Redmi - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 06 Aug 2022 09:08:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ కి రెడీగా ఉన్న Redmi K50 Extreme https://www.91mobiles.com/telugu/redmi-confirms-redmi-k50-extreme-edition-launch-this-month/ Sat, 06 Aug 2022 09:08:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=1517 హైలైట్స్: ఈ నెలలో రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసిన షావోమీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత షావోమీ 12టీ ప్రో రూపంలో భారత్ మరియు ప్రపంచ దేశాలకు వెళ్ళనున్న రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ కలిగిన రెడ్మీ కే50 ఫోన్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు ఇంటర్నెట్ లో వార్తలు వస్తున్నాయి. రెడ్మీ […]

The post లాంచ్ కి రెడీగా ఉన్న Redmi K50 Extreme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఈ నెలలో రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసిన షావోమీ
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత
  • షావోమీ 12టీ ప్రో రూపంలో భారత్ మరియు ప్రపంచ దేశాలకు వెళ్ళనున్న రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ కలిగిన రెడ్మీ కే50 ఫోన్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు ఇంటర్నెట్ లో వార్తలు వస్తున్నాయి. రెడ్మీ కే50 అల్ట్రా లేదా రెడ్మీ కే50ఎస్ ప్రో అనే పేర్లతో ఈ ఫోన్ రానుందని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా రెడ్మీ సంస్థ తన వీబో పోస్ట్ ద్వారా ఫోన్ గురించి స్పష్టతనిచ్చింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లాంచ్ కాబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

అయితే, షావోమీ ఈ ఫోన్ ని రెడ్మీ కే50 అల్ట్రా అని మార్కెట్ చేసే అవకాశముంది. రెడ్మీ కే30 అల్ట్రాని రెడ్మీ కే30ఎస్ ఎక్స్‌ట్రిమ్ అని మార్కెట్ చేసింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశముంది. షావోమీ 12టీ ప్రో అనే పేరుతో రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ భారత్ తో పాటు, ఇతర దేశాల్లో లాంచ్ కానున్నట్లు సమాచారం.

గతంలో ఈ హ్యాండ్సెట్ 3సీ సర్టిఫికేషన్ పై కనిపించింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ గ్లోబల్ మార్కెట్ లో షావోమీ 12టీ ప్రో గా రానున్నట్లు ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. ఈ సర్టిఫికేషన్ ని బట్టి, రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 67/120 వాట్ ర్యాపిడ్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇక కెమెరాపై కూడా ఒక ఆసక్తికర రూమర్ బయటకు వచ్చింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ లో 200 మెగాపిక్సెల్ హెచ్‌పీ1 ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఇకపోతే బేసిక్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉండనుంది.

రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ యొక్క ప్రాసెసర్ వివరాలను వెల్లడించిన రెడ్మీ, ఈ నెలలో లాంచ్ ఉండనున్నట్లు తెలిపింది. రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ రిడిజైన్, అప్‌గ్రేడ్ చేయబడిందని, కే50 యూనివర్స్ లో అల్టిమేట్ మాస్టర్ పీస్ గా నిలుస్తుందని కంపెనీ తెలిపింది.

ఇప్పటి వరకు రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. కానీ, రానున్న రోజుల్లో ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. తొలుత రెడ్మీ కే50ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ చైనాలాలో అమ్ముడవ్వనుంది. తర్వాత, గ్లోబల్ మార్కెట్స్ లో షావోమీ 12టీ ప్రో అనే పేరుతో ఎంట్రీ ఇస్తుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో పాటు ఈ ఫోన్లో 200ఎంపి కెమెరాని కూడా జతచేరిస్తే, పేరుకి తగినట్లే ఎక్స్‌ట్రిమ్ ఫోన్ అనిపించుకుంటుంది.

The post లాంచ్ కి రెడీగా ఉన్న Redmi K50 Extreme first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన చౌకైన Redmi ఫోన్.. ధర, ఫీచర్లు ఇవిగో..!! https://www.91mobiles.com/telugu/redmi-10a-sport-launched-in-india-price-specs/ Thu, 28 Jul 2022 06:14:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1315 హైలైట్స్: భారత్ లో రెడ్ మీ 10ఏ స్పోర్ట్ ని లాంచ్ చేసిన రెడ్ మీ షావోమీ వెబ్ సైట్ లో కనిపించిన రెడ్ మీ 10ఏ స్పోర్ట్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. షావోమీ అఫీషియల్ గా ఫోన్ ని లాంచ్ చేయలేదు. కానీ, కంపెనీ యొక్క వెబ్ సైట్ లో ఈ […]

The post భారత్ లో లాంచ్ అయిన చౌకైన Redmi ఫోన్.. ధర, ఫీచర్లు ఇవిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో రెడ్ మీ 10ఏ స్పోర్ట్ ని లాంచ్ చేసిన రెడ్ మీ
  • షావోమీ వెబ్ సైట్ లో కనిపించిన రెడ్ మీ 10ఏ స్పోర్ట్
  • 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. షావోమీ అఫీషియల్ గా ఫోన్ ని లాంచ్ చేయలేదు. కానీ, కంపెనీ యొక్క వెబ్ సైట్ లో ఈ ఫోన్ దర్శనమిచ్చింది. గతేడాది లాంచ్ అయిన రెడ్ మీ 10ఏ వర్షన్ కి ఈ ఫోన్ అప్ గ్రేడ్ వర్షన్. రెడ్ మీ 10ఏ తో పోల్చితే, స్పోర్ట్ ఎడిషన్ లో ర్యామ్ మరియు స్టోరేజీని పెంచారు. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ అయిన రెడ్ మీ 10ఏ స్పోర్ట్, రెడ్ మీ 9ఏ స్పోర్ట్ కి సక్సెసర్. ఇక రెడ్ మీ 10ఏ స్పోర్ట్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, లాంగ్ డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, స్ట్రాంగ్ బ్యాటరీ ఉన్నాయి. రెడ్ మీ 10ఏ కి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Redmi 10A Sport ధర, సేల్

రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ మరియు 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. చార్కోల్ బ్లాక్, స్టేట్ గ్రే, సీ బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. భారత్ లో రెడ్ మీ 10ఏ స్పోర్ట్ ధర రూ.10,999. రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ ని షావోమీ ఇండియా వెబ్ సైట్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi 10A Sport లాంచ్ ఆఫర్

షావోమీ ఇండియా వెబ్ సైట్ ద్వారా రెడ్ మీ 10ఏ స్పోర్ట్ ని కొనుగోలు చేస్తే, రూ.750 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. MBK750 కూపన్ కోడ్ ఉపయోగించి, మొబిక్విక్ వాలెట్ ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెడ్ మీ 10ఏ స్పోర్ట్ పై 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.దీంతో పాటు సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై 10శాతం (రూ.750 వరకు ) డిస్కౌంట్ పొందవచ్చు.

Redmi 10A Sport స్పెసిఫికేషన్స్

  • 6.53 అంగుళాల ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే
  • 13ఎంపి రియర్ కెమెరా
  • 5ఎంపి రియర్ కెమెరా
  • మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్
  • 6జిబి + 128జిబి
  • 5,080ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్

6.53 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 12.5 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం విశేషాలు చూద్దాం. ఈ ఫోన్లో 5 మెగాపిక్సెల్ ప్రంట్ కెమెరాను అందించారు. వెనుకవైపున స్క్వేర్ షేపులో ఉన్న మాడ్యూల్ లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 2జిబి వర్చువల్ ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ సిమ్, 4జీ వోల్టీ, వైఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

The post భారత్ లో లాంచ్ అయిన చౌకైన Redmi ఫోన్.. ధర, ఫీచర్లు ఇవిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi K60 సిరీస్ ఫీచర్లు https://www.91mobiles.com/telugu/redmi-k60-specs-launch-timeline-surfaced-online/ Fri, 22 Jul 2022 07:35:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=1165 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన రెడ్ మీ కే60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ 2కే డిస్ప్లే, 50ఎంపి కెమెరా, మీడియాటెక్/క్వాల్కమ్ ప్రాసెసర్ తో రానున్న రెడ్ మీ కే60 2023 మొదట్లో చైనాలో లాంచ్ కానున్న రెడ్ మీ కే60 సిరీస్ రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, తదుపరి సిరీస్ కు సంబంధించిన వార్తలు ఆన్ లైన్లోకి రావడం మొదలైంది. మరోవైపు రెడ్ మీ కంపెనీ ఆగస్టులో రెడ్ […]

The post లీకైన Redmi K60 సిరీస్ ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన రెడ్ మీ కే60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్
  • 2కే డిస్ప్లే, 50ఎంపి కెమెరా, మీడియాటెక్/క్వాల్కమ్ ప్రాసెసర్ తో రానున్న రెడ్ మీ కే60
  • 2023 మొదట్లో చైనాలో లాంచ్ కానున్న రెడ్ మీ కే60 సిరీస్

రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, తదుపరి సిరీస్ కు సంబంధించిన వార్తలు ఆన్ లైన్లోకి రావడం మొదలైంది. మరోవైపు రెడ్ మీ కంపెనీ ఆగస్టులో రెడ్ కే50ఎస్ సిరీస్ ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈలోపు రెడ్ మీ కే60 సిరీస్ యొక్క టైమ్ లైన్ ఇదేనంటూ వార్త బయటకు వచ్చింది. తన వీబో పోస్ట్ లో నమ్మదగిన టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రెడ్ మీ కే60 సిరీస్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఫోన్ చైనాలో ఎప్పుడు లాంచ్ కానుందనే విషయాన్ని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. గతంలో డిజిటల్ చాట్ స్టేషన్ లాంచ్ చేసిన ఎన్నో లీక్స్ నిజమయ్యాయి. కానీ, రెడ్ మీ కే60 సిరీస్ కు సంబంధించిన లీక్ పై సందేహాలు నెలకొన్నాయి.

Redmi K60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, రెడ్ మీ కే60 సిరీస్ 2023 ప్రథమార్థంలో చైనాలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే, రెడ్ మీ కే60 సిరీస్ డ్యూయల్ ప్లాట్ఫామ్ స్ట్రేటజీతో వస్తోంది. అలాగే చిప్సెట్స్ కూడా టీఎస్ఎంసీ యొక్క 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారవ్వనున్నాయి. దీన్ని బట్టి మనం, మీడియాటెక్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్స్ ని కలిగి రెడ్ మీ కే60 సిరీస్ హ్యాండ్సెట్స్ ని చూడనున్నాం. ఇవి టీఎస్ఎంసీ యొక్క 4ఎన్ఎం ప్రాసెస్ ను వాడుకుంటున్నవి కాబట్టి, రెడ్ మీ కే60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్స్ ఉండే అవకాశముంది.

ఇక ఫోటోగ్రఫీ కోసం రెడ్ మీ కే60 సిరీస్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఉండనున్నట్లు సమాచారం. ఇక ఐటీహోమ్ కథనం ప్రకారం, ఈ 50ఎంపి సెన్సర్ సోనీ ఐఎంఎక్స్766 కి మోడిఫైడ్ వర్షన్ అని తెలుస్తోంది. రెడ్ మీ కే60 సిరీస్ లో 2కే డిస్ప్లే, ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఇక భద్రత కొరకు ఈ ఫోన్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని అంచనా.

ఇప్పటి వరకు మనం రెడ్ మీ యొక్క రాబోయే కే60 సిరీస్ గురించి తెలుసుకున్నాం. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం తెలుసుకునే అవకాశముంది.అలాగే కంపెనీ నుంచి కూడా ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు ఇటీవలే భారత్ లో లాంచ్ అయిన రెడ్ మీ కే50ఐ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

The post లీకైన Redmi K60 సిరీస్ ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi K50S, Redmi K50S Pro ఫోన్లను అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/redmi-k50s-redmi-k50s-pro-officially-teased-by-the-company/ Thu, 21 Jul 2022 12:40:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=1147 హైలైట్స్: రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రో ఫోన్లను టీజ్ చేసిన రెడ్ మీ కంపెనీ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్న కే50ఎస్, కే50ఎస్ ప్రో షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో రూపంలో గ్లోబల్ గా లాంచ్ కానున్న కే50ఎస్, కే50ఎస్ ప్రో గత ఫిబ్రవరి లో రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ సిరీస్ రెడ్ మీ కే50, రెడ్ మీ […]

The post Redmi K50S, Redmi K50S Pro ఫోన్లను అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రో ఫోన్లను టీజ్ చేసిన రెడ్ మీ కంపెనీ
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్న కే50ఎస్, కే50ఎస్ ప్రో
  • షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో రూపంలో గ్లోబల్ గా లాంచ్ కానున్న కే50ఎస్, కే50ఎస్ ప్రో

గత ఫిబ్రవరి లో రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ సిరీస్ రెడ్ మీ కే50, రెడ్ మీ కే50 ప్రో అనే రెండు మోడల్స్ కు విస్తరించింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత, కంపెనీ జనరల్ మేనేజర్, లూ వీబింగ్ చైనా సామాజిక మాధ్యమం విబో ద్వారా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేశాడు. ఇది రెడ్ మీ కే50ఎస్ సిరీస్ అని మేం అంచనా వేస్తున్నాం. ఈ సిరీస్ లో రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రొ భాగమవ్వనున్నాయి. రెడ్ మీ ఫ్లాగ్ షిప్ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ను కలిగి ఉండనుందని లూ వీబింగ్ తెలిపాడు.

అయితే లూ వీబింగ్ లాంచ్ సమయాన్ని చెప్పలేదు. ఆగస్టు నెలలో చైనాలో లాంచ్ చేసి, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లో విడుదల చేస్తారని మేం విశ్వసిస్తున్నాం.

అఫీషియల్ గా టీజ్ చేయబడిన Redmi K50S లాంచ్

రెడ్ మీ జనరల్ మేనేజర్ లూ వీబింగ్ అఫీషియల్ గా రెడ్ మీ కే-సిరీస్ ఫోన్స్ ని సామాజిక మాధ్యమం వీబో లో టీజ్ చేశాడు. అయితే అతడు ఫోన్ పేరేంటో తెలపలేదు. రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రో అని మేం అంచనా వేస్తున్నాం. కే50ఎస్ ప్రో 3సీ సర్టిఫికేషన్ డేటాబేస్ పై 22081212సీ అనే మోడల్ నంబర్ తో దర్శనమిచ్చింది. లిస్టింగ్ ని బట్టి, ఈ డివైజ్ 120 వాట్ హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని అర్థమవుతోంది. అలాగే ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం.

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా కంటే ముందు లాంచ్ అయితే కనుక, 200ఎంపి కెమెరా సెటప్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ గా రెడ్ మీ కే50ఎస్ ప్రొ నిలవనుంది. అలాగే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 256జిబి స్టోరేజీ, 5జీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. రెడ్ మీ కే50ఎస్ ‘diting’ అనే కోడ్ నేమ్ ని కలిగి ఉందని గతంలో షావోమీయూఐ అనే వెబ్ సైట్ తెలిపింది. ఇక కే50ఎస్ కోడ్ నంబర్ 22071212ఏసీ అని ఉంది. ఇక రెడ్ మీ కే50ఎస్ ప్రో ‘Plato’ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇక రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రొ ఫోన్స్.. షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో అనే మోడల్స్ గా గ్లోబల్ మార్కెట్స్ లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడే దీనిపై కచ్చితంగా ఏమీ చెప్పలేం.

The post Redmi K50S, Redmi K50S Pro ఫోన్లను అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Redmi K50i https://www.91mobiles.com/telugu/redmi-k50i-5g-launched-in-india-specs-price-details/ Wed, 20 Jul 2022 11:22:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1103 హైలైట్స్: భారత్ లో రెడ్ మీ కే50ఐ ప్రారంభ ధర రూ.25,999 జులై 23 నుంచి అమెజాన్, ఎంఐ వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ అమ్మకాలు ప్రారంభం 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు మూడేళ్ల తర్వాత, ఫ్యాన్-ఫేవరెట్ రెడ్ మీ కే-సిరీస్ కే50ఐ 5జీ ఫోన్ తో భారత గడ్డపై అడుగు పెట్టింది. దీంతో కే-సిరీస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. […]

The post భారత్ లో లాంచ్ అయిన Redmi K50i first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో రెడ్ మీ కే50ఐ ప్రారంభ ధర రూ.25,999
  • జులై 23 నుంచి అమెజాన్, ఎంఐ వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ అమ్మకాలు ప్రారంభం
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

మూడేళ్ల తర్వాత, ఫ్యాన్-ఫేవరెట్ రెడ్ మీ కే-సిరీస్ కే50ఐ 5జీ ఫోన్ తో భారత గడ్డపై అడుగు పెట్టింది. దీంతో కే-సిరీస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. భారత్ లో ఇది కొత్త కే-సిరీస్ ఫోన్ అయినప్పటికీ, హ్యాండ్సెట్ తీరు తెన్నులు మాత్రం మే నెల్లో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ నోట్ 11టీ ప్రో మాదిరి కనిపిస్తున్నాయి. ఇకపోతే ఫోన్ వెనుకాల ట్రిపుల్ కెమెరా సెటప్, స్లిమ్ బెజెల్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. అయితే, 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేసే తొలి రెడ్ మీ డివైజ్ కే50ఐ.

మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ ను కలిగిన రెడ్ మీ కే50ఐ ఫోన్ అన్ టు టు బెంచ్ మార్క్ టెస్ట్ లో ఐఫోన్ 13 ని దాటేసింది. ఆసక్తిగల కస్టమర్స్ రెడ్ మీ కే50ఐ ఫోన్ ని జులై 23 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. కాగా, రెడ్ మీ కే50ఐ ఫోన్ మూడు రంగులు, రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.

భారత్ లో Redmi K50i ధర

వేరియంట్ ని బట్టి రెడ్ మీ కే50ఐ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 6జిబి ర్యామ్+128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.25,999, 8జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999. ఫాంటమ్ బ్లూ, స్టెల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. జులై 23 నుంచి ఎంఐ వెబ్ సైట్ తో పాటు అమెజాన్ ద్వారా రెడ్ మీ కే50ఐ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారు 10శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఆఫర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా వర్తిస్తుంది.

Redmi K50i స్పెసిఫికేషన్స్

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెడ్ మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ ని పోలి ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం లేదు.

6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. బలమైన మన్నిక కొరకు, రెడ్ మీ కే50ఐ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కు భద్రత కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక ఫోటొగ్రఫీ కోసం రెడ్ మీ కే50ఐ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మాక్రో సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరా ఉంది.

3.5ఎంఎం హెడ్ ఫోన్ జ్యాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో 5080ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post భారత్ లో లాంచ్ అయిన Redmi K50i first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ యాడ్ ద్వారా లీకైన Redmi K50i ధర https://www.91mobiles.com/telugu/redmi-k50i-launched-in-india-price-sale-date-offers-leaked-via-amazon-ad/ Wed, 20 Jul 2022 07:57:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=1095 హైలైట్స్: లాంచ్ కి ముందు లీకైన రెడ్ మీ కే50ఐ ధర, సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్ జులై 23 నుంచి భారత్ లో సేల్ ప్రారంభం, ఫోన్ ధర రూ.25,999 144హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు రెడ్ మీ కే50ఐ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ రోజు లాంచ్ కంటే ముందే భారత్ లో ఈ ఫోన్ ధర […]

The post అమెజాన్ యాడ్ ద్వారా లీకైన Redmi K50i ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన రెడ్ మీ కే50ఐ ధర, సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్
  • జులై 23 నుంచి భారత్ లో సేల్ ప్రారంభం, ఫోన్ ధర రూ.25,999
  • 144హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

రెడ్ మీ కే50ఐ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ రోజు లాంచ్ కంటే ముందే భారత్ లో ఈ ఫోన్ ధర ఇన్ స్టాగ్రామ్ లో అమెజాన్ యాడ్ ద్వారా బయటకు వచ్చేసింది. కానీ, ఆ టీజర్ ద్వారా ఇంకా సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్ కూడా బయటకు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ లో రెడ్ మీ కే సిరీస్ ఫోన్ కూడా భాగమవుతోంది.

మూడేళ్ళ తర్వాత ఫ్యాన్-ఫేవరెట్ రెడ్ మీ కే సిరీస్ ను మళ్ళీ రెడ్ మీ కంపెనీ భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రెడ్మీ నోట్ 11టీ ప్రో పేరుతో చైనాలో మే నెలలో లాంచ్ అయిన ఫోన్ కి కే50ఐ రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని చెప్పవచ్చు. మరి దీని ఫీచర్లు, ధర, సేల్ తేదీ, బ్యాంక్ ఆఫర్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో Redmi K50i ధర, సేల్ డేట్, బ్యాంక్స్ ఆఫర్

 

టిప్ స్టార్ అభిషేక్ యాదవ్ షేర్ చేసిన ఇమేజ్ ని బట్టి, రెడ్ మీ కే50ఐ అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ లో భాగం కానుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ధర రూ.25,999. కాగా, రెడ్ మీ కే50ఐ జులై 23 నుంచి భారత్ లో అమ్ముడవ్వనుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా వర్తిస్తుంది.

ఇప్పుడు రెడ్ మీ కే50ఐ 5జీ స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం. ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 64ఎంపి+8ఎంపి+2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు రెడ్ మీ కే50ఐ లో ఉన్నాయి.

రెడ్ మీ కే50ఐ 5జీ ని కొనేవారికి సూచనలేంటంటే, ఈ ఫోన్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఆ ఒక్క విషయం మినహా, అద్భుతమైన చిప్సెట్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, చక్కటి కెమెరా, లేటెస్ట్ ఓఎస్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి సూపర్ ఫీచర్లతో ఈ ఫోన్ నిండి ఉంది. కాబట్టి, కొనుగోలుదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే బెటర్. అమెజాన్ ద్వారా జులై 23 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

The post అమెజాన్ యాడ్ ద్వారా లీకైన Redmi K50i ధర first appeared on 91Mobiles Telugu.

]]>