Samsung Galaxy F04 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:30:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేడే Samsung Galaxy F04 ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f04-first-sale-today-india-flipkart/ Thu, 12 Jan 2023 05:54:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=4442 హైలైట్స్ భారత్ లో Samsung Galaxy F04 ధర రూ.7,499 మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి కెమెరాతో వచ్చిన Samsung Galaxy F04 ఒపల్ గ్రీన్ మరియు జేడ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy F04 Samsung Galaxy F04 నేడు మొదటిసారిగా భారత్ లో సేల్ కి వచ్చింది. ఈ ఎంట్రీ-లెవెల్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ గత వారం భారత్ లో లాంచైంది. బడ్జెట్ ఫ్రెండ్లీ […]

The post నేడే Samsung Galaxy F04 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో Samsung Galaxy F04 ధర రూ.7,499
  • మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి కెమెరాతో వచ్చిన Samsung Galaxy F04
  • ఒపల్ గ్రీన్ మరియు జేడ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy F04

Samsung Galaxy F04 నేడు మొదటిసారిగా భారత్ లో సేల్ కి వచ్చింది. ఈ ఎంట్రీ-లెవెల్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ గత వారం భారత్ లో లాంచైంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ కొనాలని భావించే వారు ఈ ఫోన్ ని చెక్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ లో Samsung Galaxy F04 యొక్క ధర, ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపి సెల్ఫీ కెమెరా, 2 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఈ ఫోన్ హైలైట్స్. సరే, ఓసారి Samsung Galaxy F04 యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy F04 ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ ధరను భారత్ లో రూ.9,499 గా నిర్ణయించారు. శాంసంగ్ ఈ ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అదనంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ నేడు, అనగా జనవరి 12 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. డిస్ప్లే ప్యానెల్ 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంది.

Samsung Galaxy F04 లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వినియోగించారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ ని పెంచుకునే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఎఫ్-సిరీస్ ఫోన్ కి శాంసంగ్ రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ ని హామీ ఇస్తోంది.

Samsung Galaxy F04 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy F04 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఇచ్చారు.

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ ఒపల్ గ్రీన్, జేడ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. అయితే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నేడే Samsung Galaxy F04 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.7,499 ధరతో భారత్ లో లాంచైన Samsung Galaxy F04 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f04-launched-india-price-specs-availability/ Wed, 04 Jan 2023 10:45:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4329 హైలైట్స్ భారత్ లో లాంచైన Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Samsung Galaxy F04 భారత్ లో Samsung Galaxy F04 ధర రూ.7,499 ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 భారత్ లో లాంచైంది. ఈ ఎఫ్-సిరీస్ ఫోన్ ధరను రూ.7,499 గా నిర్ణయించారు. Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే అచ్చంగా గెలాక్సీ ఎమ్04 గా ఉన్నట్లు […]

The post రూ.7,499 ధరతో భారత్ లో లాంచైన Samsung Galaxy F04 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Samsung Galaxy F04
  • భారత్ లో Samsung Galaxy F04 ధర రూ.7,499

ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 భారత్ లో లాంచైంది. ఈ ఎఫ్-సిరీస్ ఫోన్ ధరను రూ.7,499 గా నిర్ణయించారు. Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే అచ్చంగా గెలాక్సీ ఎమ్04 గా ఉన్నట్లు అనిపిస్తోంది. Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ జనవరి 12 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో వచ్చింది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, హెచ్డీ+ రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపి సెల్ఫీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ అందించారు. సరే ఓసారి Samsung Galaxy F04 యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy F04 ధర, లభ్యత

భారత్ లో Samsung Galaxy F04 ధరను రూ.7,499 గా నిర్ణయించారు. ఇది 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఈ హ్యాండ్సెట్ జనవరి 12 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. Samsung Galaxy F04 లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది.

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ చార్జింగ్ పోర్ట్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy F04 రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: జేడ్ పర్పుల్ మరియు ఓపల్ గ్రీన్. ఈ హ్యాండ్సెట్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ గ్లాసీ ఫినిషింగ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. కానీ, ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.7,499 ధరతో భారత్ లో లాంచైన Samsung Galaxy F04 first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 4 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy F04 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f04-launch-date-price-flipkart/ Mon, 02 Jan 2023 06:11:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=4278 హైలైట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 యొక్క లాంచ్ తేదీ ఖరారు 2023 జనవరి 4 న భారత్ లో లాంచ్ అవుతోన్న Samsung Galaxy F04 మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోన్న Samsung Galaxy F04 Samsung Galaxy F04 ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం ఎన్నో లీక్స్, రూమర్స్ తర్వాత, Samsung Galaxy F04 యొక్క లాంచ్ అఫీషియల్ గా ఖరారైంది. […]

The post జనవరి 4 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy F04 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 యొక్క లాంచ్ తేదీ ఖరారు
  • 2023 జనవరి 4 న భారత్ లో లాంచ్ అవుతోన్న Samsung Galaxy F04
  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోన్న Samsung Galaxy F04
  • Samsung Galaxy F04 ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం

ఎన్నో లీక్స్, రూమర్స్ తర్వాత, Samsung Galaxy F04 యొక్క లాంచ్ అఫీషియల్ గా ఖరారైంది. Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ ని 2023 జనవరి 4 న లాంచ్ చేయబోతున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. ఇతర గెలాక్సీ ఎఫ్-సిరీస్ డివైజెస్ మాదిరి Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ యూనిక్ డివైజ్ గా నిలవనుంది.

ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ల్యాండింగ్ పేజీ దర్శనమిస్తోంది. దీంతో మనకు Samsung Galaxy F04 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయన్న దానిపై స్పష్టత వచ్చినట్లైంది. ఈ పేజీ ద్వారా ఫోన్ అంచనా ధర, 2 కలర్ ఆప్షన్స్ గురించి తెలిసింది. సరే ఓసారి ఆ వివరాలను చూద్దాం పదండి.

భారత్ లో Samsung Galaxy F04 ధర (అంచనా)

పైన ఇమేజ్ లో కనిపిస్తున్న విధంగా, Samsung Galaxy F04 భారత్ లో 2023 జనవరి 4 వ తేదీన ఫ్లిప్ కార్ట్ ద్వారా లాంచ్ అవుతోంది. ఈ డివైజ్ ధర రూ.7,XXX గా పేర్కొన్నారు. గత రిపోర్ట్స్ ని బట్టి, ఫోన్ ధర రూ.7,499 గా ఉండనుందని చెప్పవచ్చు. Samsung Galaxy F04 డివైజ్ 8జిబి ర్యామ్ (వర్చువల్ ర్యామ్ తో కలిపి) తో వస్తోందని సమాచారం. Samsung Galaxy F04 డివైజ్ జేడ్ పర్పుల్ మరియు ఓపల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy F04 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది బేసిక్ చార్జింగ్ స్పీడ్ తో వస్తుంది.

ఇప్పుడు Samsung Galaxy F04 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. ఈ ఫోన్ లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. ఆసక్తిగల వారు ఓసారి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ యొక్క ల్యాండింగ్ పేజీని విజిట్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 4 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy F04 first appeared on 91Mobiles Telugu.

]]>
2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-january-2023-india-samsung-vivo-iqoo-redmi-tecno/ Sat, 31 Dec 2022 08:31:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4267 హైలైట్స్ 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్ భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2 కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ […]

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్
  • భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు
  • లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2

కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చీ రావడంతోనే అంటే జనవరి 2023 లో కొన్ని దిగ్గజ కంపెనీల నుంచి ఫోన్ లాంచెస్ ని మనం చూడబోతున్నాం. iQOO 11, Redmi Note 12 సిరీస్, Samsung Galaxy F04, Poco C50, Vivo X90 సిరీస్, Tecno Phantom X2 ఫోన్లు జనవరిలో భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్

  • iQOO 11
  • Redmi Note 12 సిరీస్
  • Samsung Galaxy F04
  • Poco C50
  • Vivo X90 సిరీస్
  • Tecno Phantom X2

2023 జనవరి 10 న ఐకూ 11 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 11 తో పాటు ఐకూ 11 ప్రో ఉంటాయి. అయితే తొలుత ఐకూ 11 మాత్రమే వస్తోంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుంది. విషయమేంటంటే ఐకూ 11 సిరీస్ చైనాలో 2022 డిసెంబర్ 8 న లాంచ్ అయ్యింది.

Redmi Note 12 సిరీస్

2023 జనవరి 5 న రెడ్మీ నోట్ 12 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో రెడ్మీ నోట్ 12 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. రెడ్మీ అభిమానులు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Samsung Galaxy F04

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి లో-బడ్జెట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 04 కొత్త సంవత్సరం మొదటి నెలలో భారత్ లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ ఫోన్ ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం ఉంది.

POCO C50

పోకో బ్రాండ్ భారత్ లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ సీ-సిరీస్ ఫోన్ భారతీయ మార్కెట్ లో 2023 జనవరి 3 న లాంచ్ అవుతుందని మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.7,000 గా ఉండే అవకాశం ఉంది.

Moto Edge 40

మోటో ఎడ్జ్ 40 సిరీస్ 2023 జనవరిలో భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. భారత్ లో ఏ తేదీన లాంచ్ అవుతుందో ఇంకా కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Vivo X90 సిరీస్

వివో నుంచి రాబోవు నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన వివో ఎక్స్90 చైనాలో ఈ ఏడాది లాంచ్ అయ్యింది. గ్లోబల్ ఈవెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే లీకైన పోస్టర్స్ ని బట్టి ఈ ఫోన్ 2023 జనవరి 31 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Tecno Phantom X2

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్ భారత్ లో 2023 జనవరి నెలలో లాంచ్ కానుంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి. జనవరి 2 నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలవ్వనుండగా, జనవరి 9 నుంచి సేల్ ప్రారంభమవ్వనుంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. అదే చైనాలో అయితే జనవరి 4 న లాంచ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే వారం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy F04 లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f04-launch-timeline-specs-price/ Wed, 28 Dec 2022 13:27:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=4219 హైలైట్స్ జనవరి మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy F04 భారత్ లో ఈ ఫోన్ ధర రూ.7,000 గా ఉండే అవకాశం. ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న హ్యాండ్సెట్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ర్యామ్ ప్లస్ ఫీచర్, 8జిబి ర్యామ్ తో లాంచ్ కానున్న Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవుతోంది. రూ.8000 లోపు […]

The post వచ్చే వారం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy F04 లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy F04
  • భారత్ లో ఈ ఫోన్ ధర రూ.7,000 గా ఉండే అవకాశం. ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న హ్యాండ్సెట్
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ర్యామ్ ప్లస్ ఫీచర్, 8జిబి ర్యామ్ తో లాంచ్ కానున్న Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవుతోంది. రూ.8000 లోపు ధరలో ఈ ఫోన్ రానుంది. చాలా రోజుల తర్వాత శాంసంగ్ నుంచి ఎఫ్-సిరీస్ డివైజ్ భారత మార్కెట్ లోకి వస్తోంది. వచ్చే వారం అనగా 2023 జనవరి మొదటి వారంలో ఈ ఫోన్ భారత్ లో ప్రవేశిస్తోంది. ర్యామ్ ప్లస్ ఫీచర్, డ్యూయల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది.

Samsung Galaxy F04 ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy F04 త్వరలో భారత్ లో లాంచ్ అవుతోంది. జనవరి మొదటి వారంలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.7,499 గా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి ఇంతవరకు ఏ విషయం బయటకు రాలేదు. అయితే Samsung Galaxy F04 ర్యామ్ ప్లస్ ఫీచర్ తో కూడిన 8జిబి ర్యామ్ కెపాసిటీతో వస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది.

Samsung Galaxy F04 ఎంట్రీ లెవెల్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంకా ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా ఉండటం చేత, ఎంట్రీ లెవెల్ ఫోన్ అయినప్పటికీ, 8జిబి వరకు ర్యామ్ యూజర్ కి లభిస్తుంది. దీంతో Samsung Galaxy F04 మల్టీ టాస్కింగ్ విషయంలో అద్భుతంగా పని చేస్తుందని చెప్పవచ్చు.

Samsung Galaxy A04e విశేషాలు

ఇప్పుడు ఇటీవలె శాంసంగ్ నుంచి మార్కెట్ లోకి వచ్చిన Samsung Galaxy A04e గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,299. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైంది.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ రూ.9,299 ధరతో లాంచైంది. ఇది 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర. ఇదే కాకుండా, Samsung Galaxy A04e 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.9,999 గా నిర్ణయించారు. ఇకపోతే 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కూడా ర్యామ్ ప్లస్ ఫీచర్ తో వచ్చింది. దీంతో ర్యామ్ ని 4జిబి వరకు పెంచుకోవచ్చు.

Samsung Galaxy A04e లో 13 ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post వచ్చే వారం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy F04 లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>