Rs 49 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 22 Mar 2024 06:16:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio: రూ.49 రీచార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసిన జియో https://www.91mobiles.com/telugu/jio-introduces-rs-49-recharge-plan/ Fri, 22 Mar 2024 06:16:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=10772 ప్రముఖ టెలీకామ్ సంస్థ Jio హోలీ పండుగ కానుకగా తన వినియోగదారుల కోసం ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.49 విలువగల ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లకు డేటా ప్రయోజనం లభించనుంది. ఈ ప్లాన్ క్రికెట్ ప్లాన్ కేటగిరీలో లిస్ట్ అయి ఉంది. ఐపీఎల్ 2024 సమీపిస్తుండటంతో జియో కంపెనీ తాజాగా ఈ ప్లాన్‌ని తీసుకొచ్చిందని భావిస్తున్నారు. సరే, ఓసారి రూ.49 రీచార్జ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి. Jio రూ.49 […]

The post Jio: రూ.49 రీచార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసిన జియో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.49 ప్లాన్ లాంచ్
  • 25జిబి డేటా ప్రయోజనం
  • ఒక్క రోజు వ్యాలిడిటీ

ప్రముఖ టెలీకామ్ సంస్థ Jio హోలీ పండుగ కానుకగా తన వినియోగదారుల కోసం ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.49 విలువగల ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లకు డేటా ప్రయోజనం లభించనుంది. ఈ ప్లాన్ క్రికెట్ ప్లాన్ కేటగిరీలో లిస్ట్ అయి ఉంది. ఐపీఎల్ 2024 సమీపిస్తుండటంతో జియో కంపెనీ తాజాగా ఈ ప్లాన్‌ని తీసుకొచ్చిందని భావిస్తున్నారు. సరే, ఓసారి రూ.49 రీచార్జ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.49 డేటా ప్యాక్ ప్రయోజనాలు

జియో లాంచ్ చేసిన రూ.49 డేటా ప్యాక్‌ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 1 రోజు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది. అది 2జిబి లేదా 3జిబి డేటా కాదు, ఏకంగా 25జిబి డేటా బెనిఫిట్ లభిస్తుంది. అయితే కేవలం ఒక్క రోజుల వ్యాలిడిటీ మాత్రమేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఈ 25జిబి డేటా ప్రయోజనం ద్వారా యూజర్లు ఐపీఎల్ 2024 మ్యాచులను జియోసినిమా యాప్ పై ఆన్‌లైన్ ద్వారా చూడవచ్చు. క్రికెట్ ఆఫర్ లో భాగంగానే ప్రత్యేకంగా ఈ ప్లాన్ ని పరిచయం చేశారు. అయితే, వ్యాలిడిటీ కేవలం 1 రోజు కావడం కాస్త నిరాశపరిచే విషయం. 25జిబి డేటాను యూజర్ ఒక్క రోజులోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజుకి డేటా బదిలీ చేయబడదు.

యూజర్ గనుక 25జిబి డేటాను ఒక రోజు లోపే పూర్తి చేసినప్పటికీ, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ మాత్రమే లభిస్తుంది.

ఐపీఎల్ 2024 చూసేందుకు ఉత్తమమైన ప్లాన్ ఇదే

మీరు గనుక ఐపీఎల్ 2024 మ్యాచులను మీ మొబైల్ పై లైవ్ ద్వారా చూడాలనుకుంటే, మీకు చాలా డేటా కావాల్సి ఉంటుంది. అందుకై మీరు రూ.49 డేటా ప్యాక్ రీచార్జ్ చేయిస్తే, 25జిబి డేటా ప్రయోజనం లభిస్తుంది. దీంతో మీరు ఐపీఎల్ మ్యాచులను హ్యాపీగా చూసేయవచ్చు.

Airtel రూ.49 ప్లాన్ ప్రయోజనాలు

జియో తాజాగా తీసుకొచ్చినటువంటి డేటా ప్యాక్ మాదిరే ఎయిర్టెల్ లో కూడా ఒక ప్లాన్ ఉంది. ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.49 డేటా ప్యాక్ ద్వారా యూజర్ కి 1 రోజు వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 20జిబి అపరిమిత డేటా లభిస్తుంది. డేటాను పూర్తిగా వాడేసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే చాలా తక్కువ వేగంతో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు.

The post Jio: రూ.49 రీచార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసిన జియో first appeared on 91Mobiles Telugu.

]]>
రెండు చవకైన ప్లాన్స్‌ని పరిచయం చేసిన Vodafone Idea https://www.91mobiles.com/telugu/vodafone-idea-launched-rs-24-rs-49-prepaid-plans/ Wed, 05 Jul 2023 09:43:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=7077 వొడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లను ఊరించేందుకు రకరకాల రీచార్జ్ ప్లాన్స్ ని పరిచయం చేస్తోంది. తాజాగా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు టాప్-అప్ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. రూ.24, రూ.49 విలువగల ఈ ప్లాన్స్ ద్వారా యూజర్లకు అదనపు లాభాలు కూడా ఉన్నాయి. అపరిమిత నైట్ డేటా ప్రయోజనం ఈ రెండు ప్లాన్స్ ద్వారా లభిస్తుంది. సరే, ఓసారి వొడాఫోన్ ఐడియా సంస్థ తీసుకొచ్చిన ఈ రెండు ప్లాన్స్ యొక్క వివరాలు, ప్రయోజనాలు ఎలా ఉన్నాయో […]

The post రెండు చవకైన ప్లాన్స్‌ని పరిచయం చేసిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.24, రూ.49 విలువగల ప్లాన్స్ లాంచ్ చేసిన Vodafone Idea
  • రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న డేటా ప్రయోజనం
  • రూ.24 ప్లాన్ ద్వారా గంటపాటు లభించనున్న అపరిమిత డేటా

వొడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లను ఊరించేందుకు రకరకాల రీచార్జ్ ప్లాన్స్ ని పరిచయం చేస్తోంది. తాజాగా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు టాప్-అప్ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. రూ.24, రూ.49 విలువగల ఈ ప్లాన్స్ ద్వారా యూజర్లకు అదనపు లాభాలు కూడా ఉన్నాయి. అపరిమిత నైట్ డేటా ప్రయోజనం ఈ రెండు ప్లాన్స్ ద్వారా లభిస్తుంది. సరే, ఓసారి వొడాఫోన్ ఐడియా సంస్థ తీసుకొచ్చిన ఈ రెండు ప్లాన్స్ యొక్క వివరాలు, ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vodafone Idea రూ.24 ప్లాన్

Vodafone Idea తీసుకొచ్చిన రూ.24 ప్లాన్ ద్వారా యూజర్ కి ఒక గంట పాటు అపరిమిత డేటా లభిస్తుంది. అయితే, ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ అనేది లభించదు. ఇంకా, యూజర్లకు వీఐ మూవీస్, టీవీ యాప్స్ కి యాక్సెస్ లభించదు. మీ నంబర్ యాక్టివ్ గా వేరే రెగ్యులర్ ప్లాన్ లో ఉన్నట్లయితే ఈ రూ.24 ప్లాన్ వల్లన ప్రయోజనం ఉంటుంది.

Vodafone Idea రూ.49 ప్లాన్

రూ.49 ప్లాన్ ద్వారా యూజర్లకు 6జిబి డేటా లభిస్తుంది. అంతేకాదు, ఇంకా 24 గంటల వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా సర్వీస్ వ్యాలిడిటీ ఏమీ లభించదు. ఈ విషయాన్ని యూజర్లు గమనించాలి.

Note: ఈ ప్లాన్స్ ని వొడాఫోన్ ఐడియా సంస్థ యూజర్ల ఎమర్జెన్సీ అవసరాల కోసం మాత్రమే తీసుకొచ్చిందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

బీహార్ లో VoWi-Fi సర్వీస్

వొడాఫోన్ ఐడియా సంస్థ బీహార్ లో సోమవారం నాడు తన కొత్త సేవలను లాంచ్ చేసింది. VoWi-Fi అనే పేరుతో ఈ సర్వీస్ లాంచ్ అయ్యింది. వీఐ కంపెనీకి బీహార్ 15 వ సర్కిల్. ఇప్పటికే బీహార్ లో ఎయిర్టెల్, జియో సంస్థలు ఈ తరహా సేవలను ప్రారంభించాయి.

The post రెండు చవకైన ప్లాన్స్‌ని పరిచయం చేసిన Vodafone Idea first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.49 డేటా వోచర్‌ని లాంచ్ చేసిన Airtel; ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/airtel-rs-49-data-voucher-benefits/ Tue, 06 Jun 2023 06:09:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=6634 భారతదేశంలో ఉన్న రెండో అతిపెద్ద టెలీకామ్ సంస్థగా ఎయిర్టెల్ కొనసాగుతోంది. రిలయన్స్ జియోని వెనక్కి నెట్టేందుకు ఎయిర్టెల్ విశ్వప్రయత్నం చేస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే తాజాగా, ఎయిర్టెల్ ఒక చవకైన ప్లాన్ ని లాంచ్ చేసింది. రూ.49 విలువజేసే ఈ డేటా వోచర్ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి. ఎయిర్టెల్ రూ.49 ప్లాన్ ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.49 రీచార్జ్ ప్లాన్ ఒక డేటా వోచర్. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి ఇంటర్నెట్ డేటా ప్రయోజనం లభిస్తుంది. ఈ […]

The post రూ.49 డేటా వోచర్‌ని లాంచ్ చేసిన Airtel; ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.49 డేటా వోచర్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్
  • ప్లాన్ ద్వారా లభించనున్న డేటా ప్రయోజనం
  • డేటా వోచర్ ద్వారా లభించనున్న ఒక రోజు వ్యాలిడిటీ

భారతదేశంలో ఉన్న రెండో అతిపెద్ద టెలీకామ్ సంస్థగా ఎయిర్టెల్ కొనసాగుతోంది. రిలయన్స్ జియోని వెనక్కి నెట్టేందుకు ఎయిర్టెల్ విశ్వప్రయత్నం చేస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే తాజాగా, ఎయిర్టెల్ ఒక చవకైన ప్లాన్ ని లాంచ్ చేసింది. రూ.49 విలువజేసే ఈ డేటా వోచర్ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

ఎయిర్టెల్ రూ.49 ప్లాన్

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.49 రీచార్జ్ ప్లాన్ ఒక డేటా వోచర్. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి ఇంటర్నెట్ డేటా ప్రయోజనం లభిస్తుంది. ఈ డేటా వోచర్ ద్వారా యూజర్ కి కేవలం 1 రోజు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఒక్కసారి రీచార్జ్ చేస్తే 24 గంటల పాటు ఈ వోచర్ చెల్లుబాటు అవుతుంది.

రూ.49 ప్లాన్ ప్రయోజనాలు

  • 6జిబి డేటా
  • 1 రోజు వ్యాలిడిటీ
  • 4జీ స్పీడ్

ఎయిర్టెల్ లాంచ్ చేసిన కొత్త రీచర్జ్ ప్లాన్ అయిన రూ.49 వోచర్ ద్వారా యూజర్ కి ఒక రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే 4జీ స్పీడ్ గల 6జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా రోలోవర్ కాబోదు. అంటే 6జిబి డేటాను వ్యాలిడిటీ లోపే వాడుకోవాలి. లేదంటే మిగిలిన డేటా ప్రయోజనం ఎక్స్‌పైర్ అవుతుంది. ఒకరోజు వ్యాలిడిటీ ముగిసాక ఈ ప్లాన్ కి సంబంధించిన ఏ డేటా కూడా వాడుకోలేరు.

ఈ ఎయిర్టెల్ డేటా వోచర్ ద్వారా ఇంటర్నెట్ ఫెసిలీటీ మాత్రమే లభిస్తుంది. ఎస్ఎంఎస్ లేదా కాలింగ్ ప్రయోజనాలు లభించవు. అలాగే ఈ ప్లాన్ ద్వారా ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ లభించదు. యాక్టివ్ ప్లాన్ లో కొనసాగే కస్టమర్లు ఈ డేటా వోచర్ ని రీచార్జ్ చేసుకోవచ్చు.

Airtel Rs 65 ప్లాన్

ఇటీవలె ఎయిర్టెల్ సంస్థ రూ.65 డేటా వోచర్ ని కూడా పరిచయం చేసింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 4జిబి 4జీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ ద్వారా కాలింగ్ లేదా మెసేజ్ ప్రయోజనాలు లభించవు.

ఎయిర్టెల్ రూ.49 vs రూ.65 ప్లాన్

అదేంటి, ఎయిర్టెల్ తాజాగా తీసుకొచ్చిన రూ.49 ప్లాన్ తో 6జిబి డేటా ప్రయోజనం లభిస్తుండగా, ఖరీదెక్కువైన రూ.65 ప్లాన్ తో 4జిబి డేటా మాత్రమే లభిస్తుందని అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే, రూ.65 ప్లాన్ కి వ్యాలిడిటీ పరిమితి ఏమీ లేదు. యూజర్ యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటయ్యేంత వరకు దీన్ని వాడుకోవచ్చు. అదే రూ.49 ప్లాన్ అయితే కేవలం ఒక రోజు వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది.

The post రూ.49 డేటా వోచర్‌ని లాంచ్ చేసిన Airtel; ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>