Samsung Galaxy A24 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 04 Apr 2023 06:07:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఖరారైన Samsung Galaxy A24 ఇండియా లాంచ్, వెబ్‌సైట్ పై కనిపిస్తోన్న సపోర్ట్ పేజీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a24-support-page-samsung-india-official-website/ Tue, 04 Apr 2023 06:07:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=5726 భారత్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, Samsung Galaxy A24 హ్యాండ్సెట్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఇండియన్ వెబ్ సైట్ పై Samsung Galaxy A24 సపోర్ట్ పేజీని 91మొబైల్స్ గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. అఫీషియల్ సపోర్ట్ పేజీ డివైజ్ మోడల్ నంబర్ ని రివీల్ చేస్తోంది. Samsung Galaxy A24 కి సంబంధించిన ఇతర […]

The post ఖరారైన Samsung Galaxy A24 ఇండియా లాంచ్, వెబ్‌సైట్ పై కనిపిస్తోన్న సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A24
  • కంపెనీ వెబ్ సైట్ పై కనిపిస్తోన్న Samsung Galaxy A24 సపోర్ట్ పేజీ
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న డివైజ్

భారత్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, Samsung Galaxy A24 హ్యాండ్సెట్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఇండియన్ వెబ్ సైట్ పై Samsung Galaxy A24 సపోర్ట్ పేజీని 91మొబైల్స్ గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. అఫీషియల్ సపోర్ట్ పేజీ డివైజ్ మోడల్ నంబర్ ని రివీల్ చేస్తోంది. Samsung Galaxy A24 కి సంబంధించిన ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

అధికార వెబ్ సైట్ లో కనిపిస్తోన్న Samsung Galaxy A24 సపోర్ట్ పేజీ

పైన స్క్రీన్ షాట్ లో కనిపిస్తోన్న విధంగా త్వరలోనే రాబోవు Samsung Galaxy A24 డివైజ్ SM-A245F/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ పై Samsung Galaxy A24 సపోర్ట్ పేజీ దర్శనమిస్తోంది. అయితే, సపోర్ట్ పేజీతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలియలేదు. అయితే అంచనాల ప్రకారం, ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో ఇక్కడ చూద్దాం.

Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది. అలాగే 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని అందించవచ్చు. Samsung Galaxy A24 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేసే చాన్స్ ఉంది. ప్రాసెసర్ ని బట్టి ఈ డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇప్పుడు Samsung Galaxy A24 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వవచ్చు. రియర్ మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుండటం మంచి విషయం. అయితే ఈ ఫీచర్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ డివైజ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఖరారైన Samsung Galaxy A24 ఇండియా లాంచ్, వెబ్‌సైట్ పై కనిపిస్తోన్న సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy A24 కలర్ ఆప్షన్స్, డిజైన్ ఎలిమెంట్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a24-color-options-design-leaked-before-launch/ Mon, 23 Jan 2023 14:04:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=4605 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గతేడాది Samsung Galaxy A23 5G ఫోన్ ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక వారం క్రితమే భారత్ లో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫోన్ కి సక్సెసర్ గా Samsung Galaxy A24 త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం. ఎల్టీఈ మరియు 5జీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. తాజాగా Samsung Galaxy A24 కి సంబంధించిన డిజైన్ రెండర్స్ […]

The post రివీలైన Samsung Galaxy A24 కలర్ ఆప్షన్స్, డిజైన్ ఎలిమెంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 4 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్ తో వస్తోన్న Samsung Galaxy A24
  • 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గతేడాది Samsung Galaxy A23 5G ఫోన్ ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక వారం క్రితమే భారత్ లో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫోన్ కి సక్సెసర్ గా Samsung Galaxy A24 త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం. ఎల్టీఈ మరియు 5జీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. తాజాగా Samsung Galaxy A24 కి సంబంధించిన డిజైన్ రెండర్స్ The Tech Outlook ద్వారా బయటకు వచ్చాయి.

లీకైన డిజైన్ రెండర్స్ ద్వారా Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ బ్లాక్, డార్క్ రెడ్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A24 డిజైన్ రెండ్స్, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy A24 డిజైన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A24 యొక్క లీకైన రెండర్స్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలిసింది. లీకైన రెండర్స్ ని బట్టి, Samsung Galaxy A24 ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, మందపాటి చిన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై చూస్తే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా సెటప్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లో మాదిరి కనిపిస్తోంది.

లీకైన రెండర్స్ ని బట్టి హ్యాండ్సెట్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఫోన్ కి ఎడమవైపున సిమ్ కార్డ్ ట్రే ఉంది. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేయబడి ఉంది.

Samsung Galaxy A24 గురించి తెలిసిన సమాచారం ఇదే

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ఇటీవలె బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తోన్న Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్, రెడ్మీ 11 ప్రైమ్, పోకో ఎమ్5, రియల్మీ 10 తదితర ఫోన్లతో పోటీపడనుంది. ఇప్పటికే Samsung Galaxy A24 యొక్క స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలిసింది.

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్ తో వచ్చింది. ఇంకా 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి ఆగ్జిలరీ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy A24 డివైజ్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని క్లియర్ చేసింది. దీని బట్టి ఈ ఫోన్ ఇండియా లాంచ్ కన్పర్మ్ అయ్యింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీలైన Samsung Galaxy A24 కలర్ ఆప్షన్స్, డిజైన్ ఎలిమెంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
48MP OIS కెమెరా, Exynos 7904 ప్రాసెసర్ తో వస్తోన్న Samsung Galaxy A24 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a24-specs-surfaced-online/ Wed, 19 Oct 2022 14:59:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=2980 హైలైట్స్ లీక్స్ ద్వారా బయటకు వచ్చిన Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్ 48ఎంపి ఓఐఎస్ రియర్ కెమెరా, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్న Samsung Galaxy A24 The Pixel వెబ్‌సైట్ ద్వారా లీకైన Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్ రానున్న కొన్ని నెలల్లో Samsung సంస్థ Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఏ23 కి ఇది సక్సెసర్ గా వస్తోంది. The Pixel ద్వారా Samsung […]

The post 48MP OIS కెమెరా, Exynos 7904 ప్రాసెసర్ తో వస్తోన్న Samsung Galaxy A24 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లీక్స్ ద్వారా బయటకు వచ్చిన Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్
  • 48ఎంపి ఓఐఎస్ రియర్ కెమెరా, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్న Samsung Galaxy A24
  • The Pixel వెబ్‌సైట్ ద్వారా లీకైన Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్

రానున్న కొన్ని నెలల్లో Samsung సంస్థ Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఏ23 కి ఇది సక్సెసర్ గా వస్తోంది. The Pixel ద్వారా Samsung Galaxy A24 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి Samsung Galaxy A24 లో 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 48ఎంపి ఓఐఎస్ కెమెరాతో వస్తున్నట్లు స్పష్టమైంది.

Samsung Galaxy A24 ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఈ డివైజ్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy A24 యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుందని సమాచారం. ఏ23 తో పోల్చితే ఇది భారీ మార్పేనని చెప్పాలి. శాంసంగ్ గెలాక్సీ ఏ23 లో కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. కానీ, అది ఎల్సీడీ ప్యానెల్. ఇకపోతే Samsung Galaxy A24 లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందా లేదా డాట్-నాచ్ డిస్ప్లే ఉంటుందా అనే విషయం ఇంకా తెలియదు.

అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం లాంచ్ అయిన Exynos 7904 ప్రాసెసర్ ని Samsung Galaxy A24 లో వాడనున్నట్లు సమాచారం. ఈ చిప్ 14nm FinFET ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ71 జీపీయూ వాడటం జరిగింది. గెలాక్సీ ఎమ్20, ఎమ్30, ఏ40 వంటి ఎన్నో స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ ఎగ్జినోస్ 7904 చిప్సెట్ ని వాడింది.

Samsung Galaxy A24 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. Samsung Galaxy A24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని వినికిడి. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ లెన్స్ ఉండనుంది. ఓఐఎస్ ని తీసుకురావడం ఏ23 తో పోల్చితే బిగ్ అప్‌గ్రేడ్ అని చెప్పాలి. అలాగే ఇందులో 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉండనున్నాయి. అయితే, Samsung Galaxy A24 లో మ్యాక్రో లెన్స్ ఉండబోదని గతంలో వచ్చిన ఓ వార్త స్పష్టం చేసింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరా ఉండనుంది.

Samsung Galaxy A24 లో 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే, బ్యాటరీ మరియు చార్జింగ్ స్పీడ్ కి సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. Samsung Galaxy A23 లో 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. కావున, Samsung Galaxy A24 లో కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లభ్యం కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో Samsung Galaxy A24 కి సంబంధించిన కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 48MP OIS కెమెరా, Exynos 7904 ప్రాసెసర్ తో వస్తోన్న Samsung Galaxy A24 first appeared on 91Mobiles Telugu.

]]>