త్వరలో Android 13 ఆధారిత One UI 5.0 అప్డేట్ పొందనున్న Samsung Galaxy S21 FE యూజర్లు

హైలైట్స్

  • బీటా టెస్టింగ్ పరిధిలో లేని Galaxy S21 FE, అయితే త్వరలోనే స్టేబుల్ పబ్లిక్ అప్డేట్ అందుబాటులోకి తేవాలనుకుంటోన్న Samsung
  • ఇటీవలె గెలాక్సీ ఫోన్లకు One UI 5.0 సాఫ్ట్‌వేర్ అప్డేట్ రోలౌట్ ని మొదలుపెట్టిన శాంసంగ్
  • శాంసంగ్ హామీ ప్రకారం 4 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ పొందనున్న Galaxy S21 FE

Samsung కంపెనీ ఇటీవలె తన గెలాక్సీ ఫోన్లకు One UI 5.0 సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపడం ప్రారంభించింది. గెలాక్సీ ఎస్22 సిరీస్ కి మొదటి బ్యాచ్ అప్డేట్ ని కంపెనీ రిలీజ్ చేసింది. ఇక తర్వాత గెలాక్సీ ఎస్21 సిరీస్ తో పాటు, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. దక్షిణ కొరియాలో గెలాక్సీ ఎస్22 సిరీస్ రోలౌట్ కి సంబంధించిన టైమ్ లైన్ ని శాంసంగ్ రివీల్ చేసింది. ఇతర మార్కెట్లలో కూడా కొన్ని వారాల గ్యాప్ తో లేదా ఇంచుమించుగా అదే సమయంలో రోలైట్ ఉండనుంది. అయితే ఈ జాబితాలో మిస్ అయిన ఫోన్ ఏదైనా ఉందంటే అది Galaxy S21 FE. ఇక ఈ ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయ్యింది. అయితే ఆండ్రాయిడ్ 13 అప్డేట్ కి సంబంధించిన వివరాలను శాంసంగ్ వెల్లడించలేదు.

అధికార ప్రకటన వస్తుందని వేచి చూస్తోన్న ఈ తరుణంలో, ఓ రిపోర్ట్ ద్వారా Galaxy S21 FE 5G యొక్క ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత One UI 5.0 అప్డేట్ సమాచారం రివీల్ అయ్యింది. Galaxy S21 FE యొక్క One UI 5.0 అప్డేట్ ని శాంసంగ్ ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. Samsung One UI Software Updates అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం Galaxy S21 FE అప్డేట్ ని ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ బీటా టెస్టింగ్ లో భాగం కాదు. అయితే శాంసంగ్ స్టేబుల్ పబ్లిక్ అప్డేట్ ని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. శాంసంగ్ కంపెనీ నాలుగేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. దీంతో రానున్న వారాల్లో Galaxy S21 FE ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పొందే అవకాశం ఉంది. ముందే అనుకున్నట్లుగా రిలీజ్ టైమ్ లైన్ కి సంబంధించి ఎటువంటి అధికార సమాచారం లేదు.

One UI 5.0 విశేషాలేంటి?

One UI 5.0 అప్డేట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా రూపొందింది. శాంసంగ్ లేటెస్ట్ వన్ యూఐ అప్డేట్ కి కొన్ని డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ తో పాటు, ఎన్నో కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. సిస్టమ్ యూఐ వాల్ పేపర్ కి సూట్ అయ్యే విధంగా ఆండ్రాయిడ్ కలర్ ప్యాలెట్ కి శాంసగ్ లేటెస్ట్ అప్డేట్ స్వల్ప మార్పులను తీసుకురానుంది. శాంసంగ్ నేటివ్ యాప్స్ కూడా కొత్త యాప్ ఐకాన్స్ తో రానున్నాయి.

ఇక యానిమేషన్స్ విషయానికి వస్తే, ఇదివరకటి కంటే స్మూథ్ గా ఉండనున్నట్లు శాంసంగ్ చెబుతోంది. లేటెస్ట్ One UI 5.0 కస్టమ్ స్కిన్ తో నడిచే గెలాక్సీ ఫోన్లను వాడుతోన్న వినియోగదారులు తమ ఫోన్లలో లాక్ స్క్రీన్ ని కస్టమైజ్ చేసుకుని నచ్చిన వాల్‌పేపర్లను యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి కాంటాక్ట్ కి విభిన్న కాల్ బ్యాగ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు.

ఐఓఎస్ 15 మాదిరి, శాంసంగ్ స్టాక్డ్ విడ్జెట్స్ ని హోమ్ స్క్రీన్ పై అందించింది. వివిధ రకాల విడ్జెట్స్ ని యూజర్లు ఒక దానిపై ఒకటి స్టాక్ చేసుకోవచ్చు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ద్వారా యూజర్లు ఇమేజెస్ లో టెక్ట్స్ ని కాపీ చేసి ఇతర యాప్స్ లో పేస్ట్ చేయవచ్చు. శాంసంగ్ మరెన్నో జెశ్చర్స్ కి సపోర్ట్ ని యాడ్ చేసింది. స్ప్లిట్ స్క్రీన్ కోసం రెండు వేళ్ళను పైకి స్వైప్ చేయడం వంటివి ఈ జెశ్చర్స్ కి యాడ్ చేసింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వస్తోన్న Nokia G60 5G
Next articleSony 1-ఇంచ్ సెన్సర్ తో వస్తున్న Vivo X90 సిరీస్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.