Samsung Galaxy S21 FE 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 11 Jul 2023 12:27:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy S21 FE Snapdragon 888 మోడల్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s21-fe-5g-snapdragon-888-edition-launched-india-price-specs-availability/ Tue, 11 Jul 2023 12:27:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=7159 ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ నేడు భారత్ లో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 ఎడిషన్ ని లాంచ్ చేసింది. గతేడాది, Samsung Galaxy S21 FE ఎగ్జినోస్ 2100 చిప్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ తో Samsung Galaxy S21 FE భారతీయ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఒక్క చిప్సెట్ తప్పితే, మిగతా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్నీ రెండు వేరియంట్స్ లోనూ ఒకే […]

The post నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy S21 FE Snapdragon 888 మోడల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్ డ్రాగన్ 888 చిప్ తో వచ్చిన Samsung Galaxy S21 FE
  • గతేడాది Exynos 2100 చిప్‌తో భారత్‌లో లాంచైన డివైజ్
  • భారత్ లో Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ ఎడిషన్ ధర రూ.49,999

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ నేడు భారత్ లో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 ఎడిషన్ ని లాంచ్ చేసింది. గతేడాది, Samsung Galaxy S21 FE ఎగ్జినోస్ 2100 చిప్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ తో Samsung Galaxy S21 FE భారతీయ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఒక్క చిప్సెట్ తప్పితే, మిగతా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్నీ రెండు వేరియంట్స్ లోనూ ఒకే విధంగా ఉంటాయి.

Samsung Galaxy S21 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. సరే, ఓసారి Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ వేరియంట్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్ లో Samsung Galaxy S21 FE ధర, లభ్యత

Samsung Galaxy S21 FE డివైజ్ ఆలివ్, గ్రాఫైట్, లావెండర్, నేవీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ ఎడిషన్ ధరను రూ.49,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ ని శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ లో భాగంగా హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ కస్టమర్లకు లభిస్తుంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy S21 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Samsung Galaxy S21 FE లో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. ఇది ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో 660 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S21 FE డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S21 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S21 FE లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, 4జీ వొల్టీ, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy S21 FE Snapdragon 888 మోడల్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ఇండియా ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s21-fe-5g-snapdragon-888-variant-price-leaked/ Fri, 30 Jun 2023 18:13:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=7017 Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ ఇటీవలి కాలంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. నేడు Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ కి సంబంధించిన లీక్స్ బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ.40,000 ధరతో లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా, ఈ ఫోన్ ధర రూ.50,000 లోపు ఉంటుందని మరో వార్త బయటకు వచ్చింది. సరే, ఓసారి లేటెస్ట్ లీక్ కి సంబంధించిన […]

The post లీకైన Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన Samsung Galaxy S21 FE ఇండియా ధర
  • 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.50,000 లోపు ఉంటుందని అంచనా
  • భారత్ లో ఎగ్జినోస్ 2100 వేరియంట్ ధర రూ.32,999

Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ ఇటీవలి కాలంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. నేడు Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ కి సంబంధించిన లీక్స్ బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ.40,000 ధరతో లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా, ఈ ఫోన్ ధర రూ.50,000 లోపు ఉంటుందని మరో వార్త బయటకు వచ్చింది. సరే, ఓసారి లేటెస్ట్ లీక్ కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

భారత్ లో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 ధర (లీక్)

రిటైలర్ ఇమేజ్ ద్వారా లీకైన పోస్టర్ ని 91మొబైల్స్ రివీల్ చేసింది. దీంతో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ధర బయటకు వచ్చింది. ఇమేజ్ ప్రకారం, 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. శాంసంగ్ సంస్థ ఈ స్మార్ట్ ఫోన్ ని సింగిల్ వేరియంట్ లో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.

బయటకు వచ్చిన ధర రిటైలర్ దగ్గర నుంచి నేరుగా వచ్చింది. కాబట్టి, బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్స్ కలుపుకుంటే ఫోన్ ధర మరింత తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు Samsung Galaxy S21 FE ఎగ్జినోస్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. కానీ, ఈ ఫోన్ ని డిస్కౌంట్ కలుపుకుని రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 లాంచ్ తేదీ

Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ స్మార్ట్ ఫోన్ భారత్ లో రానున్న 10 రోజుల్లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ చెబుతున్నారు. ఈ డివైజ్ నేవీ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు.

Samsung Galaxy S21 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S21 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy S21 FE లో స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: Samsung Galaxy S21 FE డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S21 FE లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లీకైన Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
‘శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ’ పై భారీ డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s21-fe-5g-price-cut-flipkart/ Mon, 16 Jan 2023 07:53:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4466 హైలైట్స్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతోన్న డిస్కౌంట్ సేల్స్ Samsung Galaxy S21 FE 5G పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ రూ.34,999 ధరకే లభిస్తోన్న Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ 2022 జనవరి 10 న Samsung Galaxy S21 FE 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది గెలాక్సీ ఎస్21 సిరీస్ లో వచ్చిన వాటర్డ్ డౌన్ వర్షన్. […]

The post ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ’ పై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతోన్న డిస్కౌంట్ సేల్స్
  • Samsung Galaxy S21 FE 5G పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ
  • రూ.34,999 ధరకే లభిస్తోన్న Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ 2022 జనవరి 10 న Samsung Galaxy S21 FE 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది గెలాక్సీ ఎస్21 సిరీస్ లో వచ్చిన వాటర్డ్ డౌన్ వర్షన్. గెలాక్సీ ఎస్21 సిరీస్ తో పోల్చితే ఎన్నో పోలికలున్నప్పటికీ, ఈ ఫోన్ ధర మాత్రం తక్కువే. భారత్ లో లాంచైన Samsung Galaxy S21 FE 5G ఫోన్ ఎగ్జినోస్ 2100 చిప్ తో వచ్చింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మెటల్ చాసిస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉన్నాయి. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.34,999 ధరకే లభిస్తోంది.

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర

భారత్ లో Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.54,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లాంచ్ ధర రూ.58,999 గా ఉంది. అప్పుడు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ తో కొన్న వారికి రూ.5,000 క్యాష్ బ్యాక్ ఇచ్చారు. అయితే తాజాగా Samsung Galaxy S21 FE 5G పై కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర తగ్గింపు

Samsung Galaxy S21 FE 5G ధర భారీ స్థాయిలో తగ్గింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.34,999 గా ఉంది. అంటే లాంచ్ ధరతో పోల్చితే ఇది చాలా తక్కువ. బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ తక్కువ ధరలో లభిస్తోంది. Big Savings Day 2023 సేల్ జనవరి 15 ప్రారంభమైంది. ఇది జనవరి 20 వరకు కొనసాగుతుంది.

Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ గ్రాఫైట్, ఆలివ్, లావెండర్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆసక్తిగల వారు ఫ్లిప్ కార్ట్ పై ఈ ఫోన్ ని ఆఫర్ రేటుకి కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S21 FE 5G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-ఓ 2ఎక్స్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 2,340 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటాయి. Samsung Galaxy S21 FE 5G ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 2100 చిప్సెట్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఇందులో లేదు.

Samsung Galaxy S21 FE 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. టెలీఫోటో లెన్స్ 30x జూమ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. డ్యూయల్ రికార్డింగ్, పొట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, స్పేస్ జూమ్, సింగిల్ టేక్ తదితర కెమెరా ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy S21 FE 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంది. Samsung Galaxy S21 FE 5G ఫోన్ ఐపీ68 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. Samsung Galaxy S21 FE 5G ఫోన్ 155.7 మిల్లీ మీటర్ల పొడవు, 74.5 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.9 మిల్లీ మీటర్ల మందం, 170 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ’ పై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో Android 13 ఆధారిత One UI 5.0 అప్డేట్ పొందనున్న Samsung Galaxy S21 FE యూజర్లు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s21-fe-5g-one-ui-5-update-release-soon/ Mon, 31 Oct 2022 11:30:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3143 హైలైట్స్ బీటా టెస్టింగ్ పరిధిలో లేని Galaxy S21 FE, అయితే త్వరలోనే స్టేబుల్ పబ్లిక్ అప్డేట్ అందుబాటులోకి తేవాలనుకుంటోన్న Samsung ఇటీవలె గెలాక్సీ ఫోన్లకు One UI 5.0 సాఫ్ట్‌వేర్ అప్డేట్ రోలౌట్ ని మొదలుపెట్టిన శాంసంగ్ శాంసంగ్ హామీ ప్రకారం 4 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ పొందనున్న Galaxy S21 FE Samsung కంపెనీ ఇటీవలె తన గెలాక్సీ ఫోన్లకు One UI 5.0 సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపడం ప్రారంభించింది. గెలాక్సీ […]

The post త్వరలో Android 13 ఆధారిత One UI 5.0 అప్డేట్ పొందనున్న Samsung Galaxy S21 FE యూజర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • బీటా టెస్టింగ్ పరిధిలో లేని Galaxy S21 FE, అయితే త్వరలోనే స్టేబుల్ పబ్లిక్ అప్డేట్ అందుబాటులోకి తేవాలనుకుంటోన్న Samsung
  • ఇటీవలె గెలాక్సీ ఫోన్లకు One UI 5.0 సాఫ్ట్‌వేర్ అప్డేట్ రోలౌట్ ని మొదలుపెట్టిన శాంసంగ్
  • శాంసంగ్ హామీ ప్రకారం 4 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ పొందనున్న Galaxy S21 FE

Samsung కంపెనీ ఇటీవలె తన గెలాక్సీ ఫోన్లకు One UI 5.0 సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపడం ప్రారంభించింది. గెలాక్సీ ఎస్22 సిరీస్ కి మొదటి బ్యాచ్ అప్డేట్ ని కంపెనీ రిలీజ్ చేసింది. ఇక తర్వాత గెలాక్సీ ఎస్21 సిరీస్ తో పాటు, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. దక్షిణ కొరియాలో గెలాక్సీ ఎస్22 సిరీస్ రోలౌట్ కి సంబంధించిన టైమ్ లైన్ ని శాంసంగ్ రివీల్ చేసింది. ఇతర మార్కెట్లలో కూడా కొన్ని వారాల గ్యాప్ తో లేదా ఇంచుమించుగా అదే సమయంలో రోలైట్ ఉండనుంది. అయితే ఈ జాబితాలో మిస్ అయిన ఫోన్ ఏదైనా ఉందంటే అది Galaxy S21 FE. ఇక ఈ ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయ్యింది. అయితే ఆండ్రాయిడ్ 13 అప్డేట్ కి సంబంధించిన వివరాలను శాంసంగ్ వెల్లడించలేదు.

అధికార ప్రకటన వస్తుందని వేచి చూస్తోన్న ఈ తరుణంలో, ఓ రిపోర్ట్ ద్వారా Galaxy S21 FE 5G యొక్క ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత One UI 5.0 అప్డేట్ సమాచారం రివీల్ అయ్యింది. Galaxy S21 FE యొక్క One UI 5.0 అప్డేట్ ని శాంసంగ్ ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. Samsung One UI Software Updates అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం Galaxy S21 FE అప్డేట్ ని ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ బీటా టెస్టింగ్ లో భాగం కాదు. అయితే శాంసంగ్ స్టేబుల్ పబ్లిక్ అప్డేట్ ని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. శాంసంగ్ కంపెనీ నాలుగేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. దీంతో రానున్న వారాల్లో Galaxy S21 FE ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పొందే అవకాశం ఉంది. ముందే అనుకున్నట్లుగా రిలీజ్ టైమ్ లైన్ కి సంబంధించి ఎటువంటి అధికార సమాచారం లేదు.

One UI 5.0 విశేషాలేంటి?

One UI 5.0 అప్డేట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా రూపొందింది. శాంసంగ్ లేటెస్ట్ వన్ యూఐ అప్డేట్ కి కొన్ని డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ తో పాటు, ఎన్నో కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. సిస్టమ్ యూఐ వాల్ పేపర్ కి సూట్ అయ్యే విధంగా ఆండ్రాయిడ్ కలర్ ప్యాలెట్ కి శాంసగ్ లేటెస్ట్ అప్డేట్ స్వల్ప మార్పులను తీసుకురానుంది. శాంసంగ్ నేటివ్ యాప్స్ కూడా కొత్త యాప్ ఐకాన్స్ తో రానున్నాయి.

ఇక యానిమేషన్స్ విషయానికి వస్తే, ఇదివరకటి కంటే స్మూథ్ గా ఉండనున్నట్లు శాంసంగ్ చెబుతోంది. లేటెస్ట్ One UI 5.0 కస్టమ్ స్కిన్ తో నడిచే గెలాక్సీ ఫోన్లను వాడుతోన్న వినియోగదారులు తమ ఫోన్లలో లాక్ స్క్రీన్ ని కస్టమైజ్ చేసుకుని నచ్చిన వాల్‌పేపర్లను యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి కాంటాక్ట్ కి విభిన్న కాల్ బ్యాగ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు.

ఐఓఎస్ 15 మాదిరి, శాంసంగ్ స్టాక్డ్ విడ్జెట్స్ ని హోమ్ స్క్రీన్ పై అందించింది. వివిధ రకాల విడ్జెట్స్ ని యూజర్లు ఒక దానిపై ఒకటి స్టాక్ చేసుకోవచ్చు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ద్వారా యూజర్లు ఇమేజెస్ లో టెక్ట్స్ ని కాపీ చేసి ఇతర యాప్స్ లో పేస్ట్ చేయవచ్చు. శాంసంగ్ మరెన్నో జెశ్చర్స్ కి సపోర్ట్ ని యాడ్ చేసింది. స్ప్లిట్ స్క్రీన్ కోసం రెండు వేళ్ళను పైకి స్వైప్ చేయడం వంటివి ఈ జెశ్చర్స్ కి యాడ్ చేసింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో Android 13 ఆధారిత One UI 5.0 అప్డేట్ పొందనున్న Samsung Galaxy S21 FE యూజర్లు first appeared on 91Mobiles Telugu.

]]>