
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ భారత్ లో Samsung Galaxy M14 5G డివైజ్ ని లాంచ్ చేసింది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.13,499 గా ఉంది. ఈ డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. 2 ఏళ్ళ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy M14 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M14 5G ధర, సేల్ వివరాలు
భారత్ లో Samsung Galaxy M14 5G డివైజ్ సేల్ ఏప్రిల్ 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13490 గా ఉంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. 4జిబి + 128జిబి మోడల్ ధర రూ.13,490 కాగా, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.14,990 గా ఉంది. ఇవి పరిచయ ధరలని గమనించాలి. తర్వాత పెరిగే అవకాశం ఉంది.
Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్
- 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
- శాంసంగ్ ఎగ్జినోస్ 1330 చిప్
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 13 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తోంది.
- 50ఎంపి రియర్ కెమెరా
- 13ఎంపి ఫ్రంట్ కెమెరా
Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











