Samsung Galaxy A34 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 Mar 2023 13:55:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన Samsung Galaxy A34, A54 రెండర్స్; రివీలైన డిజైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-galaxy-a54-renders-leaked/ Wed, 11 Jan 2023 14:31:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=4438 హైలైట్స్ ఓ టిప్‌స్టర్ ద్వారా Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల డిజైన్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A34, Galaxy A54 ఇంకా కన్ఫర్మ్ కాని Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల లాంచ్ తేదీ దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ త్వరలోనే కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ప్రముఖమైనవి Galaxy A34 మరియు Galaxy A54. ఈ రెండు […]

The post లీకైన Samsung Galaxy A34, A54 రెండర్స్; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఓ టిప్‌స్టర్ ద్వారా Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల డిజైన్స్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A34, Galaxy A54
  • ఇంకా కన్ఫర్మ్ కాని Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల లాంచ్ తేదీ

దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ త్వరలోనే కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ప్రముఖమైనవి Galaxy A34 మరియు Galaxy A54. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క రెండర్స్ తాజాగా నెట్టింట్ల ప్రత్యక్షమయ్యాయి. ట్విట్టర్ ద్వారా ప్రముఖ టిప్ స్టర్ ఇవాన్ బ్లాస్ ఏ-సిరీస్ ఫోన్ల యొక్క రెండర్స్ ని లీక్ చేశాడు. లీక్స్ ని బట్టి ఈ రెండు ఫోన్లు A34, A54 అయ్యుంటాయని అంచనా వేస్తున్నాం. సరే పదండి, ఓసారి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

లీకైన Samsung Galaxy A34, Galaxy A54 డిజైన్స్

లీకైన రెండర్స్ ని SamMobile ద్వారా తీసుకోవడం జరిగింది. చూస్తుంటే, రెండు ఫోన్లు కూడా ఫ్లాట్ డిస్ప్లే, సన్నని బెజెల్స్ కలిగి ఉన్నాయని తెలుస్తోంది. Galaxy A54 లో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ఉండగా, Galaxy A34 లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. రెండు స్మార్ట్ ఫోన్లకు కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్స్ ఉన్నాయి. లీకైన రెండర్స్ లో రియర్ ప్యానెల్స్ కనిపించడం లేదు. రెండింట్లోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందనిపిస్తోంది. రెండర్స్ ద్వారా తెలిసిన సమాచారం ఇంతే.

Samsung Galaxy A34, Galaxy A54 స్పెసిఫికేషన్స్

Galaxy A34 లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ఉండనుంది. ఇకపోతే Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ముందే అనుకున్నట్లుగా రెండు ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. మిగతా సెన్సర్స్ లో 12ఎంపి సెకండరీ సెన్సర్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A54 లో ఎగ్జినోస్ 7904 చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయని అంచనా. ఇంకా పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung కంపెనీ ఇంకా ఈ వివరాలను కన్ఫర్మ్ చేయలేదు.

Samsung Galaxy A34, Galaxy A54 భారత్ లో ఎప్పుడు లాంచ్ కానున్నాయి?

Samsung Galaxy A14 మరియు Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్లు జనవరి 18 న లాంచ్ అవ్వనున్నాయని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అయితే ఇప్పుడు అదే రోజున Galaxy A34, Galaxy A54 ఫోన్లు లాంచ్ అవుతాయా లేదా అన్నది ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి శాంసంగ్ నుంచి ఓ ప్రకటన రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Samsung Galaxy A34, A54 రెండర్స్; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy A34 5G డిజైన్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-renders-color-options-specs-leaked-before-launch/ Fri, 30 Dec 2022 10:07:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=4258 హైలైట్స్ త్వరలో Samsung Galaxy A34 5G అనే మిడ్-రేంజ్ ఫోన్ ని లాంచ్ చేయబోతోన్న శాంసంగ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్ తో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో శాంసంగ్ Galaxy A14, Galaxy A34, A54 […]

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy A34 5G డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో Samsung Galaxy A34 5G అనే మిడ్-రేంజ్ ఫోన్ ని లాంచ్ చేయబోతోన్న శాంసంగ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్
  • నాలుగు కలర్ ఆప్షన్స్ తో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G
IC: The Tech Outlook

ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో శాంసంగ్ Galaxy A14, Galaxy A34, A54 ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఇకపోతే మిడ్ రేంజ్ ఫోన్ అయిన Samsung Galaxy A34 5G ని శాంసంగ్ త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. Samsung Galaxy A34 5G ఫోన్ యొక్క లాంచ్ వివరాలు, అఫీషియల్ తేదీని శాంసంగ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఈలోపు Samsung Galaxy A34 5G కి సంబంధించిన డిజైన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి, Samsung Galaxy A34 5G యూనిక్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు స్పష్టమైంది. సరే ఓసారి Samsung Galaxy A34 5G యొక్క డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A34 5G డిజైన్, కలర్స్

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ33 5జీ కి సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. ఇదిలా ఉండగా ఫోన్ కి సంబంధించిన కలర్ ఆప్షన్స్, డిజైన్ రెండర్స్ ని The Tech Outlook రివీల్ చేసింది. క్లాసిక్ గ్రాఫైట్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇంకా లైమ్ మరియు వయొలెట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

సిల్వర్ కలర్ ఆప్షన్ గ్రేడియంట్ ఫినిష్ తో ఉంది. ఫోన్ కి ముందువైపున వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఇంకా సన్నని బెజెల్స్, మందపాటి చిన్, కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

కెమెరా సెన్సర్స్ కోసం రియర్ ప్యానెల్ పై 3 సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా సెన్సర్స్ పక్కన ఉంది.

రీసెంట్ గా Samsung Galaxy A34 5G యొక్క కొరియన్ వేరియంట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఆ జాబితా ప్రకారం ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. 48ఎంపి మెయిన్ కెమెరా, పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ పోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A34 5G కొరియన్ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. గ్లోబల్ వేరియంట్ లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Samsung Galaxy A34 5G లో బ్లూటూత్ 5.3, వై-ఫై, 5జీ, 4జీ వొల్టీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే డివైజ్ 2023 ప్రథమార్థంలో ఇండియాలో లాంచ్ కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy A34 5G డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
6GB ర్యామ్, Dimensity 1080 చిప్ తో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-specs-leaked-before-launch/ Thu, 29 Dec 2022 12:40:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4241 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy A34 5G కొరియన్ వర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్, మాలి జీ68 జీపీయూ, 6జిబి ర్యామ్ వంటి స్పెసిపికేషన్స్ ని కలిగి ఉన్న Samsung Galaxy A34 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే Samsung Galaxy A34 5G డివైజ్ […]

The post 6GB ర్యామ్, Dimensity 1080 చిప్ తో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్
  • గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy A34 5G కొరియన్ వర్షన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ చిప్, మాలి జీ68 జీపీయూ, 6జిబి ర్యామ్ వంటి స్పెసిపికేషన్స్ ని కలిగి ఉన్న Samsung Galaxy A34 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే Samsung Galaxy A34 5G డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా లాంచ్ అవ్వబోతోంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన కొరియన్ వేరియంట్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫమ్ గీక్ బెంచ్ పై దర్శనమిచ్చింది. లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy A34 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ కి సంబంధించిన రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ SM-A346B అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పై కనిపించింది. సరే ఓసారి Samsung Galaxy A34 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G గీక్ బెంచ్ 5 బెంచ్ మార్క్ డేటా బేస్ పై SM-A346N అనే మోడల్ నంబర్ తో కనిపించింది. త్వరలో రాబోవు ఈ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 778 పాయింట్స్, మల్టీ కోర్ టెస్ట్ లో 2332 పాయింట్లు సాధించింది. 2 + 6 కోర్ కన్ఫిగరేషన్ కల్గిన ఆక్టాకోర్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తోంది.

లిస్టింగ్ ని బట్టి చూస్తే, Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. డైమెన్సిటీ 1080 చిప్ టీఎస్ఎంసీ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైనట్లు సమాచారం. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ వాడినట్లు తెలుస్తోంది.

గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఇంకా తెలిసిన విషయమేంటంటే, Samsung Galaxy A34 5G ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ ఆప్షన్ తో వస్తోంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే Samsung Galaxy A34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ వాటర్ డ్రాప్ డిస్ప్లే, 19.5:9 రేషియో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో మెయిన్ లెన్స్, అల్ట్రావైడ్, మ్యాక్రో కెమెరాలు ఉండనున్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6GB ర్యామ్, Dimensity 1080 చిప్ తో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A34 ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-images-key-specs-leaked-before-launch/ Fri, 25 Nov 2022 09:33:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=3671 హైలైట్స్ త్వరలో Galaxy A34 ని లాంచ్ చేయనున్న Samsung కంపెనీ లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A34 ఇమేజెస్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Samsung Galaxy A34 శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ-సిరీస్ లో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ ఫోన్ పేరు Samsung Galaxy A34. ఈ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈలోపు […]

The post లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A34 ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో Galaxy A34 ని లాంచ్ చేయనున్న Samsung కంపెనీ
  • లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A34 ఇమేజెస్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Samsung Galaxy A34
Image Courtesy: @OnLeaks

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ-సిరీస్ లో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ ఫోన్ పేరు Samsung Galaxy A34. ఈ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈలోపు ఈ ఫోన్ కి సంబంధించిన రెండర్ ఇమేజ్ మరియు వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే లేటెస్ట్ లీక్ ద్వారా Samsung Galaxy A34 యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A34 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Image Courtesy: @OnLeaks

Samsung Galaxy A34 స్మార్ట్ ఫోన్ యు షేప్డ్ నాచ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఫ్లాట్ స్క్రీన్, కర్వ్డ్ ఎడ్జెస్ తో డిస్ప్లే యూనిట్ కనిపిస్తోంది. Samsung Galaxy A34 డిస్ప్లే మూడు వైపులా బెజెల్స్ ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. లీక్ ప్రకారం, Samsung Galaxy A34 డివైజ్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 77.7 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఇక ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ డిస్ప్లే ఉండనుంది.

Samsung Galaxy A34 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని పిక్స్ ద్వారా స్పష్టమవుతోంది. బ్యాక్ ప్యానెల్ పై వర్టికల్ షేప్ లో కెమెరా మాడ్యూల్ ఉంది. అలాగే పక్కన ఫ్లాష్ లైట్ ఉంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అందించారు. బాటమ్ లో యూఎస్బీ టైప్ సీ పోర్ట్ తో పాటు స్పీకర్ గ్రిల్ ఉంది. లీక్ సమాచారం నిజమేననుకుంటే, ఈ ఫోన్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో రానుంది. Samsung Galaxy A34 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు Samsung Galaxy A33 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Samsung Galaxy A33 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A33 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16 మిలియన్ కలర్ డెప్త్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రేటింగ్ Samsung Galaxy A33 5G లో ఉన్నాయి.

Samsung Galaxy A33 5G డివైజ్ కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy A33 ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ అందించారు. ఇది 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని పొందే వీలుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A34 ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>