
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గతేడాది Samsung Galaxy A23 5G ఫోన్ ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక వారం క్రితమే భారత్ లో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫోన్ కి సక్సెసర్ గా Samsung Galaxy A24 త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం. ఎల్టీఈ మరియు 5జీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. తాజాగా Samsung Galaxy A24 కి సంబంధించిన డిజైన్ రెండర్స్ The Tech Outlook ద్వారా బయటకు వచ్చాయి.
లీకైన డిజైన్ రెండర్స్ ద్వారా Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ బ్లాక్, డార్క్ రెడ్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A24 డిజైన్ రెండ్స్, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.
Samsung Galaxy A24 డిజైన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్
Samsung Galaxy A24 యొక్క లీకైన రెండర్స్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలిసింది. లీకైన రెండర్స్ ని బట్టి, Samsung Galaxy A24 ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, మందపాటి చిన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై చూస్తే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా సెటప్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లో మాదిరి కనిపిస్తోంది.
లీకైన రెండర్స్ ని బట్టి హ్యాండ్సెట్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఫోన్ కి ఎడమవైపున సిమ్ కార్డ్ ట్రే ఉంది. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేయబడి ఉంది.
Samsung Galaxy A24 గురించి తెలిసిన సమాచారం ఇదే
Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ఇటీవలె బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తోన్న Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్, రెడ్మీ 11 ప్రైమ్, పోకో ఎమ్5, రియల్మీ 10 తదితర ఫోన్లతో పోటీపడనుంది. ఇప్పటికే Samsung Galaxy A24 యొక్క స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలిసింది.
Samsung Galaxy A24 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్ తో వచ్చింది. ఇంకా 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి ఆగ్జిలరీ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy A24 డివైజ్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని క్లియర్ చేసింది. దీని బట్టి ఈ ఫోన్ ఇండియా లాంచ్ కన్పర్మ్ అయ్యింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











