడ్డాయి. ఈసారి ఈ రెండు ఫోన్లు మార్కెట్ లో గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి. రెండు ఫోన్లు కూడా చక్కటి కెమెరా సామర్థ్యంతో వచ్చాయి. డిజైన్ మరియు బిల్ట్ క్వాలిటీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి రెండు ఫోన్లలో ఏ ఫోన్ జనాల ఆదరణ ఎక్కువగా పొందుతుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది. ఈలోపు […]

The post Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme 12 Pro మరియు Redmi Note 13 Pro డివైజెస్ మిడ్ రేంజ్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ లో లాంచ్ చేయబడ్డాయి. ఈసారి ఈ రెండు ఫోన్లు మార్కెట్ లో గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి. రెండు ఫోన్లు కూడా చక్కటి కెమెరా సామర్థ్యంతో వచ్చాయి. డిజైన్ మరియు బిల్ట్ క్వాలిటీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి రెండు ఫోన్లలో ఏ ఫోన్ జనాల ఆదరణ ఎక్కువగా పొందుతుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది. ఈలోపు మనం రెండు ఫోన్లలో ఉన్న స్పెసిఫికేషన్స్ ని పోల్చి చూద్దాం.

Realme 12 Pro vs Redmi Note 13 Pro

ప్రాసెసర్

  • Realme 12 Pro డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.
  • Redmi Note 13 Pro లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి. ఈ చిప్సెట్ కూడా 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ

  • Realme 12 Pro మరియు Redmi Note 13 Pro డివైజెస్ లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • Realme 12 Pro లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

డిస్ప్లే

  • Realme 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • Redmi Note 13 Pro లో 6.67-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.

ఆపరేటింగ్ సిస్టమ్

  • Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • Redmi Note 13 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ

  • రెండు ఫోన్లలో 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
  • అయితే Redmi Note 13 Pro లో ఎన్ఎఫ్‌సీ ఉంది. Realme 12 Pro లో ఎన్ఎఫ్‌సీని అందించలేదు.

కెమెరా

  • Realme 12 Pro లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
  • Redmi Note 13 Pro లో 200ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ

  • Realme 12 Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • Redmi Note 13 Pro లో 5,100ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఏది కొనాలి?

  • Realme 12 Pro లో సోని కెమెరా లెన్సెస్, టెలీఫోటో లెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు Redmi Note 13 Pro విషయానికి వస్తే, 200ఎంపి మెయిన్ కెమెరా, 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే ఆకట్టుకుంటున్నాయి.
  • వినియోగదారులు తమ అభిరుచికి తగిన ఫోన్‌ని అన్ని స్పెసిఫికేషన్స్ ని బాగా పోల్చి చూసి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

The post Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-india-sale-today/ Wed, 10 Jan 2024 16:06:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9660 Redmi Note 13 సిరీస్ కొన్ని రోజుల క్రితం భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు స్టైలిష్ లుక్స్ మరియు చక్కటి ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క సేల్ సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్ లో Redmi Note 13 సిరీస్ […]

The post Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి Redmi Note 13 సిరీస్ సేల్
  • జనవరి 4న లాంచైన Note 13 సిరీస్
  • ఫ్లిప్‌కార్ట్, ఎంఐ స్టోర్స్ ద్వారా అమ్మకాలు

Redmi Note 13 సిరీస్ కొన్ని రోజుల క్రితం భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు స్టైలిష్ లుక్స్ మరియు చక్కటి ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క సేల్ సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్ లో Redmi Note 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఓసారి ధర, సేల్, ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ సేల్ వివరాలు

Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro Plus 5G డివైజెస్ జనవరి 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంఐ ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 5G సిరీస్ ధరలు

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Redmi Note 13 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.
  • కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro Plus https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-note-13-pro-plus-launched-india-with-200mp-camera-12gb-ram/ Thu, 04 Jan 2024 10:45:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=9560 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఇక, ఈ లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi Note 13 Pro మరియు Redmi Note […]

The post 200MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Redmi Note 13 సిరీస్
  • 120W ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చిన Redmi Note 13 Pro Plus
  • 67W ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేయనున్న Note 13 Pro

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఇక, ఈ లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus గురించి తెలుసుకుందాం. Redmi Note 13 5G వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇకపోతే, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus డివైజెస్ 200ఎంపి మెయిన్ కెమెరా, 12జిబి ర్యామ్, డాల్బీ అట్మాస్, హెచ్డీఆర్10+ వంటి ఫీచర్లతో వచ్చాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus ధరలు

  • Redmi Note 13 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధరను రూ.29,999 గా పెట్టారు.
  • Redmi Note 13 Pro డివైజ్ జనవరి 10 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
  • Redmi Note 13 Pro డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమి పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Redmi Note 13 Pro ఫోన్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్ ఆఫర్ ని కంపెనీ అందిస్తోంది.
  • Redmi Note 13 Pro Plus 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.31,999 గా నిర్ణయించారు.
  • Redmi Note 13 Pro Plus 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.33,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro Plus 12జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro Plus డివైజ్ జనవరి 10 వ తేదీ నుంచి సేల్ కి వస్తోంది.
  • Redmi Note 13 Pro Plus స్మార్ట్‌ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమి పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Redmi Note 13 Pro Plus కొనుగోలుపై షావోమి కంపెనీ రూ.2,000 బ్యాంక్ ఆఫర్ ఇస్తోంది. ఇంకా అదనంగా రూ.2,500 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 200MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro Plus first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, స్టోరేజీ వేరియంట్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-box-price-storage-variants-leaked-before-launch/ Mon, 01 Jan 2024 18:04:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9508 Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల కోసం రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచైన ఈ సిరీస్ జనవరి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, వేరియంట్స్ సమాచారం బయటకు వచ్చాయి. బాక్స్ ధరను లియాండర్ అనే X యూజర్ షేర్ చేశారు. బాక్స్ ద్వారా […]

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, స్టోరేజీ వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 5G సిరీస్
  • తాజాగా లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర
  • రివీలైన Redmi Note 13 5G సిరీస్ వేరియంట్స్

Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల కోసం రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచైన ఈ సిరీస్ జనవరి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, వేరియంట్స్ సమాచారం బయటకు వచ్చాయి. బాక్స్ ధరను లియాండర్ అనే X యూజర్ షేర్ చేశారు. బాక్స్ ద్వారా ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ ధర, స్టోరేజీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ (అంచనా)

  • లేటెస్ట్ లీక్ ప్రకారం, Redmi Note 13 5G సిరీస్ లోని స్టాండర్డ్ వేరియంట్ ప్రిజమ్ గోల్డ్, ఆర్క్‌టిక్ వైట్ మరియు స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంటుంది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ కోరల్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఆర్క్‌టిక్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంటుందని సమాచారం.
  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.
  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ బ్లాక్ మరియు ఫ్యూజన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ డెప్త్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, స్టోరేజీ వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Redmi Note 13 Pro 5G; జనవరి 4న లాంచ్ అవుతోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-5g-spotted-geekbench-launching-on-january-4th/ Sat, 23 Dec 2023 11:43:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=9416 Xiaomi సబ్-బ్రాండ్ Redmi జనవరి 4వ తేదీన Note 13 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G. తాజాగా Redmi Note 13 Pro 5G డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యిందని MySmartPrice తన కథనంలో తెలిపింది. ఇక గీక్‌బెంచ్ లిస్టింగ్ […]

The post Geekbench పై లిస్టైన Redmi Note 13 Pro 5G; జనవరి 4న లాంచ్ అవుతోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 4 న లాంచ్ కానున్న Redmi Note 13 సిరీస్
  • తాజాగా గీక్‌బెంచ్ పై లిస్టైన Redmi Note 13 Pro 5G
  • Snapdragon 7s Gen 2 చిప్‌తో వస్తోన్న Note 13 Pro 5G

Xiaomi సబ్-బ్రాండ్ Redmi జనవరి 4వ తేదీన Note 13 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G. తాజాగా Redmi Note 13 Pro 5G డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యిందని MySmartPrice తన కథనంలో తెలిపింది. ఇక గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా Redmi Note 13 Pro 5G కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

గీక్‌బెంచ్ పై కనిపించిన Redmi Note 13 Pro 5G

  • Redmi Note 13 Pro 5G ఇండియన్ వేరియంట్ గీక్‌బెంచ్ పై 2312DRA50I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1030 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2851 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్ తో రానున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

Redmi Note 13 Pro 5G స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Geekbench పై లిస్టైన Redmi Note 13 Pro 5G; జనవరి 4న లాంచ్ అవుతోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-india-launch-date-officially-revealed/ Wed, 13 Dec 2023 16:44:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9264 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారతీయ వినియోగదారులు ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు, వారికి రెడ్మీ నుంచి శుభవార్త వచ్చింది. Redmi Note 13 5G సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Redmi Note 13 సిరీస్ 200ఎంపి ప్రైమరీ కెమెరాతో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. సరే, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi Note […]

The post Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన
  • జనవరి 4 వ తేదీన Redmi Note 13 సిరీస్ లాంచ్
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న Redmi Note 13 సిరీస్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారతీయ వినియోగదారులు ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు, వారికి రెడ్మీ నుంచి శుభవార్త వచ్చింది. Redmi Note 13 5G సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Redmi Note 13 సిరీస్ 200ఎంపి ప్రైమరీ కెమెరాతో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. సరే, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

2024 జనవరి 4 వ తేదీన Redmi Note 13 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్లను కంపెనీ సూపర్‌నోట్ అని వ్యవహరిస్తోంది. సరే, ఓసారి Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు పిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G డివైజ్ ఐపీ54 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-13-pro-plus-tdra-certification-listing-global-launch-soon/ Sun, 03 Dec 2023 17:28:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=9085 రెడ్మీ నోట్ సిరీస్ కి భారతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. నోట్ సిరీస్ లో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయానని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా Redmi Note 13 Pro సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Redmi Note 13 Pro సిరీస్ […]

The post TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro, Pro+
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజెస్
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన డివైజెస్

రెడ్మీ నోట్ సిరీస్ కి భారతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. నోట్ సిరీస్ లో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయానని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా Redmi Note 13 Pro సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Redmi Note 13 Pro సిరీస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ సర్టిఫికేషన్ వివరాలు

  • Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్మార్ట్‌ఫోన్లు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పొందాయి.
  • Redmi Note 13 Pro డివైజ్ 231DRA50G అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. మరోవైపు, Redmi Note 13 Pro+ ఫోన్ 23090RA98G అనే మోడల్ నంబర్ తో టీడీఆర్ఏ సైట్ లో లిస్ట్ అయ్యింది.
  • ఈ మోడల్ నంబర్స్ లో కనిపిస్తోన్న G అక్షరం గ్లోబల్ మోడల్ అని తెలియజేస్తుంది. అంటే ఈ రెండు ఫోన్లు కూడా గ్లోబల్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
NBTC సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Redmi Note 13 Pro 5G; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-5g-spotted-nbtc-certification-site-global-launch-soon/ Tue, 21 Nov 2023 13:57:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=8926 షావోమి సబ్-బ్రాండ్ Redmi తన స్వదేశం చైనాలో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు రెడ్మీ సంస్థ ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi Note 13 Pro డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ […]

The post NBTC సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Redmi Note 13 Pro 5G; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • తాజాగా ఎన్బీటీసీ పై లిస్టైన Redmi Note 13 Pro
  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi Note 13 Pro

షావోమి సబ్-బ్రాండ్ Redmi తన స్వదేశం చైనాలో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు రెడ్మీ సంస్థ ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi Note 13 Pro డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ ఎంట్రీ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి Redmi Note 13 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro NBTC లిస్టింగ్

  • Redmi Note 13 Pro థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్ లో 23117RA68G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ ఇమేజ్ లో Redmi Note 13 Pro పేరుని గమనించవచ్చు.
  • Redmi Note 13 Pro డివైజ్ 4జీ టెక్నాలజీతో కనిపిస్తోంది. అయితే భారత్ తో పాటు ఇతర దేశాల్లో Redmi Note 13 Pro 4జీ మరియు 5జీ వర్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
  • మోడల్ నంబర్ తప్పితే, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.
  • మరింత సమాచారం కోసం రెడ్మీ నుంచి వచ్చే ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.