Samsung Galaxy A15 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 14 Nov 2023 18:51:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Dimensity 6100 Plus చిప్‌తో Geekbench పై లిస్టైన Samsung Galaxy A15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-geekbench-listing-key-specs/ Tue, 14 Nov 2023 18:26:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=8839 Samsung సంస్థ త్వరలో Samsung Galaxy A15 5G డివైజ్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ డివైజ్ Galaxy A14 5G కి సక్సెసర్ గా వస్తోంది. Galaxy A14 5G ఎగ్జినోస్ 1330 చిప్సెట్ తో వచ్చింది. Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ రానున్న కొన్ని నెలల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా Samsung Galaxy A15 5G డివైజ్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో లిస్టింగ్ […]

The post Dimensity 6100 Plus చిప్‌తో Geekbench పై లిస్టైన Samsung Galaxy A15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న Galaxy A15 5G

Samsung సంస్థ త్వరలో Samsung Galaxy A15 5G డివైజ్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ డివైజ్ Galaxy A14 5G కి సక్సెసర్ గా వస్తోంది. Galaxy A14 5G ఎగ్జినోస్ 1330 చిప్సెట్ తో వచ్చింది. Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ రానున్న కొన్ని నెలల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా Samsung Galaxy A15 5G డివైజ్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

  • Samsung Galaxy A15 5G డివైజ్ గీక్‌బెంచ్ 6 డేటాబేస్ పై SM-A156B అనే మోడల్ నంబర్ తో లిస్టైంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 1717 పాయింట్లు నమోదు చేసింది.
  • Samsung Galaxy A15 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్ బెంచ్ పై లిస్టైంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి.
  • మెమొరీ: Samsung Galaxy A15 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఉంటాయి. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post Dimensity 6100 Plus చిప్‌తో Geekbench పై లిస్టైన Samsung Galaxy A15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A15 5G ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-price-specs-leaked-before-launch/ Tue, 31 Oct 2023 05:43:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=8608 Samsung తన 5G స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మొబైల్‌ను రాబోయే రోజుల్లో Samsung Galaxy A15 5G పేరుతో విడుదల చేయవచ్చని సమాచారం. కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, దీనికి సంబంధించి కొత్త లీక్‌లు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈలోపు Samsung Galaxy A15 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర […]

The post లీకైన Samsung Galaxy A15 5G ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 5G
  • తాజాగా లీకైన Samsung Galaxy A15 5G ధర
  • Samsung Galaxy A15 5G ధర సుమారు రూ.12,403

Samsung తన 5G స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మొబైల్‌ను రాబోయే రోజుల్లో Samsung Galaxy A15 5G పేరుతో విడుదల చేయవచ్చని సమాచారం. కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, దీనికి సంబంధించి కొత్త లీక్‌లు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈలోపు Samsung Galaxy A15 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర (లీక్)

  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా Samsung Galaxy A15 5G ధరను రివీల్ చేశారు.
  • Samsung Galaxy A15 5G డివైజ్ 149 డాలర్లు (సుమారు రూ.12,403) గా ఉండవచ్చు.
  • శాంసంగ్ సంస్థ ఈ కొత్త ఫోన్ ని రెండు స్టోరేజీల్లో ఆఫర్ చేస్తుంది. అవి: 4జిబి మరియు 6జిబి ర్యామ్.
  • లీకైన అంచనా ధర బేస్ వేరియంట్ అయిన 4జిబి+64జిబి మోడల్‌ది అయ్యుంటుందని భావిస్తున్నారు.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ రిజిడ్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో రానుందని ఇటీవలె ఒక లీక్ ద్వారా తెలిసింది.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Samsung Galaxy A15 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post లీకైన Samsung Galaxy A15 5G ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OLED డిస్ప్లేతో లాంచ్ కానున్న Samsung Galaxy A15 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-to-feature-oled-display-report/ Fri, 27 Oct 2023 18:29:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8569 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A15 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎల్సీడీ స్క్రీన్ ఉండటం సహజం. కానీ, శాంసంగ్ తన ఎంట్రీ లెవెల్ డివైజ్ Samsung Galaxy A15 లో ఓఎల్ఈడీ డిస్ప్లే ఆఫర్ చేయబోతున్నట్లు సమాచారం. The Elec వెబ్ సైట్ ఈమేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, Samsung […]

The post OLED డిస్ప్లేతో లాంచ్ కానున్న Samsung Galaxy A15 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Galaxy A15 ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోందని తెలిపిన Elec
  • ఫస్ట్ ఎంట్రీ-లెవెల్ ఓఎల్ఈడీ డిస్ప్లే శాంసంగ్ ఫోన్‌గా నిలవనున్న Galaxy A15
  • 2024 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Samsung Galaxy A15

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A15 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎల్సీడీ స్క్రీన్ ఉండటం సహజం. కానీ, శాంసంగ్ తన ఎంట్రీ లెవెల్ డివైజ్ Samsung Galaxy A15 లో ఓఎల్ఈడీ డిస్ప్లే ఆఫర్ చేయబోతున్నట్లు సమాచారం. The Elec వెబ్ సైట్ ఈమేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, Samsung Galaxy A15 డివైజ్ శాంసంగ్ యొక్క ఫస్ట్ ఎంట్రీ-లెవెల్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఫోన్ గా నిలవనుందని అర్థమవుతోంది.

OLED స్క్రీన్‌తో వస్తోన్న Samsung Galaxy A15

  • ఒక రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A15 ఫోన్ లో ఓఎల్ఈడీ ప్యానెల్ వాడాలని శాంసంగ్ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఇదే ప్యానెల్ ని Samsung Galaxy A24 లో కూడా వాడినట్లు సమాచారం.
  • శాంసంగ్ తన Galaxy A15 లో వాడబోయేది రిజిడ్ ఓఎల్ఈడీ ప్యానెల్. దీని ధర ఎల్సీడీ కంటే చవకని తెలుస్తోంది.
  • ఇకపోతే Samsung Galaxy A15 డివైజ్ 4జీ మరియు 5జీ వేరియంట్స్ లో లాంచ్ కానుందని సమాచారం.

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

  • స్క్రీన్: Samsung Galaxy A15 లో 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది.
  • మెమొరీ: Samsung Galaxy A15 లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్ వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A15 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A15 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post OLED డిస్ప్లేతో లాంచ్ కానున్న Samsung Galaxy A15 first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై కనిపించిన Samsung Galaxy A15 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-geekbench-listing-key-details/ Sat, 07 Oct 2023 06:03:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=8288 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే ఒక చవకైన ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A15 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి వస్తోంది. ఇటీవలె ఈ డివైజ్ ఇమేజ్ రెండర్ రివీల్ అయ్యింది. తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై Samsung Galaxy A15 కనిపించింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A15 డివైజ్ గీక్ బెంచ్ లిస్టింగ్ […]

The post Geekbench పై కనిపించిన Samsung Galaxy A15 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తక్కువ ధరతో రానున్న Samsung Galaxy A15
  • హీలియో జీ99 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • గీక్ బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే ఒక చవకైన ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A15 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి వస్తోంది. ఇటీవలె ఈ డివైజ్ ఇమేజ్ రెండర్ రివీల్ అయ్యింది. తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై Samsung Galaxy A15 కనిపించింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A15 డివైజ్ గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Samsung Galaxy A15 డివైజ్ గీక్ బెంచ్ పై SM-A155F అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
  • Samsung Galaxy A15 డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 743 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 2005 పాయింట్లు స్కోర్ చేసింది.
  • ముఖ్యమైన ఫీచర్లను చూస్తే, Samsung Galaxy A15 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ తో కనిపించింది.
  • Samsung Galaxy A15 డివైజ్ 4జిబి ర్యామ్ తో గీక్ బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy A15 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు సమాచారం.
  • తక్కువ ధరలో 4జీ టెక్నాలజీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy A15 లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్/120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది.
  • మెమొరీ: Samsung Galaxy A15 లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్ వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A15 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A15 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Geekbench పై కనిపించిన Samsung Galaxy A15 first appeared on 91Mobiles Telugu.

]]>
ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న Samsung Galaxy A15 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-image-leaked-before-launch/ Fri, 29 Sep 2023 06:57:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=8221 ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే బడ్జెట్ సెగ్మెంట్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఈ క్రమంలో Samsung Galaxy A15 అనే ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇది గత మోడల్ Samsung Galaxy A14 కి సక్సెసర్ గా వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా Samsung Galaxy A15 డివైజ్ యొక్క ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి లీకైన Samsung Galaxy A15 […]

The post ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న Samsung Galaxy A15 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15
  • ఫోన్ ఇమేజ్ ని లీక్ చేసిన టిప్‌స్టర్
  • గెలాక్సీ ఏ14 కి సక్సెసర్ గా వస్తోన్న Galaxy A15

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే బడ్జెట్ సెగ్మెంట్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఈ క్రమంలో Samsung Galaxy A15 అనే ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇది గత మోడల్ Samsung Galaxy A14 కి సక్సెసర్ గా వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా Samsung Galaxy A15 డివైజ్ యొక్క ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి లీకైన Samsung Galaxy A15 రెండర్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Samsung Galaxy A15 ఇమేజెస్

  • టిప్‌స్టర్ ఎవన్ బ్లాస్ Samsung కొత్త ఫోన్ యొక్క ఇమేజ్ ని X ప్లాట్ఫామ్ పై షేర్ చేశారు.
  • ఈ ఇమేజ్ Samsung Galaxy A15 అయ్యుంటుందని సమాచారం.
  • లీకైన ఇమేజ్ లో బ్యాక్ ప్యానెల్ పూర్తిగా కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • అయితే, కెమెరా లెన్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
  • Samsung Galaxy A15 లో కుడివైపున వాల్యూమ్ బటన్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందని తెలుస్తోంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ ఉంది. Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు. రానున్న రోజుల్లో స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు, గత మోడల్ Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A14 డివైజ్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • చిప్సెట్: Samsung Galaxy A14 లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ వాడారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A14 లో 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A14 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
  • ఓఎస్: Samsung Galaxy A14 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A14 లో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న Samsung Galaxy A15 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-design-revealed-via-leaked-renders/ Thu, 21 Sep 2023 13:48:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8098 Samsung సంస్థ Galaxy A14 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ఆరంభంలో 4G మరియు 5G వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఈ రెండు వేరియంట్‌లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. Galaxy A14 5G డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. అయితే Galaxy A14 4G హీలియో G80 చిప్‌సెట్‌ ని కలిగి ఉంది. ఇప్పుడు Samsung Galaxy A15 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ సంస్థ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డివైజ్ లాంచ్ […]

The post లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15
  • తాజాగా లీకైన Samsung Galaxy A15 రెండర్స్
  • 6.4-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

Samsung సంస్థ Galaxy A14 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ఆరంభంలో 4G మరియు 5G వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఈ రెండు వేరియంట్‌లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. Galaxy A14 5G డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. అయితే Galaxy A14 4G హీలియో G80 చిప్‌సెట్‌ ని కలిగి ఉంది. ఇప్పుడు Samsung Galaxy A15 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ సంస్థ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డివైజ్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఆన్‌లీక్స్ సౌజన్యంతో The Tech Outlook వెబ్‌సైట్ డివైజ్ రెండర్స్ ఇప్పుడు ది టెక్ ఔట్‌లుక్‌లోని వ్యక్తుల సహకారంతో విశ్వసనీయ ఆన్‌లీక్స్ సౌజన్యంతో లీక్ చేయబడ్డాయి.

లీకైన Samsung Galaxy A15 రెండర్స్

లీకైన రెండర్స్ ని పరిశీలిస్తే, Galaxy A15 ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మనం చూడవచ్చు. డివైజ్ యొక్క కుడి ప్యానెల్ పవర్ బటన్ మరియు వాల్యూమ్ కీలను కలిగి ఉంది. డివైజ్ లోని పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గా పని చేస్తుంది. దిగువ భాగంలో, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ మరియు స్పీకర్లను కలిగి ఉంటుంది. SIM కార్డ్ స్లాట్ డివైజ్ కి ఎడమ వైపు అంచున ఉంది.

డివైజ్ యొక్క ఇతర వివరాల ప్రకారం, ఇది గెలాక్సీ A14లో చూసినట్లుగా V- ఆకారపు నాచ్‌కు బదులుగా ఇన్ఫినిటీ-U నాచ్‌తో సుమారు 6.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డివైజ్ యొక్క వెనుక ప్యానెల్ LED ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కొలతల వారీగా, స్మార్ట్‌ఫోన్ 160.2 x 76.8 x 8.4 మిమీ పరిమాణంలో ఉంటుంది.

ర్యామ్ మరియు స్టోరేజ్ సమాచారం, కెమెరా కాన్ఫిగరేషన్ మరియు బ్యాటరీ సామర్థ్యం వంటి స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియవు. రాబోయే కొద్ది రోజుల్లో డివైజ్ కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపిస్తే గనుక అన్ని స్పెసిఫికేషన్స్ పై క్లారిటీ వస్తుంది.

రివీలైన Samsung Galaxy A05, A05s కెమెరా, ఇతర స్పెసిఫికేషన్స్

Galaxy A05 మరియు Galaxy A05s సామ్‌సంగ్ నుండి తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు డివైజెస్ ఇటీవల వివిధ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించాయి. నివేదికలు వాటి డిజైన్ రెండర్‌లను కూడా షేర్ చేసాయి. తాజాగా, Galaxy A05 మరియు A05s రెండింటి యొక్క స్కీమాటిక్ చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటి ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ తెలిసాయి.

కెమెరా: స్కీమాటిక్స్ ప్రకారం, A05 వెనుకవైపు డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. మరోవైపు A05s డివైజ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో పాటు NFC సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ షూటర్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

బ్యాటరీ: గతంలో, Galaxy A05s 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో పాటు, 5,000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుందని పలు నివేదికల ద్వారా తెలిసింది.

ర్యామ్: Geekbench జాబితా ప్రకారం, రాబోయే హ్యాండ్‌సెట్ 4GB RAMతో జత చేయబడిన Helio G85 చిప్‌సెట్‌తో అందించబడుతుందని అర్థమవుతోంది. Galaxy A05లో కూడా అదే చిప్‌సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఓఎస్: ఈ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

డిస్ప్లే: Galaxy A05 లో 720 x 1,600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.6-ఇంచ్ డిస్ప్లే ఉంటాయని గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీల్ అయ్యింది. ఇకపోతే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ని కలిగి ఉంటాయని సమాచారం.

The post లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>