Samsung Galaxy M14 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 17 Apr 2023 08:19:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50ఎంపి కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్ లో లాంచైన Samsung Galaxy M14 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m14-5g-launched-india-price-specs-availability/ Mon, 17 Apr 2023 08:02:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=5911 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ భారత్ లో Samsung Galaxy M14 5G డివైజ్ ని లాంచ్ చేసింది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.13,499 గా ఉంది. ఈ డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. 2 ఏళ్ళ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy M14 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు […]

The post 50ఎంపి కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్ లో లాంచైన Samsung Galaxy M14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Samsung Galaxy M14 5G
  • 4 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళ ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో వచ్చిన ఫోన్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Samsung Galaxy M14 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ భారత్ లో Samsung Galaxy M14 5G డివైజ్ ని లాంచ్ చేసింది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.13,499 గా ఉంది. ఈ డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. 2 ఏళ్ళ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy M14 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M14 5G ధర, సేల్ వివరాలు

భారత్ లో Samsung Galaxy M14 5G డివైజ్ సేల్ ఏప్రిల్ 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13490 గా ఉంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. 4జిబి + 128జిబి మోడల్ ధర రూ.13,490 కాగా, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.14,990 గా ఉంది. ఇవి పరిచయ ధరలని గమనించాలి. తర్వాత పెరిగే అవకాశం ఉంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.

  • శాంసంగ్ ఎగ్జినోస్ 1330 చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 13 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తోంది.

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 13ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50ఎంపి కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్ లో లాంచైన Samsung Galaxy M14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 17న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m14-5g-india-launch-date/ Thu, 13 Apr 2023 13:39:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=5871 భారత్ లో మరొక 5జీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 న Samsung Galaxy M14 5G లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ అఫీషియల్ గా రివీల్ అయ్యాయి. వాటిలో 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధానమైనవి. సరే, మిగతా విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. భారత్ లో Samsung Galaxy M14 లాంచ్ మరియు ధర భారత్ […]

The post ఏప్రిల్ 17న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy M14 5G ధర రూ.13 వద్ద ఉండే అవకాశం
  • 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న డివైజ్
  • 2 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్

భారత్ లో మరొక 5జీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 న Samsung Galaxy M14 5G లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ అఫీషియల్ గా రివీల్ అయ్యాయి. వాటిలో 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధానమైనవి. సరే, మిగతా విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy M14 లాంచ్ మరియు ధర

భారత్ లో Samsung Galaxy M14 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 17 న లాంచ్ అవుతోంది. అదే రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర, సేల్ వివరాలు కూడా ప్రకటించబడుతాయి. కంపెనీ ప్రొడక్ట్ పేజీ ద్వారా ఈ ఫోన్ ని టీజ్ చేసింది. రూ.13 వేల బడ్జెట్ లో ఈ ఫోన్ సేల్ కి రానుందని సమాచారం. Galaxy M14 ధర రూ.13,999 గా ఉండనుందని మేం అంచనా వేస్తున్నాం.

Samsung Galaxy M14 5G ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • ఎగ్జినోస్ 1330 చిప్
  • 13 5జీ బ్యాండ్స్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Samsung Galaxy M14 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంటుంది. ఇది 5 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ శాంసంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని అందిస్తామని కంపెనీ హామీనిస్తోంది.

  • 25వాట్ చార్జింగ్
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 50ఎంపి ట్రిపుల్ కెమెరా

Samsung Galaxy M14 5G డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే 2 రోజుల వరకు పని చేస్తుందని కంపెనీ చెబుతోంది.

Samsung Galaxy M14 5G లో ఫోటోగ్రఫీ కోసం 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 17న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
6జిబి ర్యామ్ తో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G; దర్శనమిస్తోన్న సపోర్ట్ పేజీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m14-5g-india-launch-official-website-support-page-live/ Mon, 13 Mar 2023 12:08:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=5481 ఇటీవలె Samsung Galaxy M14 5G డివైజ్ గ్లోబల్ గా లాంచైంది. ఈ డివైజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, శాంసంగ్ ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 50ఎంపి కెమెరా తో వచ్చింది. అలాగే ఈ చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో అతి త్వరలో లాంచ్ కానుంది. Samsung Galaxy M14 5G డివైజ్ శాంసంగ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లో కనిపిస్తోంది. ఈ డివైజ్ 6జిబి/4జిబి ర్యామ్ ఆప్షన్స్ లో వస్తోంది. ఓసారి Samsung […]

The post 6జిబి ర్యామ్ తో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G; దర్శనమిస్తోన్న సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లైవ్ లో దర్శనమిస్తోన్న Samsung Galaxy M14 5G సపోర్ట్ పేజీ
  • సపోర్ట్ పేజీపై కనిపిస్తోన్న 6జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ వేరియంట్స్
  • అతిత్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G డివైజ్

ఇటీవలె Samsung Galaxy M14 5G డివైజ్ గ్లోబల్ గా లాంచైంది. ఈ డివైజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, శాంసంగ్ ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 50ఎంపి కెమెరా తో వచ్చింది. అలాగే ఈ చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో అతి త్వరలో లాంచ్ కానుంది. Samsung Galaxy M14 5G డివైజ్ శాంసంగ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లో కనిపిస్తోంది. ఈ డివైజ్ 6జిబి/4జిబి ర్యామ్ ఆప్షన్స్ లో వస్తోంది. ఓసారి Samsung Galaxy M14 5G డివైజ్ యొక్క ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M14 5G డివైజ్ కంపెనీ యొక్క ఇండియా వెబ్‌సైట్ పై లిస్ట్ కాబడింది. దీంతో అతి త్వరలో Samsung Galaxy M14 5G డివైజ్ మార్కెట్ లో లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. రెండు వేరియంట్లలో ఫోన్ లభించనుంది. అవి: 4జిబి ర్యామ్ మరియు 6జిబి ర్యామ్. త్వరలోనే శాంసంగ్ సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే
  • శాంసంగ్ ఎగ్జినోస్ 1330 చిప్సెట్
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో కూడిన 6.6-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో లాంచైంది. ఈ ఫోన్ స్క్రీన్ పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్ పై తయారైంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. నేవీ బ్లూ, లైట్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ 166.8 మిల్లీ మీటర్ల పొడవు, 77.2 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.4 మిల్లీ మీటర్ల మందం, 206 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy M14 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో శాంసంగ్ సొంత చిప్సెట్ అయిన ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గ్లోబల్ గా ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీతో లాంచైంది.

Samsung Galaxy M14 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13 ఎంపి కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6జిబి ర్యామ్ తో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G; దర్శనమిస్తోన్న సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m14-5g-specs-color-options-renders/ Wed, 01 Feb 2023 08:53:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4732 శాంసంగ్ త్వరలోనే ఎమ్-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. అదే Samsung Galaxy M14 5G. ఈ ఫోన్ కోసం ఎమ్-సిరీస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇంకా బీఐఎస్ సర్టిఫకేషన్ కూడా పొందింది. ఇప్పుడు, The Tech Outlook Samsung Galaxy M14 5G యొక్క డిజైన్ రెండర్స్ ని రివీల్ చేసింది. Samsung Galaxy M14 5G […]

The post Samsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

రెండర్ ఇమేజెస్ ద్వారా లీకైన Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్

డార్క్ బ్లూ, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy M14 5G

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ తో రానున్న Samsung Galaxy M14 5G

శాంసంగ్ త్వరలోనే ఎమ్-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. అదే Samsung Galaxy M14 5G. ఈ ఫోన్ కోసం ఎమ్-సిరీస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇంకా బీఐఎస్ సర్టిఫకేషన్ కూడా పొందింది. ఇప్పుడు, The Tech Outlook Samsung Galaxy M14 5G యొక్క డిజైన్ రెండర్స్ ని రివీల్ చేసింది.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ రెండర్స్ ద్వారా మూడు కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy M14 5G చూడటానికి ఈ ఏడాది లాంచ్ కాబోవు ఇతర శాంసంగ్ ఎమ్-సిరీస్ ఫోన్ల మాదిరే ఉంది. సరే, ఓసారి Samsung Galaxy M14 5G గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, మందపాటి చిన్ కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ కావున, చిన్ మందంగానే ఉంటుంది. దీనిని పెద్దగా యూజర్లు పట్టించుకునే అవకాశం లేదు.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఎంబెడ్ చేయబడి ఉంటుంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఇప్పటికే గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ తో వస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

రీసెంట్ గా Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ FIMKO సర్టిఫికేషన్ పై కనిపించింది. ఇందులో 5830 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఎఫ్‌సీసీ సర్టిఫకేషన్ ద్వారా ఈ డివైజ్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. దీంతో ఈ ఫోన్ భారత మార్కెట్ లో లాంచ్ అవ్వనున్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే ఈ హ్యాండ్సెట్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై కనిపించింది. Samsung Galaxy M14 5G ఫోన్ బ్లూటూత్ 5.2 తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Samsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Galaxy M-సిరీస్ లో చవకైన 5G ఫోన్ ని తీసుకొస్తోన్న Samsung https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m14-5g-to-launch-soon/ Fri, 18 Nov 2022 09:26:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3527 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G Samsung Galaxy M13 5G కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా వస్తోన్న Samsung Galaxy M14 5G బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M14 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంకా ఈ ఫోన్ లాంచ్ గురించి శాంసంగ్ […]

The post Galaxy M-సిరీస్ లో చవకైన 5G ఫోన్ ని తీసుకొస్తోన్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G
  • Samsung Galaxy M13 5G కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా వస్తోన్న Samsung Galaxy M14 5G
  • బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M14 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంకా ఈ ఫోన్ లాంచ్ గురించి శాంసంగ్ నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. అయితే Samsung Galaxy M14 5G బెంచ్ మార్కింగ్ సైట్ అయి గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy M14 5G లాంచ్ త్వరలోనే ఉండనుందని స్పష్టమవుతోంది. ఇక గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

Geekbench పై కనిపించిన Samsung Galaxy M14 5G

Samsung Galaxy M14 5G బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించింది. నవంబర్ 17 న ఈ లిస్టింగ్ గుర్తించబడింది. దాని ప్రకారం, Samsung Galaxy M14 5G డివైజ్ SM-M146B అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గీక్ బెంచ్ ద్వారా ఎన్నో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy M14 5G డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 751 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 2051 పాయింట్లు సాధించింది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్

గీక్ బెంచ్ పై కనిపించిన స్పెసిఫికేషన్స్ ని బట్టి, Samsung Galaxy M14 5G ఆండ్రాయిడ్ 13 తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 2.40 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. 4జిబి ర్యామ్ వేరియంట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy M13 5G

Samsung Galaxy M13 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.15,999 గా నిర్ణయించారు. రెండు వేరియంట్స్ కూడా రూ.2,000 డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. ఈ శాంసంగ్ ఆఫర్ నవంబర్ 30 దాకా కొనసాగుతుంది. డిస్కౌంట్ తో 4జిబి వేరియంట్ ధర రూ.10,999, 6జిబి వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది.

Samsung Galaxy M13 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Galaxy M-సిరీస్ లో చవకైన 5G ఫోన్ ని తీసుకొస్తోన్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>