
భారత్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, Samsung Galaxy A24 హ్యాండ్సెట్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఇండియన్ వెబ్ సైట్ పై Samsung Galaxy A24 సపోర్ట్ పేజీని 91మొబైల్స్ గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. అఫీషియల్ సపోర్ట్ పేజీ డివైజ్ మోడల్ నంబర్ ని రివీల్ చేస్తోంది. Samsung Galaxy A24 కి సంబంధించిన ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.
అధికార వెబ్ సైట్ లో కనిపిస్తోన్న Samsung Galaxy A24 సపోర్ట్ పేజీ
పైన స్క్రీన్ షాట్ లో కనిపిస్తోన్న విధంగా త్వరలోనే రాబోవు Samsung Galaxy A24 డివైజ్ SM-A245F/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ పై Samsung Galaxy A24 సపోర్ట్ పేజీ దర్శనమిస్తోంది. అయితే, సపోర్ట్ పేజీతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలియలేదు. అయితే అంచనాల ప్రకారం, ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో ఇక్కడ చూద్దాం.
Samsung Galaxy A24 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది. అలాగే 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని అందించవచ్చు. Samsung Galaxy A24 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేసే చాన్స్ ఉంది. ప్రాసెసర్ ని బట్టి ఈ డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇప్పుడు Samsung Galaxy A24 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వవచ్చు. రియర్ మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుండటం మంచి విషయం. అయితే ఈ ఫీచర్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ డివైజ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉండనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











