Tecno POP 7 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 22 Feb 2023 05:29:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 First Sale: నేడే Tecno POP 7 Pro ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/tecno-pop-7-pro-first-sale-via-amazon-price-specs/ Wed, 22 Feb 2023 05:29:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=5042 Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ దేశంలో తొలిసారిగా సేల్ కి వచ్చింది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గత వారం భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Tecno POP 7 Pro మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, హెచ్డీ+ డిస్ప్లే, 12ఎంపి కెమెరా సెటప్ తో వచ్చింది. Tecno POP 7 Pro డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ […]

The post First Sale: నేడే Tecno POP 7 Pro ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు అమెజాన్ ద్వారా Tecno POP 7 Pro ఫస్ట్ సేల్
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవ్వనున్న అమ్మకాలు
  • భారత్ లో Tecno POP 7 Pro 2జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.6,799 తో ప్రారంభం

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ దేశంలో తొలిసారిగా సేల్ కి వచ్చింది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గత వారం భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Tecno POP 7 Pro మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, హెచ్డీ+ డిస్ప్లే, 12ఎంపి కెమెరా సెటప్ తో వచ్చింది.

Tecno POP 7 Pro డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, టైప్-సీ పోర్ట్ అందించారు. సరే, ఓసారి Tecno POP 7 Pro ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno POP 7 Pro ధర, లభ్యత

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 2జిబి + 64జిబి మరియు 3జిబి + 64జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 3జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.7299 గా ఉంది. బేస్ వేరియంట్ ధరను రూ.6,799 గా నిర్ణయించారు. నేడు అనగా ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno POP 7 Pro లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే ప్యానెల్ 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. Tecno POP 7 Pro లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీపీయూ వాడారు. పోకో సీ50, లావా ఎక్స్3, రెడ్మీ ఏ1 వంటి ఎంట్రీ లెవెల్ ఫోన్లలో హీలియో ఏ22 చిప్సెట్ ని వాడటం జరిగింది. ఇకపోతే Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆధారిత హైఓఎస్ 11.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 12ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఒక ఏఐ లెన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ లో కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఇవ్వడం విశేషం.

Tecno POP 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. Tecno POP 7 Pro డివైజ్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయిని బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: నేడే Tecno POP 7 Pro ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 7 Pro https://www.91mobiles.com/telugu/tecno-pop-7-pro-launched-india-price-specs-availability/ Thu, 16 Feb 2023 10:09:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=4962 TECNO సంస్థ తాజాగా భారత్ లో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Tecno POP 7 Pro ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Tecno POP 6 Pro కి సక్సెసర్ గా వచ్చింది. ఇది గతేడాది సెప్టెంబర్ లో లాంచైంది. గత మోడల్ తో పోల్చితే Tecno POP 7 Pro డివైజ్ ఇంప్రూవ్డ్ కెమెరా సిస్టమ్, రెట్టింపు ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. భారత్ లో ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ కొనుగోలుదారులకి మంచి […]

The post MediaTek Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత మార్కెట్ లో లాంచైన Tecno POP 7 Pro డివైజ్
  • రూ.6,799 ధరతో భారత్ లో లాంచైన Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్
  • 12ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో వచ్చిన Tecno POP 7 Pro

TECNO సంస్థ తాజాగా భారత్ లో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Tecno POP 7 Pro ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Tecno POP 6 Pro కి సక్సెసర్ గా వచ్చింది. ఇది గతేడాది సెప్టెంబర్ లో లాంచైంది. గత మోడల్ తో పోల్చితే Tecno POP 7 Pro డివైజ్ ఇంప్రూవ్డ్ కెమెరా సిస్టమ్, రెట్టింపు ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. భారత్ లో ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ కొనుగోలుదారులకి మంచి ఆప్షన్ గా నిలవనుంది.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్, టైప్ సీ పోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno POP 7 Pro ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno POP 7 Pro ధర, లభ్యత

భారత్ లో Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధరను రూ.6,799 గా నిర్ణయించారు. 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ. 7,299 గా ఉంది. Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GPU వినియోగించారు. ఏ22 ప్రాసెసర్ ని రెడ్మీ ఏ1, పోకో సీ50, లావా ఎక్స్3, టెక్నో పాప్ 6 ప్రో ఫోన్లో వాడారు. Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఓఎస్ ఆధారిత హైఓఎస్ 11.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 2జిబి + 64జిబి మరియు 3జిబి + 64జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 2జిబి వేరియంట్ 2జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. 3జిబి ర్యామ్ వేరియంట్ 3జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno POP 7 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 12ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండటం విశేషం.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 163.86 మిల్లీ మీటర్ల పొడవు, 75.51 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ డివైజ్ ఐపీఎక్స్2 స్ప్లాష్-రెసిస్టంట్ రేటింగ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 16 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno POP 7 Pro https://www.91mobiles.com/telugu/tecno-pop-7-pro-india-launch-february-16th/ Wed, 15 Feb 2023 05:03:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4932 గత నెలలో ఆఫ్రికా లో Tecno POP 7 Pro డివైజ్ ని లాంచ్ చేసిన టెక్నో సంస్థ ఇప్పుడు భారత్ లో కూడా ఈ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తన అధికార సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా Tecno POP 7 Pro యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Tecno POP 7 Pro డివైజ్ మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి మెయిన్ కెమెరా తో […]

The post ఫిబ్రవరి 16 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno POP 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Tecno POP 7 Pro
  • తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా లాంచ్ తేదీని ప్రకటించిన టెక్నో సంస్థ
  • 2023 ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోన్న Tecno POP 7 Pro

గత నెలలో ఆఫ్రికా లో Tecno POP 7 Pro డివైజ్ ని లాంచ్ చేసిన టెక్నో సంస్థ ఇప్పుడు భారత్ లో కూడా ఈ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తన అధికార సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా Tecno POP 7 Pro యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Tecno POP 7 Pro డివైజ్ మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి మెయిన్ కెమెరా తో ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోంది.

భారత్ లో Tecno POP 7 Pro లాంచ్ తేదీ ఖరారు

పైన ట్వీట్ లో కనిపిస్తున్న విధంగా, టెక్నో సంస్థ Tecno POP 7 Pro ఫోన్ ని భారత్ లో ఫిబ్రవరి 16 న లాంచ్ చేయబోతోంది. ఆఫ్రికాలో లాంచైన వేరియంట్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందా లేదా మార్పులతో వస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితేనేం, ఈ విషయం తెలిసేందుకు మనం ఎన్నో రోజులు వేచి చూడక్కర్లేదు. రేపటితో ఏ విషయం బయటపడుతుంది. ఇకపోతే Tecno POP 7 Pro డివైజ్ భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడుకానుంది.

Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వస్తోంది. నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్ లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇచ్చారు. అలాగే ఈ డివైజ్ హెచ్డీ+ స్క్రీన్ తో వస్తోందన్న విషయాన్ని కొనుగోలుదారులు గమనించాలి. దాదాపుగా ఈ ధరల శ్రేణిలో వచ్చే ఫోన్లలో హెచ్డీ+ డిస్ప్లేనే ఇస్తున్నారు.

Tecno POP 7 Pro యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 13 ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. దీంతో పాటు ఒక క్యూవీజీఏ డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇప్పుడు బ్యాటరీ విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Tecno POP 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 16 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno POP 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>