లీకైన Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ఇండియా ధర

Highlights

  • లీకైన Samsung Galaxy S21 FE ఇండియా ధర
  • 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.50,000 లోపు ఉంటుందని అంచనా
  • భారత్ లో ఎగ్జినోస్ 2100 వేరియంట్ ధర రూ.32,999

Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ ఇటీవలి కాలంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. నేడు Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ కి సంబంధించిన లీక్స్ బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ.40,000 ధరతో లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా, ఈ ఫోన్ ధర రూ.50,000 లోపు ఉంటుందని మరో వార్త బయటకు వచ్చింది. సరే, ఓసారి లేటెస్ట్ లీక్ కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

భారత్ లో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 ధర (లీక్)

రిటైలర్ ఇమేజ్ ద్వారా లీకైన పోస్టర్ ని 91మొబైల్స్ రివీల్ చేసింది. దీంతో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ధర బయటకు వచ్చింది. ఇమేజ్ ప్రకారం, 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. శాంసంగ్ సంస్థ ఈ స్మార్ట్ ఫోన్ ని సింగిల్ వేరియంట్ లో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.

బయటకు వచ్చిన ధర రిటైలర్ దగ్గర నుంచి నేరుగా వచ్చింది. కాబట్టి, బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్స్ కలుపుకుంటే ఫోన్ ధర మరింత తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు Samsung Galaxy S21 FE ఎగ్జినోస్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. కానీ, ఈ ఫోన్ ని డిస్కౌంట్ కలుపుకుని రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 లాంచ్ తేదీ

Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ స్మార్ట్ ఫోన్ భారత్ లో రానున్న 10 రోజుల్లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ చెబుతున్నారు. ఈ డివైజ్ నేవీ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు.

Samsung Galaxy S21 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S21 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy S21 FE లో స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: Samsung Galaxy S21 FE డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S21 FE లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleజులై 3 న లాంచ్ అవుతోన్న Moto Razr 40 సిరీస్
Next articleలాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro ధర
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.