
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Samsung Galaxy F34 5G అనే పేరుతో ఈ డివైజ్ రానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం. రెవొల్యూషనరీ కెమెరా ని ఈ ఫోన్ ద్వారా అందించనున్నట్లు కంపెనీ తెలుపుతోంది. అలాగే సెగ్మెంట్-లీడింగ్ బ్యాటరీ ఉంటుందట. సరే, ఓసారి కంపెనీ ఖరారు చేసిన ఫీచర్లపై కన్నేద్దాం పదండి.
Samsung Galaxy F34 5G ఇండియా లాంచ్ వివరాలు
Samsung Galaxy F34 5G త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే, శాంసంగ్ ఇంకా లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. ఆగస్టు మొదటివారంలో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నాం.
ఖరారైన Samsung Galaxy F34 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- డిస్ప్లే: Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- కెమెరా: Samsung Galaxy F34 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో వస్తోంది. తక్కువ కాంతిలో, షేక్-ఫ్రీ పిక్స్ తీసుకునేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది. కెమెరా యాప్ లో ఫన్ మోడ్ కూడా ఉంటుంది. ఇందులో సింగిల్ టేక్ ఫీచర్ తో పాటు 16 ఇన్‌బిల్ట్ లెన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Samsung Galaxy F34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 2 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
శాంసంగ్ సంస్థ ఇంకా Samsung Galaxy F34 5G డివైజ్ ప్రాసెసర్ ని మరియు లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీజర్ ఇమేజ్ ని బట్టి, Samsung Galaxy F34 5G ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి, Galaxy F34 5G ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.











