Samsung Galaxy F34 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 30 Sep 2023 17:35:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 కొత్త కలర్ వేరియంట్‌లో వచ్చిన Samsung Galaxy F34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f34-5g-orchid-violet-color-variant-launched-india-price-specs-sale/ Sat, 30 Sep 2023 17:35:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8234 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung గత నెలలో Galaxy F34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారత్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. కానీ, నేడు శాంసంగ్ సంస్థ ఆర్కిడ్ వయొలెట్ కలర్ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Samsung […]

The post కొత్త కలర్ వేరియంట్‌లో వచ్చిన Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గత నెలలో లాంచైన Samsung Galaxy F34 5G
  • 8జిబి+128జిబి ఆప్షన్ లో లభించనున్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G సేల్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung గత నెలలో Galaxy F34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారత్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. కానీ, నేడు శాంసంగ్ సంస్థ ఆర్కిడ్ వయొలెట్ కలర్ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G డివైజ్ కొత్త కలర్ వేరియంట్ ని కొనుగోలు చేయవచ్చు. సరే, ఓసారి Samsung Galaxy F34 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, కొత్త కలర్ ఆప్షన్ ధర ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F34 5G ఆర్కిడ్ వయొలెట్ ధర, లభ్యత

  • Samsung Galaxy F34 5G ఆర్కిడ్ వయొలెట్ కలర్ వేరియంట్ ని శాంసంగ్ ప్రకటించింది.
  • ఎంపిక చేయబడిన రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మరియు శాంసంగ్.కామ్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • Samsung Galaxy F34 5G ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో Samsung Galaxy F34 5G సేల్ మొదలవుతుంది.
  • Samsung Galaxy F34 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Samsung Galaxy F34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F34 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • చిప్సెట్: Samsung Galaxy F34 5G లో ఎగ్జినోస్ 1280 చిప్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Samsung Galaxy F34 5G డివైజ్ 6జిబి+128జిబి, 8జిబి+128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ర్యామ్ ని పెంచుకునే వీలుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy F34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy F34 5G డివైజ్ 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post కొత్త కలర్ వేరియంట్‌లో వచ్చిన Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f34-5g-launched-india-price-specs-availability/ Mon, 07 Aug 2023 08:31:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=7489 శాంసంగ్ తన కొత్త మిడ్-రేంజ్ ఫోన్ Samsung Galaxy F34 5G ని భారత్ లో లాంచ్ చేసింది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. యూజర్లకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 11 5జీ […]

The post 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Samsung Galaxy F34 5G
  • రెండు స్టోరేజీ వేరియంట్స్ లో వచ్చిన ఫోన్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో Samsung Galaxy F34 5G

శాంసంగ్ తన కొత్త మిడ్-రేంజ్ ఫోన్ Samsung Galaxy F34 5G ని భారత్ లో లాంచ్ చేసింది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. యూజర్లకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 11 5జీ బ్యాండ్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. సరే, ఓసారి Samsung Galaxy F34 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F34 5G ధర, లభ్యత

Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.20,999 గా ఉంది. ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ పై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది.

Samsung Galaxy F34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 గ్లాస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F34 5G డివైజ్ లో ఎగ్జినోస్ 1280 చిప్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • స్టోరేజీ: Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ ని పెంచుకునే వీలుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F34 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F34 5G డివైజ్ 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఓఎస్: Samsung Galaxy F34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy F34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f34-5g-india-launch-confirmed/ Tue, 25 Jul 2023 14:05:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=7319 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Samsung Galaxy F34 5G అనే పేరుతో ఈ డివైజ్ రానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం. రెవొల్యూషనరీ కెమెరా ని ఈ ఫోన్ ద్వారా అందించనున్నట్లు కంపెనీ తెలుపుతోంది. అలాగే సెగ్మెంట్-లీడింగ్ బ్యాటరీ ఉంటుందట. సరే, ఓసారి కంపెనీ ఖరారు చేసిన ఫీచర్లపై కన్నేద్దాం పదండి. Samsung Galaxy F34 […]

The post 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F34 5G
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న డివైజ్
  • గెలాక్సీ ఎమ్34 కి మోడిఫైడ్ వర్షన్ గా వస్తోన్న Galaxy F34 5G?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Samsung Galaxy F34 5G అనే పేరుతో ఈ డివైజ్ రానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం. రెవొల్యూషనరీ కెమెరా ని ఈ ఫోన్ ద్వారా అందించనున్నట్లు కంపెనీ తెలుపుతోంది. అలాగే సెగ్మెంట్-లీడింగ్ బ్యాటరీ ఉంటుందట. సరే, ఓసారి కంపెనీ ఖరారు చేసిన ఫీచర్లపై కన్నేద్దాం పదండి.

Samsung Galaxy F34 5G ఇండియా లాంచ్ వివరాలు

Samsung Galaxy F34 5G త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే, శాంసంగ్ ఇంకా లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. ఆగస్టు మొదటివారంలో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నాం.

ఖరారైన Samsung Galaxy F34 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • డిస్ప్లే: Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy F34 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో వస్తోంది. తక్కువ కాంతిలో, షేక్-ఫ్రీ పిక్స్ తీసుకునేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది. కెమెరా యాప్ లో ఫన్ మోడ్ కూడా ఉంటుంది. ఇందులో సింగిల్ టేక్ ఫీచర్ తో పాటు 16 ఇన్‌బిల్ట్ లెన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy F34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 2 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

శాంసంగ్ సంస్థ ఇంకా Samsung Galaxy F34 5G డివైజ్ ప్రాసెసర్ ని మరియు లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీజర్ ఇమేజ్ ని బట్టి, Samsung Galaxy F34 5G ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి, Galaxy F34 5G ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.

The post 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy F34 5G first appeared on 91Mobiles Telugu.

]]>