50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F34 5G

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Samsung Galaxy F34 5G
  • రెండు స్టోరేజీ వేరియంట్స్ లో వచ్చిన ఫోన్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో Samsung Galaxy F34 5G

శాంసంగ్ తన కొత్త మిడ్-రేంజ్ ఫోన్ Samsung Galaxy F34 5G ని భారత్ లో లాంచ్ చేసింది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. యూజర్లకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 11 5జీ బ్యాండ్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. సరే, ఓసారి Samsung Galaxy F34 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F34 5G ధర, లభ్యత

Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.20,999 గా ఉంది. ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ పై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా Samsung Galaxy F34 5G ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది.

Samsung Galaxy F34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 గ్లాస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F34 5G డివైజ్ లో ఎగ్జినోస్ 1280 చిప్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • స్టోరేజీ: Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ ని పెంచుకునే వీలుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F34 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F34 5G డివైజ్ 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఓఎస్: Samsung Galaxy F34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleReliance AGM 2023: ఆగస్టు 28న జియో ఫోన్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం!
Next articleRealme 11 5G: లీకైన భారత వేరియంట్ కలర్, స్టోరేజీ ఆప్షన్స్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.