Samsung Galaxy A14 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 22 May 2023 08:48:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఎగ్జినోస్ 850 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A14 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-4g-launched-india-price-specs-availability/ Mon, 22 May 2023 08:48:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=6411 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. Samsung Galaxy A14 4G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ ధర రూ.15,000 లోపే ఉంది. రెండు స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ వచ్చింది. ఫ్లాట్ రియర్ ప్యానెల్, కర్వ్డ్ ఫ్రేమ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మిగతా ఏ-సిరీస్ ఫోన్ల మాదిరి డిజైన్ ని […]

The post ఎగ్జినోస్ 850 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A14 4G బేస్ మోడల్ ధర రూ.13,999
  • ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వచ్చిన హ్యాండ్సెట్
  • లైట్ గ్రీన్, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. Samsung Galaxy A14 4G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ ధర రూ.15,000 లోపే ఉంది. రెండు స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ వచ్చింది. ఫ్లాట్ రియర్ ప్యానెల్, కర్వ్డ్ ఫ్రేమ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మిగతా ఏ-సిరీస్ ఫోన్ల మాదిరి డిజైన్ ని కలిగి ఉంది.

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎగ్జినోస్ 850 చిప్సెట్ వాడారు. Samsung Galaxy A14 4G రియర్ ప్యానెల్, ఫ్రేమ్ పాలికార్బొనేట్ మెటీరియల్ తో తయారైంది. ఈ డివైజ్ భారత్ లో మూడు కలర్ ఆప్షన్స్ తో లాంచైంది. సరే, ఓసారి Samsung Galaxy A14 4G ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy A14 4G ధర

  • 4జిబి+64జిబి= రూ.13,999
  • 4జిబి+128జిబి= రూ.14,999

భారత్ లో Samsung Galaxy A14 4G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచైంది. బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధర రూ.13,999 గా ఉంది. ఇక 4జిబి + 128జిబి మోడల్ ధర రూ.14,999 గా ఉంది.

Samsung Galaxy A14 4G డివైజ్ లైట్ గ్రీన్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ స్మార్ట్ ఫోన్ పై శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, మెయిన్ లైన్ చానల్స్ ద్వారా రూ.1,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్ ధర రూ.12,999 కి తగ్గనుంది.

Samsung Galaxy A14 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ
  • 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2408*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • ఎగ్జినోస్ 850 చిప్
  • 4జిబి+128జిబి

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 850 చిప్సెట్ వాడారు. 4జిబి ర్యామ్ + 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000ఎంఏహెచ్

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 13ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ

  • 4జీ
  • 3.5ఎంఎం జాక్

Samsung Galaxy A14 4G డివైజ్ 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ని కలిగి ఉంది. శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ పై 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీనిస్తోంది.

The post ఎగ్జినోస్ 850 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio G80 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A14 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-4g-launched-malaysia-specs-price-availability/ Tue, 28 Feb 2023 05:11:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=5126 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung గత నెలలో భారత మార్కెట్ లో Samsung Galaxy A14 5G ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ Samsung Galaxy A14 4G ఫోన్ ని మలేషియాలో లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయిన Samsung Galaxy A14 4G లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. Samsung Galaxy A14 […]

The post MediaTek Helio G80 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియన్ మార్కెట్ లో లాంచైన Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్
  • 50ఎంపి మెయిన్ కెమెరా, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 6జిబి ర్యామ్ తో వచ్చిన Samsung Galaxy A14 4G
  • బ్లాక్, సిల్వర్, రెడ్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy A14 4G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung గత నెలలో భారత మార్కెట్ లో Samsung Galaxy A14 5G ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ Samsung Galaxy A14 4G ఫోన్ ని మలేషియాలో లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయిన Samsung Galaxy A14 4G లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ లో భారీ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా అందించారు. 13ఎంపి సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A14 4G యొక్క ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A14 4G ధర, లభ్యత

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ మలేషియా వెబ్ సైట్ లో కనిపిస్తోంది. అయితే, కంపెనీ ఇంకా Samsung Galaxy A14 4G యొక్క ధరను రివీల్ చేయాల్సి ఉంది.

Samsung Galaxy A14 4G డివైజ్ భారత మార్కెట్ లభ్యతపై శాంసంగ్ ఇంకా ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పటికే ఈ ఫోన్ BIS సర్టిఫికేషన్ పొందింది. దీంతో రానున్న కొన్ని రోజుల్లో భారత్ లో Samsung Galaxy A14 4G లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Samsung Galaxy A14 4G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Samsung Galaxy A14 4G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. సెల్ఫీ షూటర్ ని వాటర్ డ్రాప్ నాచ్ లో ఇచ్చారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ తో ఈ ఫోన్ వచ్చింది. Samsung Galaxy A14 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Samsung Galaxy A14 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy A14 4G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ 2.0 టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ని ఈ ఫోన్ లో అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.

Samsung Galaxy A14 4G బ్లాక్, సిల్వర్, డార్క్ రెడ్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 167.7 ఎంఎం పొడవు, 78.0 ఎంఎం వెడల్పు, 9.1 ఎంఎం మందం, 201 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G80 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Samsung Galaxy A14 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-4g-battery-specs-5000-mah-15-watt-charging/ Tue, 13 Dec 2022 12:47:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=3963 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ SM-A145R/DSN అనే మోడల్ నంబర్ తో FCC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A14 4G టీయూవీ రెయిన్‌ల్యాండ్ మరియు యూఎల్ డెమ్కో ప్లాట్‌ఫామ్స్ పై కూడా కనిపించిన డివైజ్ SM-A145R/DSN అనే మోడల్ నంబర్ తో Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ FCC సర్టిఫికేషన్ పొందింది. ఈ విషయాన్ని 91మొబైల్స్ గుర్తించింది. ఇదే ప్లాట్ఫామ్ పై Samsung Galaxy […]

The post 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Samsung Galaxy A14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్
  • SM-A145R/DSN అనే మోడల్ నంబర్ తో FCC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A14 4G
  • టీయూవీ రెయిన్‌ల్యాండ్ మరియు యూఎల్ డెమ్కో ప్లాట్‌ఫామ్స్ పై కూడా కనిపించిన డివైజ్

SM-A145R/DSN అనే మోడల్ నంబర్ తో Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ FCC సర్టిఫికేషన్ పొందింది. ఈ విషయాన్ని 91మొబైల్స్ గుర్తించింది. ఇదే ప్లాట్ఫామ్ పై Samsung Galaxy A14 5G డివైజ్ ప్రత్యక్షమైన వారం రోజులకు Samsung Galaxy A14 4G కూడా కనిపించింది. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy A14 4G యొక్క 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, బ్లూటూత్ మరియు డ్యూయల్-బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ గురించి తెలిసింది. Samsung Galaxy A14 4G డివైజ్ ఇంకా రెయిన్ ల్యాండ్ మరియు యూఎల్ డెమ్కో ప్లాట్ఫామ్స్ పై కూడా కనిపించింది.

FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ EP-T1510 అనే మోడల్ నంబర్ కలిగిన చార్జింగ్ అడాప్టర్ ని కలిగి ఉంది. ఇక ఫోన్ యొక్క అసలైన డిజైన్ ఎలా ఉంటుందో ఇంకా తెలియలేదు. ఔట్‌లైన్ ని బట్టి, ఈ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 11.8 మిల్లీ మీటర్ల మందం ఉంటుందని తెలుస్తోంది.

Samsung Galaxy A14 4G బ్యాటరీ స్పెసిఫికేషన్స్

 

టీయూవీ రెయిన్ ల్యాండ్ సర్టిఫికేషన్ ద్వారా Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ 4900 ఎంఏహెచ్ బ్యాటరీ (5000ఎంఏహెచ్ కెపాసిటీ), 15 వాట్ చార్జింగ్ స్పీడ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది మినహా టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా ఇంకా ఏమీ రివీల్ కాలేదు. ఇక యూఎల్ డెమ్కో లిస్టింగ్ లో బ్యాటరీ మోడల్ నంబర్ HQ-50SD అని ఉంది. ఈ రెండు ప్లాట్ఫామ్స్ ద్వారా రివీల్ అయిన వివరాలు ఇంతే. కానీ, రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

4జీ వేరియంట్‌తో పాటు, శాంసంగ్ కంపెనీ 5జీ వేరియంట్ Samsung Galaxy A14 పై కూడా పని చేస్తోంది. రీసెంట్ గా ఈ మోడల్ కంపెనీ యొక్క ఇండియా సపోర్ట్ పేజీలో కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని స్పష్టమైంది. 5జీ వర్షన్ SM-A146B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. 5జీ వర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ శ్రేణి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్న డివైజ్. ఈ ఫోన్ నార్మల్ డెయిలీ యూజర్ అవసరాలను తీర్చేదిగా ఉంటుంది. ఈ ఫోన్ ధర కూడా సామాన్యుడు కొనుగోలు చేసే విధంగా ఉండనుంది. త్వరలోనే ధర, ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Samsung Galaxy A14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో Galaxy A14 4G ఫోన్ ని లాంచ్ చేయనున్న Samsung https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-4g-to-launch-soon-specs-tipped/ Wed, 02 Nov 2022 05:40:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=3189 హైలైట్స్ మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ని తీసుకొస్తోన్న శాంసంగ్ త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13, మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్ తో వస్తోన్న Galaxy A14 4G ఇటీవలె Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం శాంసంగ్ కంపెనీలో ఉన్న చీపెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇదేనని చెప్పవచ్చు. దీని ధర […]

The post త్వరలో Galaxy A14 4G ఫోన్ ని లాంచ్ చేయనున్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ని తీసుకొస్తోన్న శాంసంగ్
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్
  • 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13, మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్ తో వస్తోన్న Galaxy A14 4G

ఇటీవలె Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం శాంసంగ్ కంపెనీలో ఉన్న చీపెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇదేనని చెప్పవచ్చు. దీని ధర రూ.15,000 లోపు ఉండే అవకాశం ఉంది. అయితే తాజాగా Samsung Galaxy A14 4G అనే మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ కూడా శాంసంగ్ లాంచ్ చేయనుందనే వార్త రివీల్ అయ్యింది. బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై ఈ గెలాక్సీ ఫోన్ కనిపించింది. లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసాయి. త్వరలోనే Samsung Galaxy A14 5G మరియు Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్స్ టెక్ మార్కెట్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A14 4G

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. Samsung SM-A145P అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. Samsung Galaxy A14 4G లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇంకా ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్ తో వస్తున్నట్లు కూడా స్పష్టమైంది. ఇది 1.80 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టాకోర్ ప్రాసెసర్.

Samsung Galaxy A14 4G స్మార్ట్ ఫోన్ Geekbench పై 4జిబి ర్యామ్ తో సర్టిఫై అయ్యింది. ఈ డివైజ్ కేవలం 4జిబి ర్యామ్ సింగిల్ వేరియంట్ లోనే లాంచ్ అవుతుంది. అయితే, మరొక వేరియంట్ ని కూడా లాంచ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ శాంసంగ్ ఫోన్ కి మాలి జీ-52 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వినియోగించారు. Samsung Galaxy A14 4G యొక్క బెంచ్ మార్కింగ్ స్కోర్ గురించి మాట్లాడితే, సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1668 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టు లో 5284 పాయింట్లు సాధించింది. త్వరలోనే ఈ ఫోన్ ని శాంసంగ్ టీజ్ చేయడం మొదలుపెట్టే అవకాశం ఉంది.

Samsung Galaxy A14 5G

Samsung Galaxy A14 5G మోడల్ ని గమనిస్తే, నెట్టింట్లో ప్రత్యక్షమైన లీక్స్ ని బట్టి, ఈ మొబైల్ ఫోన్ ధర రూ.15,000 నుంచి రూ.18,000 తో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉండనుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అయితే ఈ ఫోన్ యొక్క చిప్సెట్ వివరాలు ఇంకా బయటకు రాలేదు.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీతో లాంచ్ కానుంది. లీక్స్ ని బట్టి ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉండనుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా ఇవ్వనున్నారు. పవర్ బ్యాకప్ విషయానికి వస్తే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో Galaxy A14 4G ఫోన్ ని లాంచ్ చేయనున్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>