రూ.7,499 ధరతో భారత్ లో లాంచైన Samsung Galaxy F04

హైలైట్స్

  • భారత్ లో లాంచైన Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Samsung Galaxy F04
  • భారత్ లో Samsung Galaxy F04 ధర రూ.7,499

ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 భారత్ లో లాంచైంది. ఈ ఎఫ్-సిరీస్ ఫోన్ ధరను రూ.7,499 గా నిర్ణయించారు. Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే అచ్చంగా గెలాక్సీ ఎమ్04 గా ఉన్నట్లు అనిపిస్తోంది. Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ జనవరి 12 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో వచ్చింది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, హెచ్డీ+ రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపి సెల్ఫీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ అందించారు. సరే ఓసారి Samsung Galaxy F04 యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy F04 ధర, లభ్యత

భారత్ లో Samsung Galaxy F04 ధరను రూ.7,499 గా నిర్ణయించారు. ఇది 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఈ హ్యాండ్సెట్ జనవరి 12 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. Samsung Galaxy F04 లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది.

Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ చార్జింగ్ పోర్ట్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy F04 రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: జేడ్ పర్పుల్ మరియు ఓపల్ గ్రీన్. ఈ హ్యాండ్సెట్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ గ్లాసీ ఫినిషింగ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. కానీ, ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article100వాట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, అలర్ట్ స్లైడర్‌తో లాంచైన OnePlus 11
Next articleFlipkart ద్వారా సేల్ కి రానున్న Realme Pad Slim
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.