హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్
- గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy A34 5G కొరియన్ వర్షన్
- మీడియాటెక్ డైమెన్సిటీ చిప్, మాలి జీ68 జీపీయూ, 6జిబి ర్యామ్ వంటి స్పెసిపికేషన్స్ ని కలిగి ఉన్న Samsung Galaxy A34 5G
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే Samsung Galaxy A34 5G డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా లాంచ్ అవ్వబోతోంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన కొరియన్ వేరియంట్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫమ్ గీక్ బెంచ్ పై దర్శనమిచ్చింది. లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy A34 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ కి సంబంధించిన రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ SM-A346B అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పై కనిపించింది. సరే ఓసారి Samsung Galaxy A34 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A34 5G గీక్ బెంచ్ 5 బెంచ్ మార్క్ డేటా బేస్ పై SM-A346N అనే మోడల్ నంబర్ తో కనిపించింది. త్వరలో రాబోవు ఈ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 778 పాయింట్స్, మల్టీ కోర్ టెస్ట్ లో 2332 పాయింట్లు సాధించింది. 2 + 6 కోర్ కన్ఫిగరేషన్ కల్గిన ఆక్టాకోర్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తోంది.
లిస్టింగ్ ని బట్టి చూస్తే, Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. డైమెన్సిటీ 1080 చిప్ టీఎస్ఎంసీ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైనట్లు సమాచారం. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ వాడినట్లు తెలుస్తోంది.
గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఇంకా తెలిసిన విషయమేంటంటే, Samsung Galaxy A34 5G ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ ఆప్షన్ తో వస్తోంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే Samsung Galaxy A34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ వాటర్ డ్రాప్ డిస్ప్లే, 19.5:9 రేషియో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో మెయిన్ లెన్స్, అల్ట్రావైడ్, మ్యాక్రో కెమెరాలు ఉండనున్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












