Dimensity 6100 Plus చిప్‌తో Geekbench పై లిస్టైన Samsung Galaxy A15 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న Galaxy A15 5G

Samsung సంస్థ త్వరలో Samsung Galaxy A15 5G డివైజ్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ డివైజ్ Galaxy A14 5G కి సక్సెసర్ గా వస్తోంది. Galaxy A14 5G ఎగ్జినోస్ 1330 చిప్సెట్ తో వచ్చింది. Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ రానున్న కొన్ని నెలల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా Samsung Galaxy A15 5G డివైజ్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

  • Samsung Galaxy A15 5G డివైజ్ గీక్‌బెంచ్ 6 డేటాబేస్ పై SM-A156B అనే మోడల్ నంబర్ తో లిస్టైంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 1717 పాయింట్లు నమోదు చేసింది.
  • Samsung Galaxy A15 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్ బెంచ్ పై లిస్టైంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి.
  • మెమొరీ: Samsung Galaxy A15 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఉంటాయి. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.